Brahmamudi Serial Today December 10th : బెడ్‌ని రెండు పార్ట్‌లుగా డివైడ్ చేసిన రాజ్.. ఆస్తి కోసం స‌రికొత్త స్కెచ్‌లు వేస్తున్న రుద్రాణి

Brahmamudi Serial Today December 10th : బెడ్‌ని రెండు పార్ట్‌లుగా డివైడ్ చేసిన రాజ్.. ఆస్తి కోసం స‌రికొత్త స్కెచ్‌లు వేస్తున్న రుద్రాణి

Brahmamudi Serial Today December 10th : బ్ర‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కావ్య బెడ్ రూంలో ప‌డుకోకుండా బ‌య‌ట ప‌డుకునే స‌రికి రాజ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి తిడుతుంది అపర్ణ‌. నీ భార్య‌ని ప‌ట్టించుకోకుండా పరాయిదానిలా చూస్తావా..? పట్టించుకోవా..? అంటూ నిలదీస్తుంది. ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా..? మీ తాతయ్య నాన్నమ్మ కావ్యకు మాటిచ్చి తీసుకొచ్చారు. పెద్ద వాళ్ల మాట కాదనలేక తిరిగి వచ్చింది అని అపర్ణ చెప్తుంది. అప్పుడు రాజ్.. నేను త‌న‌ని ఇంట్లోకి రావొద్ద‌ని చెప్పానా అని అంటాడు. అయితే రాజ్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి కూడా నిన్ను రూంలోకి రావొద్దని చెప్పానా అని అంటాడు. నువ్వు రాకపోతే రమ్మని అనను.. వస్తే పొమ్మని అనను అని చెబుతాడు.

అప్పుడు అప‌ర్ణ.. రాజ్ మాట‌ల‌కి చిరాకు చెంది ఒరేయ్‌ ఇలా వంకరటింకరగా మాట్లాడకు నీ గదికి తీసుకెళ్లు అంటుంది అపర్ణ. రూంలోకి వెళ్లమని అపర్ణ చెప్పగానే కావ్య వెళ్తుంది. రూంలో రాజ్‌ బెడ్‌ మీద మధ్యలో ప్లాస్టర్‌ వేస్తాడు. ఏంటని కావ్య అడగ్గానే బెడ్‌ మీద ఆ సగం నీకు ఈ సగం నాకు నా భాగంలోకి నువ్వు రావొద్దు.. నీ సగంలోకి నేను రాను అని చెప్తాడు రాజ్‌. కోపంగా మనసును ముక్కలు చేయడం.. బెడ్‌ను ముక్కలు చేయడం మీ అంతట మీరు పిలిచే లోగా నేను ఈ బెడ్‌నే ముట్టుకోను అంటుంది కావ్య‌. హమ్మయ్యా అయితే థాంక్స్‌ నీ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ నాకు నచ్చింది. ఏదో ఒక రోజు నేను పిలిచే లోగా ఇటువైపు చూడకు అంటాడు..రుద్రాణి ఆలోచిస్తూ ఉంటే రాహుల్‌ వెళ్లి ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా.? అని అడగ్గానే ఈ ఇంట్లో నేను ఎప్పుడు సంతోషంగా పడుకున్నాను అంటుంది.

ఎవరినో ఒకరిని టార్చర్‌ చేయాలి కదా..? అని రాహుల్ అన‌గా, రుద్రాణి తిడుతుంది. అయినా తాతయ్య మనకు కూడా ఆస్థిలో వాటా ఇస్తానన్నాడు కదా..? ఇంకా ఆలోచించడం దేనికి అని అడుగుతాడు.. అప్పుడు రుద్రాణి మాట్లాడుతూ.. చెక్ తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు కొత్తగా బిజినెస్‌ చేయాలనకుంటున్నట్టు చెప్పి రెండు కోట్ల రూపాయలు ఇవ్వని అడుగు అని చెప్తుంది. రాజ్‌ నాకు రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాడు మమ్మీ అంటాడు. ఇవ్వడని నాకు తెలుసు కానీ ఆ ఇవ్వని చెక్‌ తీసుకెళ్లి ధాన్యలక్ష్మీ దగ్గర మంట పెట్టొచ్చు అని తన ప్లాన్‌ చెప్తుంది రుద్రాణి. మరుసటి రోజు రాజ్‌, ప్రకాష్‌ వర్క్‌ చేసుకుంటుంటే రాహుల్‌ వెళ్లి రెండు కోట్లకు చెక్‌ ఇవ్వమని అడుగుతాడు.డైమండ్‌ బిజినెస్‌ పెట్టాలనుకుంటున్నాను అని చెప్తాడు రాహుల్‌.

అందులో నీకు ఎక్స్‌ఫీరియెన్స్‌ లేదు కదా.. అంటాడు ప్రకాష్‌.. నా కొడుకు బాగుపడాలని ఎవ్వరికీ లేదు.. వాడు జీవితాంతం ఇలా కింది స్థాయిలోనే ఉండిపోవాలా..? అని నిలదీస్తుంది రుద్రాణి. ఇంతలో రాహుల్‌ అదంతా కాదు రాజ్‌ నువ్వు ఇస్తావా..? లేదా..? అంటూ అడుగుతాడు. రాజ్‌ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను అంటాడు ప్రకాష్‌. అయితే ఏం చేయాలో నాకు తెలుసు అంటూ వెళ్లిపోతుంది రుద్రాణి. అప్పుడు ధాన్య‌ల‌క్ష్మీకి ఈ విష‌యం చెబుతుంది రుద్రాణి. రాజ్‌ ఎందుకు డబ్బులు ఇవ్వనన్నాడు అని ధాన్యలక్ష్మీ అడిగితే మేమంటే చిన్నచూపు అందుకే ఇవ్వలేదని చెప్తుంది రుద్రాణి. రాహుల్‌ కూడా అమాయకంగా నటిస్తూ అత్తయ్యా ఈ టైంలో మీరే నాకు హెల్ప్‌ చేయాలి. ఆ రెండు కోట్లు మీరిప్పిస్తే నేను బిజినెస్‌ చేసుకుంటాను అని చెబుతూ ధాన్య‌ల‌క్ష్మీని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.