Brahmamudi December 11th Episode : బ్రహ్మముడి సీరియల్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సీతారామయ్య ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటే మరోవైపు ఆస్తి పంపకాల కోసం పెద్ద గొడవే జరుగుతుంది. రాహుల్‌కు రెండు కోట్లు ఇచ్చేలా చేయడానికి రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతారు .రాజ్ దగ్గరికి వెళ్లిన ధాన్యలక్ష్మీ చెక్ ముందట పెడుతుంది. రాహుల్ బిజినెస్ చేసుకుంటాడట అని సంతకం పెట్టమని చెబుతుంది ధాన్యలక్ష్మీ. వాటిని తల్లి లెక్కపెట్టేలోపే రాహుల్ మాయం చేస్తాడని, నీ పెంపకం మీద నమ్మకం లేదని, ఇదివరకే చాలా అవకాశాలు పొగొట్టుకున్నాడు అని సుభాష్ అంటాడు. నా మాటకే కాదు నీ మాటకు విలువ లేదు. నువ్ ఉరేసుకున్న పట్టించుకోరు ఈ డబ్బు మనుషులు అని రెచ్చగొడుతుంది రుద్రాణి.
అప్పుడు అపర్ణ, స్వప్న ఫైర్ అవుతారు. తనతో కావాట్లేదని ధాన్యలక్ష్మీ రెచ్చగొట్టి తీసుకొచ్చిందని స్వప్న అంటుంది. అనామికకు రెండు కోట్లు ఇచ్చావ్‌గా అలాగే ఇవ్వమని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆ రెండు కోట్లు నా తమ్ముడి పెళ్లి ఆగకుండా ఉండేందుకు ఇచ్చాను. ఇది నీకోసమో, కల్యాణ్ కోసమో అడిగితే ఇచ్చేవాడిని అని అంటాడు. నా హక్కుతో అడుగుతున్నాను. నా వాటా నాకు పంచండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీ వల్లే మా నాన్న హాస్పిటల్ పాలు అయ్యారుగా. ఆయన తిరిగిరాగానే ఏం చేస్తారో చూద్దాం అని సుభాష్ అంటాడు. మీ అందరికి మంచి సాకు దొరికింది. ఒకవేళ నాన్న తిరిగిరాకపోతే అని రుద్రాణి అంటుంది.
రుద్రాణి.. ఏం కూసావే అని వచ్చి రుద్రాణి చెంపచెల్లుమనిపిస్తుంది ఇందిరాదేవి. దాంతో అంతా షాక్ అయి లేస్తారు. నువ్ అసలు మనిషివేనా. ఉప్పు తిన్న ఇంటి యజమాని గురించి ఇలా మాట్లాడుతావా.. నేను తల్చుకుంటే కట్టుబట్టలతో బయటకు పంపిస్తాను అని ఇందిరాదేవి అంటుంది. ఆస్తి కోసం తండ్రి చనిపోవాలని అనుకుంటున్నావా అని సుభాష్ అంటాడు. నాకు ఆస్తిలో వాటా లేదని చెప్పడానికేగా. కానీ, నాన్న కూతురుకి ఆస్తిలో వాటా ఉందన్నాడు. నేను కూడా అడుగుతున్నాను. ఆస్తిలో వాట పంచాల్సిందే. నాకు, నా కొడుకుకు, వాడికి పుట్టబోయే బిడ్డకు వాటా రాసి ఇవ్వాల్సిందే అని రుద్రాణి అంటుంది. మీకు ఇవ్వడానికి నాకు ఏ సమస్య లేదు. కానీ, తండ్రి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చేస్తుంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని సుభాష్ అంటాడు.
ఏం చేసుకుంటావో చేసుకో పో అని ప్రకాశం గొడవ పడతాడు. ధాన్యలక్ష్మీ, రుద్రాణితో ప్రకాశం గొడవ పడే సమయంలో ఇక ఆపండి అని సుభాష్ అరుస్తాడు. ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారు. ఇంకమీతో కలిసి ఉండాలని కోరుకోవడం ఎంతో మూర్ఖత్వమో అర్థమైంది. మీలాంటి వాళ్లతో కలిసి ఉండటం కంటే విడిపోయి దరిద్రాన్ని వదిలించుకోవడమే మంచిది. రేపే లాయర్‌ను పిలిపించి మొత్తం ఆస్తి వాటాలు పంచిస్తాను అని సుభాష్ అంటాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ, రాహుల్ సంతోషిస్తారు. నీ సపోర్ట్‌తోనే ఇదంతా జరిగింది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దెబ్బకు దిగొచ్చారు అని రుద్రాణి అంటుంది. మరోవైపు పూలకుండీని కోపంగా తన్ని కాలికి దెబ్బ తగిలించుకుంటాడు సుభాష్.ఎందుకో మీ నిర్ణయం సరైంది కాదని చెప్పి మీతో చెప్పడానికి వచ్చాను. మీరు తలుచుకుంటే వాళ్లందరి నోళ్లు మూయించగలరు అని కావ్య అంటుంది.ఇప్పుడు నాన్న ఉంటే ఆయనే ఆస్తి పంచేవారు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని సుభాష్ వెళ్లిపోతాడు. ఆస్తి పంపకాలు జరిగితే తాతయ్య ప్రాణాలు అటు నుంచి అటే వెళ్లిపోతాయి. తాతయ్య జ్ఞాపకాలతో ఉన్న అమ్మమ్మ ప్రాణాలు కూడా నిలవవు అని కావ్య .. రాజ్‌తో చెప్పుకొస్తుంది. మరుసరి రోజు లాయర్ వచ్చి నా మనవరాలు అయిన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నాను అని వీలునామాను లాయర్ చదువుతాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీకి దిమ్మతిరుగుతుంది.