Bigg Boss 8 : గత కొన్ని రోజులుగా ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరోవారంలో ఈ షోకి పులిస్టాప్ పడనుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోగా, వీరిలో ఎవరు విన్నర్ అవుతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నిర్వహించి విజేతను ప్రకటించనున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ పోల్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి 17 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. 14మందితో సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ ఐదో వారంలో మరో ఎనిమిది మంది యాడ్ అయ్యారు. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ టాప్ 5కి చేరుకున్నారు.
నిఖిల్, గౌతమ్ మధ్యలోనే పోటీ అని అంటున్నారు. ఎవరు విన్నర్ అనేది మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. చివరి వారం కావడంతో బిగ్ బాస్ మరింత ఫన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ మా సీరియల్స్ ఆర్టిస్ట్ లను హౌజ్‌లోకి తీసుకొచ్చి టాప్ 5 కంటెస్టెంట్లతో సరదా గేమ్‌లు ఆడిస్తున్నారు. సీరియల్ లో అర్జున్ చేసినట్టుగా పెళ్లికి అడ్డు వచ్చిన ప్రేరణని లాక్కెళ్లి తాళి కడతాడు అర్జున్. అలాగే ఇందులో కూడా ప్రేరణని లాకెళ్లి అవినాష్ తాళికట్టినట్టుగా సరదాగా స్కిట్ ప్రదర్శించారు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. వీరు కూడా తమ సీరియల్ కాన్సెప్ట్ ని చెప్పి వారిచేత అభిప్రాయం చేయించారు. నిఖిల్ తాను ప్రేమ పెళ్లికే ప్రయారిటీ ఇస్తానని తెలిపారు. అవినాష్ తనదైన స్టయిల్‌లో ప్రేమించి అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. మొత్తానికి తెగ నవ్వించాడు.
ఇక బిగ్ బాస్ హజ్‌లో ఓ సరదాగా గేమ్ హైడ్ అండ్ సీక్ ఆడారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఇందులో మొదట పోలీస్‌గా, మిగిలిన వాళ్లు దొంగగా నటించారు. నబీల్ దొరికిపోయాడు. ఆయన పోలీస్‌గా ఉన్నప్పుడు మిగిలిన వారు దాక్కున్నారు. అవినాష్ ఓ రూమ్‌లో దాచుకున్నాడు. అయితే గేమ్ అయిపోయాక బిగ్ బాస్ లైట్లు తీసేసి రూమ్ మొత్తాన్ని చీకటి చేసేశాడు. అంతేకాదు గజ్జల సౌండ్, దెయ్యం సౌండ్‌తో మరింత బయటపెట్టించాడు. ఓ రకంగా అవినాష్‌కి చుక్కలు చూపించాడు. వణికిపోయిన అవినాష్‌ని చూసి ప్రేక్షకులు తెగ నవ్వేసుకున్నారు.