BHEL లో ఖాళీలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు..

BHEL లో ఖాళీలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు..

భార‌త హెవీ ఎలక్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (BHEL) హ‌రిద్వార్‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 48 గ్రాడ్యుయేట్‌, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇంజినీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మొత్తం 48 పోస్టులు ఉండ‌గా వాటిల్లో 26 గ్రాడ్యుయేట్‌, 22 టెక్నిషియ‌న్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే జ‌న‌ర‌ల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థులు సంబంధిత కోర్సులో 65 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఎస్సీ, ఎస్‌టీ, పీడ‌బ్ల్యూడీ విభాగానికి చెందిన వారు 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు జ‌న‌ర‌ల్‌, ఈడబ్ల్యూఎస్ అయితే 18 నుంచి 27 సంవ‌త్స‌రాలు ఉండాలి. ఓబీసీల‌కు 18 నుంచి 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థులు 18 నుంచి 32 ఏళ్లు ఉండాలి. పోస్టుల‌కు ఎంపికైన వారికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే నెల‌కు రూ.9వేలు, టెక్నిక‌ల్ అయితే రూ.8వేలు స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ వ్య‌వ‌ధి 1 సంవ‌త్స‌ర కాలం పాటు ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు గాను డిసెంబ‌ర్ 26ను చివ‌రి తేదీగా ప్ర‌క‌టించారు.

bhel haridwar apprentice recruitment 2024 full details

అభ్య‌ర్థుల‌ను మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి చెందిన అభ్య‌ర్థుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. అభ్య‌ర్థుల సంఖ్య ఖాళీల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే రాత ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. అప్లికేష‌న్ ఫామ్ నింపిన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 4వ తేదీ లోగా డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివ‌రాల‌కు గాను https://hwr.bhel.com/recruitment/GdDpAppr/diploma_data_entry.jsp అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.