Brahmamudi Serial Today December 9th Episode : ఆస్తుల కోసం ర‌చ్చ చేస్తున్న ధాన్య‌ల‌క్ష్మీ.. కుమిలి కుమిలి ఏడుస్తున్న ఇందిరా దేవి

Brahmamudi Serial Today December 9th Episode : ఆస్తుల కోసం ర‌చ్చ చేస్తున్న ధాన్య‌ల‌క్ష్మీ.. కుమిలి కుమిలి ఏడుస్తున్న ఇందిరా దేవి

Brahmamudi Serial Today December 9th : బ్ర‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి.సీతారామ‌య్య ఆసుప‌త్రిలో కోమాలో ఉండ‌గా, రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మీలు ఆస్తి పంప‌కాల కోసం ప‌ట్టుబ‌డ‌తారు. అయితే వారిని అంద‌రు తిడ‌తారు. అప్పుడు ధాన్య‌ల‌క్ష్మీ నా నోరు నొక్కేయాలని చూస్తున్నారా..? ఆస్థులు పంచకుండా దాటవేయాలని చూస్తున్నారా..? అని అడుగుతుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా ఆపండి ఎవరు మీరంతా.. ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఉన్నవాళ్లేనా..? ఇంటి పెద్దకు ఆపదొస్తే ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడతారు. ఆయనుక ఏదైనా అయితే ఆస్థులు ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తారా..? నాకు ఇంత కష్టం వస్తే ఓదార్చడం పోయి కనీసం భోజనం కూడా చేయకుండా చేస్తున్నారు.. అంటూ బాధపడుతుంది ఇందిరాదేవి. తర్వాత కావ్య భోజనం రెడీ చేస్తుంటే అపర్ణ వచ్చి భోజనం ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అమ్మమ్మ గారి కోసం తీసుకెళ్తున్నాను అని ఉదయం కూడా తినలేదని ఇప్పుడు కూడా తినకుండా టాబ్లెట్స్‌ వేసుకోకపోతే బీపీ డౌన్‌ అవుతుంది అని చెబుతుంది.

త‌ర్వాత రూమ్‌లోకి వెళ్లి చూస్తే ఉండ‌దు. హాస్పిటల్లో సీతారామయ్య దగ్గర కూర్చుని బాధపడుతుంది ఇందిరా దేవి. ఏంటి బావ ఇది ఇలా ఉలుకు పలుకూ లేకుండా ఇలా పడుకున్నావు. లేవు బావ కళ్లు తెరువు నీ చిట్టితో మాట్లాడు.. నువ్వు బాగున్నావు అని చెప్పు.. అంటూ ఏడుస్తుంది. ఇంతలో కళ్యాణ్‌ వస్తాడు. తాతయ్యకు ఏం కాదు నాన్నమ్మ.. తొందరలోనే కళ్లు తెరచి మనందరిని చిరునవ్వుతో పలకరిస్తాడు. మన ఇంట్లో హుషారుగా తిరుగుతారు. అందరితో కలిసి భోజనం చేస్తారు అని కళ్యాణ్‌ చెప్పగానే ఆ ఆశలు చచ్చిపోయాయి కళ్యాణ్‌. ఆ ఇంట్లో ఆనందపు ఆనవాళ్లు లేకుండా పోయాయి అని అటుంది. పచ్చగా పెరిగే చెట్టుకు చెదలు పట్టినట్టు కుళ్లు కుతంత్రం అనే చెదలు ఆ ఇంటికి పట్టింది. అంటూ బాధపడుతుంది.

ఇంత‌లో కావ్య వ‌చ్చి మీరు ఇలా వచ్చేస్తే ఎలా..? మీరు కనిపించకపోయే సరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా..? అంటూ కావ్య అడగ్గానే..ఇందిరాదేవి ఏడుస్తుంది. తర్వాత కావ్య.. ఇందిరాదేవికి అన్నం తినిపిస్తుంది.ఇక ళ్యాణ్‌ను తాతయ్యగారి గురించి డాక్టర్లు ఏమన్నారు అని అడుగుతుంది కావ్య‌. దీంతో డాక్టర్లు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు వదిన అని కళ్యాణ్‌ చెప్పగానే కావ్య బాధపడుతుంది. ఇంతకీ అప్పు ఎక్కడ అని అడగ్గానే తను ఎస్సై సెలెక్షన్‌లో సెలెక్ట్‌ అయింది. ట్రైనింగ్‌ కు రమ్మని లెటర్‌ వచ్చింది అందుకే ట్రైనింగ్‌కు వెళ్లింది అని కళ్యాణ్ అంటాడు. ఇక ధాన్య‌ల‌క్ష్మీ బాండ్ పేప‌ర్స్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ప్రకాష్‌ వచ్చి పేపర్స్‌ లాక్కుని చూసి పేపర్స్‌ చించివేస్తాడు.

ప్రకాష్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిట్టి వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మీ మాత్రం నేను చేయాలనుకున్నది చేస్తాను అనుకుంటుంది. కిచెన్‌ లో పడుకున్న కావ్య దగ్గరకు అపర్ణ వస్తుంది. నువ్వేంటి ఈ ఇంట్లో నీ స్థానమేంటి అసలు ఎందుకు ఇక్కడ పడుకున్నావు వాడు రావొద్దన్నాడా..? తలుపు వేసుకున్నాడా..? అసలు నువ్వు గదికే వెళ్లలేదా..? అని అడుగుతుంది. కావ్య తాను వెళ్లలేదని.. ఆయన పిలవకుండా నేను ఆ గదిలోకి ఎలా వెళ్లాలి అంటుంది. హాల్లోకి వెళ్లిన అపర్ణ.. రాజ్‌ను పిలిచి కావ్య ఇంత రాత్రి అయినా కావ్య‌ నీ గదికి రాకపోతే ఎక్కడికి వెళ్లింది అని ఆరా తీసే బాధ్యత నీకు లేదా..? అంటూ నిలదీస్తుంది. దాంతో తాజా ఎపిసోడ్‌కి పులిస్టాప్ ప‌డుతుంది.