Bigg Boss8 : గత కొద్ది రోజులుగా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఎనిమిదో సీజన్ జరుపుకుంటుంది.సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్ షోని ఈ సారి కొత్తగా ప్రజెంట్ చేశారు. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ప్రవేశపెట్టి వారిని క్లాన్స్‌గా డివైడ్ చేసి వాళ్లలో వాళ్లకే చిచ్చు పెట్టారు బిగ్ బాస్. ఆ తర్వాత 8 మంది వైల్డ్‌కార్డు ఎంట్రీలను హౌస్‌లోకి పంపి షోపై మరింత ఆసక్తిని పెంచారు. ఇక రోజు రోజుకి హౌజ్‌లో లెక్కలు మారడంతో ఒక్కొక్కళ్లు హౌజ్ నుండి బయటకి వచ్చేశారు. మొత్తం బిగ్ బాస్ హౌజ్ నుండి 15 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి ఏడుగురు మాత్రమే మిగిలారు.
అవినాష్ ఇప్పటికే టిక్కెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి ఫినాలేకి చేరుకున్నాడు. ఇక మిగతా నలుగురు ఎవరు అయి ఉంటారనే చర్చ నడుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ ఉండనున్నట్లు సమాచారం.ఇక ఈ సీజన్ ప్రస్తుత ప్రైజ్ మనీ 54 లక్షల 30 వేలకి చేరింది. ఇది ఇంకా పెరిగే లేదా తగ్గే అవకాశం ఉందంటూ హోస్ట్ నాగ్ చెప్పారు. ఇక ప్రతి సీజన్ కూడా 105 రోజుల పాటు జరగనుంది. అంటే ఈ లెక్కన సీజన్ 8 ఫినాలే కార్యక్రమం డిసెంబర్ 13న గ్రాండ్‌గా లాంచ్ కానుందని అంటున్నారు. ఇక షోకి చీఫ్ గెస్ట్‌గా మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ వస్తారని టాక్. ఇక పలువురు స్టార్ హీరోయిన్స్ స్టేజ్‌పై తమ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే తాజా ఎపిసోడ్ అవినాష్, నబీల్ మధ్య గట్టి ఫైట్ నడిచింది. తమ తప్పులు తేల్చుకునే క్రమంలో అవినాశ్, నబిల్ మధ్య మాట మాట పెరిగింది. నబిల్ నిజస్వరూపం ఇదే అంటూ… అవినాశ్ పాత విషయాలు కూడా బయటకుతీసి మరీ గొడవేసుకున్నారు. రోహిణి అవినాశ్ కుసపోర్ట్ పలకడంతో పాటు.. కావాలని హౌస్ లో.. టైటిల్ రేస్ లో ఉన్నవారిని బ్యాడ్ చేయాలని చూస్తున్నట్టుఅనిపించింది. రోహిణి, అవినాశ్ మాత్రం నబిల్ విషయంలో నెగెటీవ్ గా మాట్లాడుకోవడం కనిపించింది. ఇక ఆతరువాత హౌస్ లోకి స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ వచ్చారు. ఆయన ఎంట్రీకూడా డిఫరెంట్ గాప్లాన్ చేశారు. వచ్చీరావడంతోనే అందరితోసరదాగా డాన్స్ చేయించారు బిగ్ బాస్. ఇక టీమ్ తో సరదాగా గేమ్ ఇందంచారు. సాంగ్ ను రివర్స్ లో ప్లే చేస్తూ.. ఓ గేమ్ ఆడించారు. సరదాగా గడిపారు. ఇక అందరికి పుష్ప సినిమా అప్ డేట్ కూడా అందించారు టీమ్.