Brahmamudi Serial Today December 1st Episode : బ్రహ్మముడి గత ఎపిసోడ్లో రాజ్ తన తల్లిని తీసుకొచ్చేందుకు కావ్య ఇంటికి వెళతాడు. అక్కడ కనకం కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అపర్ణతో పనులు చేయిస్తూ ఉంటుంది. అది చూసి రాజ్ మండి పడుతూ ఉంటాడు. నీకు ఇలాంటి కర్మ ఏంటి మమ్మీ మన ఇంటికి వెళ్దాం పద అనగా నేను రాను అని అంటుంది అపర్ణ. ఇక తాజా ఎపిసోడ్లో పని మనిషి స్టెల్లా కోసం అందరు ఎదురు చూస్తున్న సమయంలో కారు నుండి ఓ లేడి దిగుతుంది. . స్లీవ్‌లెస్ టీ షర్ట్, కళ్లకు బ్లాక్ షేడ్స్ పెట్టుకుని ఎంతో స్టైల్‌గా వస్తున్న ఆ అమ్మాయిని చూసి పనిమనిషి స్టెల్లా అనుకుని చూస్తారు. ఇక ఆమె ఇలా వసతుంటే అందరు ఆమె అందానికి ఫిదా అయి అలా చూస్తుండిపోతారు.
ఇక స్టెల్లా ఇంట్లో అడుగుపెట్టగానే అందరు కూడా వంటల గురించి డిస్కషన్లో పాల్గొంటారు . ఎలాంటి వంటలు వండుతావ్, స్టార్ హోటల్లో చెఫ్ అంటే కాంటినెంటల్ వంటి అన్ని రకాల వంటలు వచ్చు కదా అని రుద్రాణితోపాటు మిగతా వారు కూడా వంట లిస్ట్ చెప్పగా, అప్పుడు తను వంట మనిషి కాదని లాయర్ అని చెబుతుంది. విడాకుల పేపర్స్ ఇవ్వడానికి అని చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ విడాకులు పేపర్స్ తనకు కావ్య పంపించిందేమో అనుకున్న రాజ్ అడుగుతాడు ఇక్కడే ఉండే డివోర్స్ పంపించావా.. నాకు కావాల్సింది అదే. నేనే విడాకులు ఇస్తాను అని రాజ్ అంటాడు. దాంతో నేను ఎందుకు పంపిస్తాను. ఆ విడాకులు నేను పంపించలేదు అని కావ్య అంటుంది.
ఇక ఆ విడాకుల పేపర్స్ చూసి రాజ్ షాక్‌లో ఉండిపోతాడు. అంతలా షాక్ అయ్యావ్ అని తండ్రి సుభాష్ అడుగుతాడు. మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్లు నోటీస్ పంపించింది డాడీ అని రాజ్ చెబుతాడు. దాంతో ఇంట్లో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. పక్కనే ఉన్న కావ్య అత్తయ్య గారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏమిటి అని చాలా అమాయకంగా అడుగుతుంది. దాంతో రాజ్ కోపంతో కావ్యపై అరుస్తాడు. మీరంతా కలిసి మా మమ్మీకి ఏవో నూరుపోశారు. కనకం, కావ్య కావాలనే తన తల్లిని ఇంటికి పిలిపించుకుని లేనిపోనివి చెప్పి ఇలా చేయిస్తున్నారని, దీనంతటికి కారణం కావ్యనే అని రాజ్ నిందిస్తుండడంతో దానికి రుద్రాణి మరింత ఆజ్యం పోస్తుంది.
ఇక రాజ్ మాటలపై తండ్రి సుభాష్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.. ఎవరెలా పోయినా నాకు సంబంధం లేదు. నాకు నా భార్య ముఖ్యం. జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్యని ఎవరి కోసం నేను దూరం చేసుకోను అని సుభాష్ ఆవేశంగా చెప్పడంతో రాజ్ తన తల్లిని రేపటి వరకు ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అంటాడు రాజ్. ఇక రాజ్ మనసులో అనేక ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. అపర్ణను ఇంటికి తీసుకురావాలంటే కావ్యను కూడా భార్యగా ఒప్పుకుని దుగ్గిరాల ఇంటికి తీసుకురావాలి. తండ్రి కోసం కావ్యను అత్తింటికి తీసుకొస్తాడని లేదంటే మరేదైన ప్లాన్ వేస్తాడా అనేది తర్వాతి ఎపిసోడ్లో తెలియనుంది.