Balayya – Sreeleela : బాల‌య్య‌తో కిస్సిక్ స్టెప్పులు వేయించిన శ్రీలీల‌.. అమ్మడిలో మ‌స్త్ షేడ్స్ ఉన్నాయిగా..!

Balayya – Sreeleela : బాల‌య్య‌తో కిస్సిక్ స్టెప్పులు వేయించిన శ్రీలీల‌.. అమ్మడిలో మ‌స్త్ షేడ్స్ ఉన్నాయిగా..!

Balayya – Sreeleela : అందాల ముద్దుగుమ్మ శ్రీలీల దీపం ఉన్న‌ప్పుడు ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటుంది. ఒక‌వైపు హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ సాంగ్స్‌తోను అద‌ర‌గొడుతుంది. పుష్ప పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి చిందేసింది శ్రీలీల‌. స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్న ఈ భామ ఇలా స్పెష‌ల్ సాంగ్ చేయ‌డంపై అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే తన కొత్త చిత్రం ‘రాబిన్‌హుడ్’ సినిమా కోసం ఇటీవల విలేకరుల సమావేశంలో శ్రీలీల తాను ఎందుకు స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేశానో తన నిర్ణయాన్ని వివరించింది.

ఇది సాధారణ ఐటెమ్ సాంగ్ కాదని, దాని వెనుక బలమైన కారణం ఉందని తెలిపింది. సినిమా విడుదలయ్యాక ఆ విషయం మీకు తెలుస్తుందని శ్రీలీల చెప్పుకొచ్చింది. పలు స్పెషల్ సాంగ్స్ కోసం అడిగారని, వాటిని రిజెక్ట్ చేసినట్లు కూడా శ్రీలీల తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన కిస్సిక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇక ఇదిలా ఉంటే శ్రీలీల రీసెంట్‌గా ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా న‌డుస్తున్న‌ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కినవీన్ పోలిశెట్టితో క‌లిసి హాజ‌రైంది. ఈ ఇద్దరూ మంచి ఎనర్జీ ఉన్న స్టార్స్ కావడం వీరికి బాలయ్య తోడవడంతో ఈ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్‌గా సాగి ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

తాజాగా ఆహా టీమ్ షో నుంచి శ్రీలీల ఫోటోలు కొన్ని షేర్ చేసింది. ఇందులో బాలకృష్ణతో కలిసి శ్రీలీల పుష్ప 2 సాంగ్ కిస్సిక్.. కు స్టెప్పులు వేసినట్టు ఉంది. అలాగే వీణ వాయిస్తున్న ఫోటో ఉంది, మరో ఫొటోలో శ్రీలీల డ్యాన్స్ చేస్తుంది. దీంతో శ్రీలీల ఈ షోలో తనకు వచ్చిన అన్ని ట్యాలెంట్స్ చూపించేసింది. ఇవి చూసిన నెటిజ‌న్స్.. శ్రీలీల నీలో మ‌స్త్ షేడ్స్ ఉన్నాయిగా అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్ అందిస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేద‌ని అంటున్నారు. కాగా,శ్రీలీల ..బాల‌య్య న‌టించిన భ‌గ‌వంత్ కేస‌రి చిత్రంలో బాల‌య్య కూతురిగా న‌టించి అలరించిన విష‌యం తెలిసిందే.