Brahmamudi Serial Today November 18 th Episode : కావ్య డిజైన్స్ కొట్టేయాల‌నే ఆలోచ‌న‌లో రాజ్.. క‌ళ్యాణ్ ఆలోచ‌న‌లో ధాన్య‌ల‌క్ష్మీ

Brahmamudi Serial Today November 18 th Episode : కావ్య డిజైన్స్ కొట్టేయాల‌నే ఆలోచ‌న‌లో రాజ్.. క‌ళ్యాణ్ ఆలోచ‌న‌లో ధాన్య‌ల‌క్ష్మీ

Brahmamudi Serial Today November 18 th Episode : బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ తాజా ఎపిసోడ్‌లో రాజ్ త‌న న‌డుముపై చేయి వేయ‌డం కావ్య గుర్తు చేసుకుంటుంది. అయితే అమ్మో అవే ఆలోచ‌న‌లు వ‌స్తే ఏమ‌న్నా ఉందా అంటూ ఆ ఆలోచ‌న‌ల నుండి తేరుకొని మళ్లీ డిజైన్స్‌ వేసుకుంటుంది. కనకం భోజనం తీసుకుని కావ్య రూంలోకి వెళ్తుంది. అప్పుడు కావ్య భోజనం ఎందుకు తీసుకొచ్చావు అన‌డంతో నువ్వు వర్క్ మీద తప్ప దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు అర్థమైందా అనడంతో ..నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి పంపించేయాలని చూస్తున్నావు కదా అని అంటుంది కావ్య. అప్పుడు కనకం కాస్త ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడడంతో అమ్మ తల్లి ఆపు అని అంటుంది కావ్య. మరొకవైపు రాజ్ వీళ్ళకు ఎవరికీ డిజైన్స్ వేయడం రాలేదు నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఆఫీసులో జరిగిన విషయం తలుచుకుంటూ ఆలోచ‌న‌లో ప‌డిపోతాడు.

అంత‌లో రాజ్ తన అంతరాత్మ కనిపించడంతో కావ్య విషయంలో తన అంతరాత్మతో ఫన్నీగా వాదిస్తూ ఉంటాడు రాజ్. నిన్ను ఎలా అయినా నేను ఓడించి తీరుతాను అని అంతరాత్మ అనడంతో రాజ్ చిటపటలాడుతూ ఉంటాడు ..ఆ కళావతినైనా గెలిపించరా..? అంటే క‌న్ఫ్యూజ్‌ లో ఉన్న రాజ్‌ సరే అంటూ వెంటనే కళావతి గెలిస్తే నన్ను చచ్చే దాకా మేనేజర్‌ ను చేస్తారు అది నేను భరించలేను అయినా ఈ టైంలో నీతో నాకు మాటలేంటి వెళ్లు ఇక్కడి నుంచి అని ఆత్మను పంపించి వేస్తాడు రాజ్‌.ఇక అప్పుడు
ధాన్యలక్ష్మీ ఒక్కతే బయట కూర్చుని ఆలోచిస్తుంటే అపర్ణ చూసి దగ్గరకు వెళ్తుంది. నీకు మా అందరి మీద కోపంగా ఉందని, ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే నువ్వు అర్తం చేసుకునే పరిస్థితిలో కూడా లేవని చెబుతుంది.

అప్పుడు అర్థమైంది కదా.. మరి ఇంకా ఎందుకు మాట్లాడటం అంటూ ధాన్యలక్ష్మీ అంటుంది. తోడబుట్టక పోయినా ఇన్ని రోజులు మనం అక్కా చెల్లెలు మాదిరిగా ఉన్నాం కదా..? నువ్వు తిండి మానేస్తే నాకు బాధగా ఉండదా..? చెప్పు అని అపర్ణ అంటుంది. నువ్వు బాధపడితే నా బాధ తీరదు అక్కా. నా సమస్యను పరిష్కరిస్తే తీరుతుంది అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. నా మాట విను ఇలా బాధపడటం మానేసి ప్రశాంతంగా ఉండు అని అపర్ణ చెప్పగానే నువ్వు ఎన్నైనా చెప్తావు అక్కా.. మామయ్య పెట్టిన పందెంలో రాజ్‌ గెలిస్తే కంపెనీకి సీఈవో అవుతాడు. నీ కోడలు గెలిస్తే తిరిగి ఈ ఇంటికి వస్తుంది. కానీ దీని వల్ల నాకు వచ్చిన లాభమేంటి..? నా కొడుక్కి జరిగే న్యాయం ఏంటి అని ధాన్యలక్ష్మీ, అపర్ణను ప్రశ్నిస్తుంది.

రాజ్‌, కావ్య ఇద్దరు ఒకటైతే కళ్యాణ్‌ను తీసుకురారని ఎలా అనుకుంటావు అని అపర్ణ అంటుంది. ధాన్య‌ల‌క్ష్మీని క‌న్విన్స్ చేయాల‌ని చాలా ట్రై చేస్తుంది. ఇక ఆఫీసులో రాజ్‌ నిద్రపోతూ ఉంటాడు. ఇంతలో ఒక ఎంప్లాయి వచ్చి సార్ అని పిలవగానే ఉలిక్కిపడి లేచి చిరాకుగా ఏంటి అని అంటాడు. అప్పుడు ఆ ఉద్యోగి ఏంటి సార్ అంత దీర్ఘమైన ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అంటాడు. ఇక ధాన్యలక్ష్మీ తన కోసం వంట చేసుకుంటుంటే వంట మనిషి శాంత వచ్చి నేను అందరికీ వంట చేశానమ్మా మళ్లీ మీరెందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. ఇంతలో అక్కడకు ఇందిరాదేవి, అపర్ణ వస్తారు. ధాన్యలక్ష్మీకి ఎంత చెప్పినా వినక‌పోవ‌డంతో కళ్యాణ్‌ను ఇంటికి రప్పించేందుకు ప్లాన్‌ చేయాలని ఆలోచిస్తారు. కావ్య డిజైన్స్‌ కొట్టేయాలనుకుంటాడు రాజ్‌.. ఇవి ఇక్కడ పెట్టడం సేఫ్‌ కాదేమో మేడం. నాతో పాటు తీసుకెళ్లనా..? అని శృతి అడగ్గానే రాజ్‌ కోపంగా శృతిని తిట్టుకుంటాడు. ఇక్కడే ఉండ‌ని ప‌ర్లేదు అని కావ్య‌, శృతి అని అనుకుంటూ బ‌య‌ట‌కు రావ‌డంతో తాజా ఎపిసోడ్ ముగుస్తుంది.