Brahmamudi Novemvber 17th : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో జగదీష్ ప్రసాద్‌కి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. రాజ్, కావ్య విడిపోయారని, స్వరాజ్ గ్రూప్ కంపెనీ కష్టాల్లో ఉందని అనామిక చెప్పిన మాటలని జగదీష్ నిజమని నమ్మేస్తాడు. అయితే జగదీష్ ఆఫీసుకి వచ్చిన సమయంలో కావ్య, రాజ్‌లు గొడవ పడడంతో ఆయన వారిద్దరు విడిపోయిన విషయం నిజమని నమ్ముతారు. మరోవైపు జగదీష్ ప్రసాద్ ఇచ్చిన డీల్ క్యాన్సిల్ అయితే కావ్యనే ఎప్పటికీ సీఈవోగా కొనసాగుతుందని రాజ్ భయపడిపోతాడు. ఒకవేళ మేము విడిపోతే ఒకే ప్రాజెక్ట్‌పై ఎందుకు కలిసి పనిచేస్తామని జగదీష్ ప్రసాద్‌ను నమ్మించేందుకు నాటకం ఆడటం మొదలుపెడతాడు రాజ్. ఇక ఆయనని నమ్మించేందుకు కావ్య నడుముపై చేయివేస్తాడు రాజ్. ఆమె కిందపడబోతుండగా పట్టుకుంటాడు. కావ్య, రాజ్ రొమాన్స్ చూసి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నది అబద్ధమని జగదీష్ ప్రసాద్ అనుకుంటాడు.
జగదీష్ ప్రసాద్ నమ్మించడానికి తన నడుముపై చేయి ఎందుకు వేశారని రాజ్‌పై కావ్య మండిపడుతుంది. అంతమంది ముందు నన్ను ఎందుకు టచ్ చేశారంటూ గోల చేస్తుంది. అయితే అప్పుడు రాజ్ మనకి డీల్ పోతుందని, ఆయనని నమ్మించడానికి ఇలా చేయాల్సి వచ్చిందని అంటాడు. అయితే మా అమ్మ మనల్ని కలపడం కోసం క్యాన్సర్ వచ్చినట్లుగా నాటకం ఆడిందని, ఆమె నాటకంలో ఎలాంటి తప్పు లేదని రాజ్‌తో వాదిస్తుంది కావ్య. అది ఇది ఒకటి కాదంటూ రాజ్ సమాధానమిస్తాడు. ఆఫీసులో జరిగిన విషయాన్ని సీతారామయ్యకు చెబుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. నా మనవడు – మనవరాలు ఒక్కటైపోతే కంపెనీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని చెబుతాడు సీతారామయ్య. తనకు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చిందని అప్పూకి కళ్యాణ్ చెబుతాడు.
ఇంత తేలిగ్గా అతను ఛాన్స్ ఇవ్వడని నువ్వు అగ్రిమెంట్ ఏమైనా చేశావా అని ప్రశ్నిస్తుంది అప్పూ. ఆ మాటలతో కళ్యాణ్ షాక్ అవుతాడు. పందెంలో గెలవాలనే ఉద్దేశంతో రాత్రంతా కూర్చొని డిజైన్లు వేస్తూ ఉంటుంది కావ్య. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. జగదీష్ ప్రసాద్ ఆవేశం అంతా ఓ డ్రామా అని బయటపడుతుంది. సీతారామయ్య ప్లాన్ ప్రకారమే జగదీష్ ఇదంతా చేశాడని తెలుస్తుంది. యాక్టింగ్‌లో రాజ్ ఇరగదీశాడని, కావ్య జీవించేసిందని అంటాడు.తాను లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్ జాయిన్ అయిపోయిన సంగతి అప్పుకు చెబుతాడు కళ్యాణ్. ఆ విషయం చెప్పగానే అప్పు సంతోషంగా ఫీలవుతుంది. కానీ లక్ష్మీకాంత్ దగ్గర మూడేళ్లు పనిచేస్తానని అగ్రిమెంట్ రాసి ఇచ్చిన సంగతి మాత్రం అప్పు దగ్గర దాచేస్తాడు.
ఇక కావ్య తాను వేసిన డిజైన్స్‌ని క్యాబిన్‌లో పెట్టి బయటకు వెళుతుంది. ఆ డిజైన్స్ దొంగతనం చేయాలని రాజ్ ఫిక్స్ అయిపోతాడు. అయితే దొంగతనం చేయడానికి రాజ్ మనసు ఏ మాత్రం ఒప్పుకోదు. ఇక కళావతిని పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకున్నానని, ఈ రకంగానైనా తన రుణం తీర్చుకునే అవకాశం కావ్యకు దొరికిందని తనకు తానే సర్ధిచెప్పుకుంటాడు. ఇక కావ్య వేసిన డిజైన్స్‌ను ఫోన్‌లో ఫొటో తీసుకోవడానికి సిద్ధమవుతాడు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడంతో దానికోసం తిరిగి క్యాబిన్‌లోకి వస్తుంది కావ్య. కళావతి రావడం చూసి కంగారులో టేబుల్ కింద దాక్కుంటాడు రాజ్. డిజైన్స్ ఓపెన్ చేసి కనిపించడంతో తన క్యాబిన్‌లోకి ఎవరో వచ్చారని కావ్య అనుమానపడుతుంది. అయితే దొంగతనం చేసే క్రమంలో కావ్య రాజ్‌కి దొరికాడా లేదా అనేది సస్పెన్స్.