Brahmamudi December 6th Episode : కావ్య‌ని పిలిచి మంచి చెడులు చెప్పిన సీతారామ‌య్య‌..రుద్రాణిపై ఫుల్ సీరియ‌స్ అయిన అపర్ణ‌

Brahmamudi December 6th Episode : కావ్య‌ని పిలిచి మంచి చెడులు చెప్పిన సీతారామ‌య్య‌..రుద్రాణిపై ఫుల్ సీరియ‌స్ అయిన అపర్ణ‌

Brahmamudi December 6th Episode  : బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ గ‌త ఎపిసోడ్‌లో ఇంట్లో ప‌రిస్థితులు చూసి సీతారామ‌య్య‌కి గుండె పోటు రాగా, అత‌నిని ఆసుప‌త్రిలో జాయిన్ చేస్తారు. అప్పుడు రుద్రాణిపై ఇందిరా దేవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా, నా వాటి రాసిస్తే అయిపోయేదిగా అంటుంది రుద్రాణి. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మీ అయ్య సంపాదించింది ఇక్కడ ఏం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆడపడుచు అన్న హోదా కూడా ఉండకుండా మెడపట్టుకుని గెంటేస్తాను అని కోపంగా అంటుంది అపర్ణ. నువ్ చెప్పినట్లు వినడానికి ఆ ధాన్యలక్ష్మీలా బుద్ధి జ్ఞానం లేదనుకుంటున్నావా. అసలు ఆడవాళ్లేనా మీరు అని స్వప్న అంటుంది. అప్పుడు నిన్ను పెంచి పోషించి, చదివించి, పెళ్లి చేసి, నీ పెళ్లి పెటాకులు చేసుకుని, అయిదోతనం ఉందో లేదో అన్న స్థితిలో ఉంటే మళ్లీ నీకు ఆశ్రయం ఇచ్చి ఈ దున్నపోతును (రాహుల్) మేపి ఇంత చేస్తే ఆ పెద్ద మనిషి భిక్షతో బతికిన నువ్వు మీ అమ్మ పక్కన కూర్చుని ఓదార్చడం మానేసి వత్తాసు పలుకుతావా. సిగ్గుందా. అసలు నీదు జన్మేనా. ఛీ అని అపర్ణ తిడుతుంది.

నాకు మాత్రం మావయ్య ఇలా ఉంటే బాధగా ఉండదా. నట్టింట్లో ఉరేసుకుని నేను చనిపోవాలనుకున్నప్పుడు ఒక్కరైనా పట్టించుకున్నారా అని ధాన్య‌ల‌క్ష్మీ అంటుంది. అప్పుడు ఎవరికి తెలియవే నీ నంగనాచి నాటకాలు. ఇప్పుడు కూడా ఆస్తి మాట ఎత్తితే పక్కబెడ్‌లో చావు బతుకుల్లో పడి ఉంటావ్ అని ప్రకాశం వార్నింగ్ ఇస్తాడు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఆయనకు ఏమైనా జరగాలి. ఆయన తదనంతరం ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిపారేస్తాను జాగ్రత్త అని ఇందిరాదేవి ట్విస్ట్ ఇస్తుంది. అప్పుడే రాజ్ అక్క‌డికి రాగా, హార్ట్ ఎటాక్ వచ్చిందని అపర్ణ చెబుతుంది. ఇంతలో సీతారామయ్య కావ్య కావ్య అంటూ కలవరిస్తాడు. దాంతో డాక్టర్ వచ్చి కండిషన్ సీరియస్‌గానే ఉంది. ట్రీట్‌మెంట్ జరుగుతుంది.

కానీ, ఇప్పుడున్న పరిస్థితి తర్వాత ఉంటుందో లేదో. వెళ్లండి అని డాక్టర్ అంటాడు. నేను వస్తే తట్టుకోలేననే నిన్ను రమ్మంటున్నారు అమ్మ. నువ్ చెప్పే ధైర్యమే ఆయనకు జీవం పోస్తుంది అని ఇందిరాదేవి అంటుంది.కావ్య ఐసీయూలోకి వెళ్తుంది. రాజ్‌ను పక్కకు పిలిచి డాక్టర్ మాట్లాడుతాడు. కండిషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ఆయన బ్రెయిన్‌లో క్లాట్ ఏర్పడింది. ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేం. మీ ఫ్యామిలీకి అర్థమయ్యేలా మీరే చెప్పండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. కావ్యను చూసిన సీతారామయ్య కూర్చోమంటాడు. మీకు ఏమైనా అయితే మీ చిట్టి ఏమైపోవాలి. ఇప్పటికే గుండెపగిలేలా ఏడుస్తున్నారు అని కావ్య అంటుంది.

వాడు మాట్లాడకపోయినా మాకోసం అన్నం తీసుకొచ్చావ్. నేను లేకపోతే చిట్టిని నువ్ చూసుకోలేవా. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. రాజ్‌కు ఇష్టం లేకుండా నిన్ను తీసుకొచ్చాం. అది నీకు ఇబ్బందిగా ఉండొచ్చు. ఇకనుంచి నీకు ప్రతిరోజు పరీక్షలా ఉంటుంది. రాజ్ నీపై దురుసుగా మాట్లాడొచ్చు. నువ్ మా ఇంటి మహాలక్ష్మివి. అందరూ కలిసేలా, ఇల్లు ముక్కలు అవ్వకుండా చూస్తానని నువ్వు నాకు మాట ఇవ్వాలి అని సీతారామయ్య అంటాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా నువ్ మాత్రం ఇల్లు వదిలి వెళ్లపోవద్దు. ఇల్లు కాపాడాలి. నీ ఓర్పుతో ఇల్లు చక్కబెడతానని, అలిగి వెళ్లిపోనని నాకు మాట ఇవ్వమ్మా అని సీతారామయ్య అంటాడు.

ఈ ముసలోడు మనల్నీ నిలువెల్లా ముంచేసే ప్రయత్నం చేయట్లేదు కదా అని రుద్రాణి అంటుంది.ముసలోడు వాళ్లకు అనుకూళంగా, మనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడు. పదా బయటకెళ్లి తెలుసుకుందాం అని రుద్రాణి అంటుంది. ఇంతలో సీతారామయ్యకు సీరియస్ అవుతుంది. దాంతో నర్స్‌ను పిలుస్తుంది కావ్య. డిస్టర్బ్ చేయకండి అని కావ్యను వెళ్లమంటుంది నర్స్. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన కావ్య‌.. తాతయ్యకు అలాగే ఉంది. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు అని కావ్య అంటే.. సగం సగం చెబుతావ్ ఏంటీ. పూర్తిగా చెప్పు అని రాజ్ అంటాడు. లోపల ఏవో మంథనాలు జరిగాయి. ఏవో డీల్స్ కుదిరాయ్ అని రుద్రాణి అంటుంది. దాంతో అపర్ణ వారిస్తుంది. తాతయ్య గారు ఆరోగ్యంగా కోలుకుని వచ్చేవరకు ఇంట్లో గొడవలు పడకూడదని, వచ్చాక అందరికి న్యాయం చేస్తారని చెప్పారు అని కావ్య అబద్ధం చెబుతుంది.