ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. జీతం ఎంత‌..?

ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. జీతం ఎంత‌..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరాక నిరుద్యోగుల‌కి మంచి శుభ‌వార్త‌లు అందుతున్నాయి.ఈ క్ర‌మంలోనే న్యూఢిల్లీలోని ఎడ్‌సిల్‌ (ఇండియా) లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పలు పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీక‌రించ‌డం జ‌రిగింది. ఈ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్ ద్వారా దాదాపు 257 పోస్ట్‌ల‌ని భ‌ర్తీ చేయ‌నున్నారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్య‌ర్ధ‌లు ఈ పోస్ట్‌ల‌కి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇక డిసెంబర్‌ 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి అకడమిక్/ ప్రొఫెషనల్ విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత నైపుణ్య పరీక్ష, పీపీటీ, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య: 257 కాగా, కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు : 255, పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులు : 2గా ఉన్నాయి. కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఏ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులకు ఎమ్మెస్సీ/ ఎంఫిల్‌ (సైకియాట్రిక్ సోషల్ వర్క్/ మాస్టర్స్ ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉన్న‌వారు మాత్ర‌మే దీనికి అర్హులు. తెలుగు భాషా ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. నెలకు కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు రూ.30,000. పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్ పోస్టులకు రూ.50,000 ఉంటుంది.

ap government contract jobs 2024 how to apply

కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్లకు 35 ఏళ్లు; పీఎంయూ మెంబర్స్‌/ కోఆర్డినేటర్లకు 45 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ విష‌యానికి వ‌స్తే.. అకడమిక్/ ప్రొఫెషనల్ విద్యార్హతలు, ఉద్యోగానుభవం, రాత నైపుణ్య పరీక్ష, పీపీటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. ఇక కెరియర్ అండ్‌ మెంటల్ హెల్త్ కౌన్సెలర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఇక ఎందుకు ఆల‌స్యం మీకు విద్యార్హ‌త ఉంటే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా అప్లై చేసుకోవచ్చు.