Brahmamudi Serial Today November 16th Episode : కావ్య- రాజ్‌లను నిలదీసిన జ‌గ‌దీష్‌… కావ్య నడుము గిల్లిన‌ రాజ్

Brahmamudi Serial Today November 16th Episode : కావ్య- రాజ్‌లను నిలదీసిన జ‌గ‌దీష్‌… కావ్య నడుము గిల్లిన‌ రాజ్

Brahmamudi Serial Today November 16th Episode : బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ 16వ ఎపిసోడ్‌లో అనేక కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గ‌త ఎపిసోడ్‌లో రుద్రాణి చెప్పుడు మాట‌లు న‌మ్మిన ధాన్య‌ల‌క్ష్మి త‌న ప్లాన్ అమ‌లుచేస్తుంది. డిన్న‌ర్ చేయ‌డానికి డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర‌కి రాదు. ఆస్తి పంప‌కాలు చేయ‌లేద‌ని ధాన్య‌ల‌క్ష్మి కోపంగా ఉంఉటుంది. ఇక అనామిక మాట‌లు న‌మ్మిన జ‌గ‌దీష్ ప్ర‌సాద్ కావ్య, రాజ్‌ల‌ను క‌ల‌వ‌డానికి ఆఫీస్‌కు వ‌స్తాడు. కావ్య‌కు, త‌న‌కు మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయ‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని అత‌డిని రాజ్ న‌మ్మ‌బ‌లికే ప్ర‌య‌త్నం చేస‌తాడు. అప్పుడు గొడ‌వ‌లు ఉంటే క‌లిసి ఒకే ఆఫీస్‌లో ఎలా ప‌నిచేస్తామ‌ని చెబుతాడు. జ‌గ‌దీష్ ప్ర‌సాద్ ముందు భార్య‌పై త‌న‌కు ప్రేమ ఉన్న‌ట్లు న‌టిస్తాడు. అక్క‌డితో 15వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక సీఈవో రూమ్‌లోకి వెళ్తున్న కావ్యని రాజ్ అడ్డుకుంటాడు. పందెంలో గెలిచిన వారే ఈ ఛాంబర్‌లోకి వెళ్లాలని చెప్పడంతో అప్పుడు కావ్య‌.. పోటీ జరిగే వరకు నేనే సీఈవోగా ఉంటానని అంటుంది

ఇక పందెంలో గెలిచేందుకు గాను ఉద్యోగులను లక్కీడిప్ ద్వారా విభజిస్తాడు రాజ్. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, ఇల్లు కట్టిస్తానని అంద‌రికి హామీలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. అయితే జగదీష్ చంద్ర ప్రసాద్‌ని కలిసిన అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని వారికి కాంట్రాక్ట్ ఇస్తే మీకు బెస్ట్ ఔట్‌పుట్ రాదని అంటుంది. మ‌రోవైపు కళ్యాణ్‌ని అసిస్టెంట్‌గా పెట్టుకోవడానికి రైటర్ లక్ష్మీకాంత్ అంగీకరించ‌డంతో మూడేళ్లు అగ్రిమెంట్ రాసిస్తేనే ఓకే అని అంటాడు. అప్పుడు వెంటనే ఎస్ చెప్పిన కళ్యాణ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసేస్తాడు. రాజ్ సర్ స్టాఫ్ అందరికీ వాగ్థానాలు ఇచ్చేస్తున్నారని , మీరు కూడా ఏదో ఒకటి చేయమని కావ్యతో శృతి చెప్పుకొస్తుంది.

అయితే ఆ స‌మ‌యంలో కావ్య దిమ్మతిరిగేలా స‌మాధానం చెబుతుంది. ఇక అనామిక మాటలు నమ్మిన జగదీష్ చంద్ర ప్రసాద్ నేరుగా స్వరాజ్ కంపెనీకి వచ్చి కావ్య- రాజ్‌లను నిలదీస్తాడు. మేం ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని ఆయనతో చెబుతూ, నువ్వు కూడా చెప్పు అంటూ కావ్య నడుము గిల్లుతాడు రాజ్. ఆ దెబ్బతో కళావతి మెలికలు తిరుగుతుంది. అయితే ఆస్తి పంపకాలు జరగట్లేదని ధాన్యలక్ష్మీ బాధపడుతుందని దుగ్గిరాల ఫ్యామిలీ మాట్లాడుకుంటారు. ధాన్యలక్ష్మీకి సపోర్ట్‌గా మాట్లాడిన రుద్రాణికి స్వప్న మండేలా చేస్తుంది. నీ భార్య అలిగి భోజనం చేయకుండా ఉంటే ఎలా ఉన్నావ్ అని ప్రకాశంను రుద్రాణి అంటుంది. అలిగిన ప్రతిసారి ఓదార్చాలి అంటే కొండమీది కోతిని కూడా తీసుకురమ్మంటుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాం. నువ్ తిను అని ప్రకాశం అంటాడు.

మరోవైపు అందరూ డిజైన్స్ ఇవ్వమని కావ్య అన‌గా, ఇంతలో రాజ్ వచ్చి సెటైర్లు వేస్తుంటాడు. అందరిని వెళ్లమంటాడు. కానీ, కావ్య అడ్డు చెబుతుంది. ఇక్కడ కూర్చుంటే కుర్చీలు ఉండవు అని రాజ్ బెదిరిస్తాడు. కానీ, కావ్య మాత్రం కూర్చోమని చెబుతుంది. నేను దుగ్గిరాల అని రాజ్ అనబోతుంటే ఏంటీ మేనేజర్ అని కావ్య సెటైర్ వేస్తుంది. కంత్రీ కళావతి నిన్ను అని రాజ్ అంటే.. ఏంటీ.. ఏంటీ అని ఇద్దరూ వాదించుకుంటారు. ఇంతలో జగదీశ్ వచ్చి నేను విన్నది నిజమే అయితే. మీరిద్దరు విడిపోయారు అని. మీ గొడవలతో కంపెనీ గురించి, కాంట్రాక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదని మార్కెట్‌లో అందరూ చ‌ర్చించుకుంటున్నారు. డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడంటే కళావతి సీఈఓ సీట్‌లో కూర్చుని ఆడేసుకుంటుంది అని రాజ్ అనుకుంటాడు.

ఇప్పుడు ఒక టీమ్‌గా చేస్తే కొన్ని డిజైన్స్ మాత్రమే వస్తాయి. కానీ, రెండు టీమ్స్‌గా చేస్తే చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అని రాజ్ అంటాడు. దాంతో ఆలోచనలో పడతాడు జగదీష్. నువ్ కూడా ఏమైనా చెప్పు అని కావ్య నడుము పట్టుకుని అడుగుతాడు రాజ్.అలా నడుముపై చేయి వేసి అడగవే.. ఏదోటి చెప్పవే అంటూ అంటాడు రాజ్. కానీ, కావ్య మాత్రం షాక్ అయి సైలెంట్‌గా ఉంటుంది. కావ్య నడుమును రాజ్ తాకడం చూసి స్టాఫ్ అంతా సిగ్గుతో పక్కకు తల తిప్పుకుంటారు. నువ్వేం మాట్లాడవేంటీ అని రాజ్ అంటే.. నడుముపై చేయి వేస్తే మాటలు ఉండవు అని కావ్య అంటుంది. దాంతో దెబ్బకు రాజ్ చేయి తీస్తాడు. అలా ఆఫీస్‌లో అందరిముందే రాజ్, కావ్య రొమాన్స్ నడుస్తుంది.

మరోవైపు పొట్టి నీకు గుడ్ న్యూస్ అని కల్యాణి అంటే.. నువ్ తండ్రివి కాబోతున్నావా అని అప్పు అంటుంది. నీ ప్రమేయం లేకుండా ఎలా అవుతాను అని కల్యాణ్ అంటాడు. ఏమో ఎవరికి తెలుసు. మీ పెదనాన్న లాగా చిన్నిల్లు ఏమైనా ఉందేమో అని అప్పు అంటుంది. దాంతో అప్పు చెవి మెలిపెట్టిన కల్యాణ్ మీ ఇంట్లో అందరూ ఇంతేనా. ఇలా దెప్పిపొడుస్తారు. మా వదిన కూడా ఇలాగే అని కల్యాణ్ అంటాడు. ఊరికే అన్నానులే. గుడ్ న్యూస్ ఏంటో చెప్పమని అప్పు అన‌గా, చెప్పను. చిన్నిల్లు అన్నావ్ కదా దానికి చెబుతాను అని కల్యాణ్ అంటాడు. లేకుంటే పాతిల్లుకు చెప్పు. నీ మాజీ భార్య అనామిక ఉన్న ఇల్లు అని అప్పు అంటుంది. మరోవైపు ఆఫీస్‌లో కావ్య ఛాంబర్‌లో డిజైన్స్ ఫొటోలు తీసుకుంటాడు. ఇది దొంగతనం కాదు తస్కరించుట అని రాజ్ అంటాడు. ఇంతలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అని ఛాంబర్‌లోకి కావ్య వస్తుంది. రాజ్ భ‌య‌ప‌డ‌డం జ‌రుగుతుంది.