Anupama Parameswaran : మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న భామ నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ ఆ’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, రాక్షసుడు సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అయితే గతంలో మాదిరిగా అనుపమకి అంత హిట్స్ పడడం లేదు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో అనుపమ ఉంది. అయితే అప్పుడప్పుడు అనుపమ తన సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చూసి అందరు ఆశ్చర్యపోతుంటారు.
తాజాగా ఈ క్రేజీ హీరోయిన్ ముఖమంతా గాయాలతో కనిపించి ఒక్కసారిగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది.. ఆ ఫోటో చూస్తే మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ ఫోటోలో ముఖం అంత గాయాలు అయినప్పటికీ అనుపమ చాలా హుషారుగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో అందరు ఏదో సినిమా షూటింగ్ కోసం అలా అనుపమ కనిపిస్తుంది అని భావిస్తున్నారు.. కానీ అభిమానులు మాత్రం ఆ ఫోటో చూసి కాస్త హడావిడి చేశారు… నిజానికి ఆ ఫోటో కూడా కాస్త షాకింగ్ గానే ఉంది. మరి ఏ సినిమా కోసం అనుపమ ఈ గెటప్‌లోకి మారింది అనేది మాత్రం తెలియరావల్సి ఉంది.
ఇక అనుపమ నటించిన శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కార్తికేయ 2, డీజే టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి హిట్టు కొట్టాయి.అనుపమ ఎప్పటికప్పుడు ఆమె నటించే సినిమాల్లో కొత్తదనం వెతుక్కోవడం వల్ల 10 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోంది. మధ్య మధ్యలో అనుపమని ఫ్లాపులు పలకరిస్తున్నా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది.