Bigg Boss8 : శ‌నివార‌మే ఎలిమినేష‌న్.. ఈ రోజు ఇంకెవ‌రు ఎలిమినేట్ కాబోతున్నారు..!

Bigg Boss8 : శ‌నివార‌మే ఎలిమినేష‌న్.. ఈ రోజు ఇంకెవ‌రు ఎలిమినేట్ కాబోతున్నారు..!

Bigg Boss8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 కార్య‌క్ర‌మం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. డిసెంబ‌ర్ 13న ఫినాలే కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ హౌజ్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ . శ‌నివారం రోహిణి ఎలిమినేట్ అవుతుంది అని ఎవ‌రు ఊహించ‌లేదు. ఇక సండే ఎపిసోడ్ లో మరొకరు ఎలిమినేట్అవుతారు. దాంతో హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఫైనలిస్ట్ లుగా ఉండబోతున్నారు.ఈ రోజు ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న‌ది చర్చ‌నీయాంశంగా మారింది. అయితే అవినాశ్ ఎలాగో టాప్ 5 లో ఉన్నాడు. ఇక అతనితో పాటు నిఖిల్, గౌతమ్ బెర్త్ లు కన్ఫార్మ్ అయినట్టే. నబిల్, విష్ణు, ప్రేరణ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నార‌ని స‌మాచారం.

శ‌నివారం ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ కాగా, ఈ వార‌మే ఫ‌స్ట్ టైమ్ రోహిణి నామినేష‌న్స్‌లోకి వ‌చ్చింది రోహిణి. వ‌చ్చిన మొద‌టి సారే హౌజ్ నుంచి బ‌య‌టకి పంపించారు. ఎమోష‌న‌ల్ సీన్స్, క‌న్నీళ్లు లేకుండా న‌వ్వుతూ హౌజ్‌ను విడిచిపెట్టింది. సెల్యూట్ చేస్తూ హౌజ్‌మేట్స్ రోహిణికి సెండాఫ్ ఇచ్చారు. ఇక వేదిక‌పైకి వ‌చ్చిన రోహిణిపై నాగార్జున ప్ర‌శంస‌లు కురిపించారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొద‌టి వార‌మే ఎలిమినేష‌న్ వ‌ర‌కు వెళ్లి…ఆ త‌ర్వాత ఆట తీరు మార్చికొని సోలోగా ఫైన‌ల్ వ‌ర‌కు వ‌చ్చావు. నువ్వు ఆడిన విధానానికి ఫిదా అయ్యానంటూ నాగార్జున స్ప‌ష్టం చేశారు. ఇక హౌస్ లో హీరో ఎవరు… విలన్ ఎవరు అనేది వెల్లడించిందిరోహిణి. హీరోలుగా అవినాశ్, గౌతమ్, ప్రేరణ, విలన్స్ కాదు కాని.. కాస్ త తనతోనెగెటీవ్ గా అనుకున్నవారిలో విష్ణు ప్రియ, నిఖిల్, నబిల్ ముగ్గురు గురించి మాట్లాడింది రోహిణి.

ఫినాలే రేసులో నిల‌వ‌డానికి బ్లాంక్‌చెక్‌పై 15 ల‌క్ష‌లు ఎందుకు రాశావ‌ని న‌బీల్‌ను నాగార్జున ప్ర‌శ్నించ‌గా.. ఫైన‌ల్ చేరాల‌నే స్వార్థంతో రాశాన‌ని న‌బీల్‌ఒప్పుకున్నాడు. ఆ త‌ర్వాత ఎవిక్ష‌న్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ నోట్ల గుడ్డు వేసినందుకు రిగ్రేట్ గా ఫీల‌య్యాన‌ని రోహిణి తెలిపింది. 14వ వారంలో గౌత‌మ్‌పై నోరుజార‌డం త‌ప్ప‌ని నిఖిల్ ఒప్పుకున్నాడు. రంగుప‌డుద్ది టాస్క్‌లో గౌత‌మ్‌…నిఖిల్‌ను కావాల‌నే కొట్టాడా అనే విష‌యంలో వీడియోను చూపించాడు. కావాల‌నే కాకుండా అనుకోకుండా త‌గిలింద‌ని వీడియో ద్వారా క్లారిటీ వ‌చ్చింది. దాంతో గౌత‌మ్‌కు నిఖిల్ సారీ చెప్పాడు.అసలైన ఆటగాళ్ళు నిఖిల్, గౌతమ్ లకు ఇద్దరికి కూడా వారి గొడవ విషమంలో ఇద్దరి తప్పులను చూపిస్తూ.. నాగార్జున గట్టిగానే క్లాస్ పీకారు.