Brahmamudi Serial Today December 2nd Episode : ఇంట్లోకి అడుగుపెట్టిన స్టెల్లా.. ఆమె ప‌నుల‌కి బిత్త‌ర పోతున్న కుటుంబ స‌భ్యులు

Brahmamudi Serial Today December 2nd Episode : ఇంట్లోకి అడుగుపెట్టిన స్టెల్లా.. ఆమె ప‌నుల‌కి బిత్త‌ర పోతున్న కుటుంబ స‌భ్యులు

Brahmamudi Serial Today December 2nd Episode : కొద్ది రోజులుగా ప‌ని మనిషి స్టెల్లా కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, ఆమె ఎట్ట‌కేల‌కి ఇంట్లోకి అడుగుపెట్టింది. కొత్త పనిమనిషి స్టెల్లా రావడంతో రాహుల్, ప్రకాశం ఇద్దరు మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ ఆమెతో ముచ్చ‌టేస్తుంటారు.. అప్పుడు రాజ్ రెచ్చిపోయి ఇకమీదట ఎవరి వంటలు తినాల్సిన అవసరం లేదు చెబుతాడు. అయితే అప్పుడు స్టెల్లా తాను వంట చేయాలంటే మినిమం ముగ్గురు అసిస్టెంట్లు కావాలి అనడంతో నేను, రాజ్, ప్రకాశం ముగ్గురం హెల్ప్ చేస్తాము అనడంతో ఆమె సరే అని అంటుంది. ఆమె టచ్ చేయగా ప్రకాశం రాహుల్ తెగ మెలికలు తిరుగుతూ ఉంటారు. ఇంతకీ అన్ని రకాల వంటలు వచ్చా అని ప్రకాశం అడిగితే.. నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని రకాల వంటలు వచ్చని స్టెల్లా అంటుంది. ఒక్కొక్కరు లిస్ట్ చెబుతారు. దాంతో మరి నా అసిస్టెంట్స్ ఎక్కడ అని స్టెల్లా అడుగుతుంది.

వంటకే త‌న‌కి ముగ్గురు అసిస్టెంట్స్ కావాలంటుంది అంటే మరి బాత్రూమ్‌ కడగడానికి ఇంకెంతమంది కావాలంటుందో అని ఇందిరాదేవి అంటుంది. ఛీ ఛీ నేను బాత్రూమ్స్ కడగను అని స్టెల్లా అంటుంది. ఈమెకె లక్ష అంటే ముగ్గురు అసిస్టెంట్స్‌కు మరో లక్ష కావాలి కదరా అని సుభాష్ అంటాడు.. నడుము తిప్పడమేనా గరిట తిప్పేది ఏమైనా ఉందా. మా పులిహారను తీసుకెళ్లు. అంట్లు బాగా కడుగుతాడు అని ధాన్యలక్ష్మీ అంటుంది.మా డెలిషియస్‌ను కూడా తీసుకెళ్లు. సింగిల్‌గా వచ్చినదానివి డబుల్‌గా వెళ్తావ్ అని స్వప్న అంటుంది. అంటే కడుపు చేసి పంపిస్తాడని స్వప్న సెటైర్ వేస్తుంది. దాంతో ఏంటీ. అలా ఎలా అని స్టెల్లా అడిగితే.. ముందు ముందు అర్థం అవుతుందని స్వప్న అంటుంది. స్టెల్లాకు కిచెన్ చూపించడానికి ప్రకాశం, రాహుల్ పోటీ పడతారు.

ఇద్దరు స్టెల్లా చెరో చేయి పట్టుకుని కిచెన్‌కు తీసుకెళ్తారు రాహుల్, ప్రకాశం.. కిచెన్ ఇంత డర్టీగా ఉంది. ఎవరు క్లీన్ చేస్తారని స్టెల్లా అంటే.. ప్రకాశం, రాహుల్ క్లీన్ చేస్తారు.ఇక‌ వెజిటేబుల్స్ ఎవరు కట్ చేస్తారు చెర్రీస్ అని స్టెల్లా అంటుంది. రాజ్ చేస్తాడని రాహుల్ అంటాడు. సరే నేను చేస్తాను అని రాజ్ అంటాడు. ప్రకాశం ఓవర్‌గా బిల్డప్ ఇస్తుంటే స్టెల్లా ఉండి డిష్ వాష్ చేయమని చెబుతుంది. డిష్ వాష్ కంటే వెజిటేబుల్స్ కట్ చేయడం బెటర్ కదా. అందుకే కకృత్తి పడొద్దు అని రాజ్ అంటాడు. స్టార్ హోటల్ రేంజ్‌లో కట్ చేయాలి. మళ్లీ వెజిటేబుల్స్ తీసుకొచ్చి కట్ చేయమని చెబుతుంది స్టెల్లా.ఇప్పుడు మళ్లీ కొత్త వెజిటేబుల్స్ తేవాలా అని రాజ్ అంటాడు. అలా లేకుంటే నేను వంట చేయలేనని స్టెల్లా అంటుంది.

ప్రకాశం, రాహుల్‌, రాజ్‌ను ముప్పుతిప్పలు పెట్టి వాళ్లతోనే వంట చేయిస్తుంది స్టెల్లా. ఈ వంటను డైనింగ్ టేబుల్‌పై పెట్టుకుని మీరే వడ్డించుకుని తినండి అని స్టెల్లా అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వే కొసరికొసరి వడ్డిస్తావని అనుకున్నా స్టెల్లా అని ప్రకాశం అంటాడు. కుకింగ్ సెషన్ మాత్రమే నేను చూసుకుంటాను. మిగతావి ఎవరి వైఫ్‌తో వారు వడ్డించుకుంటారు అని స్టెల్లా అంటుంది. ఇక స్వప్న హెల్ప్ చేయొచ్చు కదా అని రాజ్ అంటే.. లక్ష పెట్టి పనిమనిషిని పెట్టావ్. నేనెందుకు చేస్తాను అని స్వప్న అంటుంది. రాజ్ వాటర్ మర్చిపోతాడు. ప్రకాశంను పిలిచి అక్కడ కళ్లతో తినింది చాలు ఇక్కడ నోటితో తిందాం రా అని రాజ్ అంటాడు.ఇక ఆ త‌ర్వాత త్వరగా పదినిమిషాల్లో తినండి. లేకుంటే తర్వాత బాగుండవు. వేస్ట్ అవుతుంది. నేను వాడిన ఇంగ్రీడియన్స్ అలాంటివి. పదినిమిషాల్లో పాడైపోతాయ్ అని స్టెల్లా అంటుంది. భార్యను పక్కన పెట్టి ఇల్లును హోటల్ చేశావ్ కదరా. పదినిమిషాల్లో పాచిపోయే ఆ తిండి నాకెందుకురా అని సీతారామయ్య అంటాడు.