Brahmamudi November 30th Episode : బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో కావ్యకి ఒళ్లు మండి రాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వంట చేసినందుకు డబ్బులు ఇస్తుంటే మీ తలతిక్క నిర్ణయాల వల్ల అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారు. ఇంకా మీకు తెలిసిరాలేదా అని కావ్య అంటుంది ప్రతీది డబ్బుతో కొనలేరు అని కావ్య అంటుంది. అవునురా సంతోషాన్ని, విశ్వసాన్ని, నిద్రను కొనలేవు అని ప్రకాశం అంటాడు. చిడతల బృందం భజన వాయిస్తోంది. ఈమె వల్ల మా వదిన ప్రాణాలకు తెచ్చుకుంది. ఆ కనకం ఏదో వండి పంపిస్తే కావ్య అన్నపూర్ణ అంశంతో పుట్టిన కారణజన్మురాలిలా కనిపిస్తుందా అని రుద్రాణి అంటుంది. ఈ నాటకానికి పులిస్టాప్ పెట్టేందుకు పనిమనిషిని మాట్లాడాను. కమ్మగా వండుతుంది. నాలాంటి వాళ్లకి కొసరి కొసరి వడ్డిస్తుందని రాజ్ అంటాడు.
అయితే ఆమె పేరు ఏంటని రాహుల్ అడగగా, స్టెల్లా అని రాజ్ చెబుతాడు. జీతం ఎంతని రుద్రాణి అడుగుతుంది. నెలకు లక్ష రూపాయలు అని రాజ్ అంటాడు. దుగ్గిరాల ఇంటి పనిమనిషి అంటే ఆమాత్రం ఉండాలి. అయితే అన్ని వంటలు చేయించుకోవచ్చు అని రుద్రాణి అంటుంది. ఇక మీరందరూ గ్రూప్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆయన కుక్కను తీసుకొస్తానంటున్నారు. కరిస్తే ప్రాణాలకు ప్రమాదం. సారీ సారీ కుక్ కదు అని కావ్య వెటకారంగా అంటుంది. మనల్నీ మనం నమ్మితేనే కదా అనుకున్నది సాధించగలం. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు ఎక్కువ టాలెంట్ చూపిస్తారో, ఎవరు ఎక్కువ నమ్మకంగా ఉంటారో వాళ్లకు సక్సెస్ వస్తుంది అని అప్పు అంటుంది.
నేను నీకు నచ్చినట్లు లేనందుకు నీకెప్పుడు కోపం రాలేదా అని కల్యాణ్ అంటాడు. ఎందుకు రావాలి. ఇది జీవితం. ఎవరి ఇష్టాలను వాళ్లం గౌరవించాం ఇంకెందుకు కోపం అని అప్పు అంటుంది. మరోవైపు కావ్య ఇంటికి రావడం గురించి రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటారు. మీరు కావ్య రావడంపై ఎందుకు భయపడుతున్నారో తెలుసు ఆంటీ. కావ్య వస్తే ఆస్తి పంపకాలు జరగవనే కదా. కావ్య రాకూడదని కోరుకుంటున్నారు అని స్వప్న అంటుంది. కావ్య మొండిది. అనుకుంది సాధించే వరకు ఊరుకోదు. కాలేజ్‌లో నా చేయి పట్టుకున్నాడని లెక్చరర్‌ను సస్పెండ్ చేసేవరకు గ్రౌండ్‌లో వారం రోజులు కూర్చుంది. ఇక తన కాపురాన్ని ఎలా వదులుకుంటుంది అని స్వప్న అంటుంది.
ఇక తర్వాతి రోజు ఇందిరాదేవి, సీతారామయ్య భోజనం చేస్తుంటారు. కావ్య నీకోసం కూడా వండింది తినమని అంటారు. తినను అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్ తెచ్చుకున్న పిజ్జా బాగుండదు. దాంతో ఆకలితో అలమటిస్తుంటాడు రాజ్. దాంతో దొంగలా అటు ఇటు చూసి అన్నం పెట్టుకుని తింటాడు రాజ్. ఆకలితో చాలా ఫాస్ట్‌గా తినేసరికి రాజ్‌కు పొలమారుతుంది.దాంతో ఇందిరాదేవి, సీతారామయ్య వచ్చి నీళ్లు ఇస్తారు. అది చూసి రాజ్ అవమానంగా ఫీల్ అవుతాడు.. కావ్య వండినా మనింట్లోనే కదా. తిను అని ఇందిరాదేవి అంటుంది. తినబోయి మళ్లీ ఆగిపోతాడు రాజ్. కావ్యకు తెలిస్తే చులకన అయిపోతాను అని రాజ్ అంటాడు. భర్త ఆకలి తీరుతో ఏ భార్య అయినా సంతోషంగానే అనుకుంటుందిరా. అయినా మేము కావ్యకు చెప్పములే అని సీతారామయ్య అంటాడు. కావ్య చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు.
రాజ్ ఇంతకీ నువ్ చెప్పిన స్టెల్లా ఇంకా రాలేదు అని రాహుల్ అంటాడు. త్వరలో వస్తుంది అని రాజ్ అంటాడు. ఏదిరా ఇంకా రాలేదు అని స్టెల్లా గురించి ఆతృతగా అడుగుతాడు ప్రకాశం. ఏంటీ మిమ్మల్ని చూస్తుంటే హారతి పట్టేలా ఉన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. నా గురించి నీకెందుకే అని ప్రకాశం అంటాడు. ఇంతలో పనిమనిషి స్టెల్లా కారులో వస్తుంది. ఆమెను చూసి అంతా షాక్ అవుతారు. సుభాష్‌కు అపర్ణ విడాకులు ఇస్తున్నట్లు రాజ్ చెబుతాడు. అత్తయ్య మావయ్యకు విడాకులు ఇవ్వడం ఏంటీ అని కావ్య అంటుంది. దాంతో షటప్ అని రాజ్ కోప్పడతాడు. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారు అని రాజ్ అంటాడు.