Brahmamudi Serial Today November 22nd Episode : రాజ్ చేసిన ప‌నికి ఛీ అన్న సీతారామ‌య్య‌.. కూతురి బాధ‌ని చూడ‌లేక‌పోయిన క‌న‌కం

Brahmamudi Serial Today November 22nd Episode : రాజ్ చేసిన ప‌నికి ఛీ అన్న సీతారామ‌య్య‌.. కూతురి బాధ‌ని చూడ‌లేక‌పోయిన క‌న‌కం

Brahmamudi Serial Today November 22nd Episode : బ్రహ్మ‌ముడి తాజా సీరియ‌ల్‌లో రాజ్ చాలా డ‌ల్‌గా రావ‌డంతో రాజ్ ఓడిపోయాడని అంద‌రు అనుకుంటారు. కావ్య ఎక్క‌డ అని అడ‌గ్గా, ప‌ర్మినెంట్‌గా పుట్టింటికి పంపిచేశాను అని రాజ్ చెప్ప‌డంతో అంద‌రు షాక్ అవుతారు, కాని రుద్రాణి, రాహుల్ మాత్రం తెగ సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. అంతేకాదు పాట‌లు పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తుంటారు. అప్పుడు అపర్ణ కోపంతో ఆపుతావా లేదా నువ్వు అసలు మనిషివేనా అనడంతో ఏంటి మమ్మీ నేను గెలిస్తే నువ్వు చూడలేకపోతున్నావా అంటూ రాజ్ తానే డిజైన్స్ వేసి గెలిచినట్టుగా అందరి ముందు బిల్డప్పులు ఇస్తూ ఫోజులు కొడుతూ ఉంటాడు. అప్పుడు రుద్రాణి ఇప్పుడు అర్థమైందా కొడుకు ఓడిపోవాలని కోరుకున్నా తల్లిగారు ఇది రాజ్ నీ కెపాసిటీ అంటే అంటూ రుద్రాణి తెగ పొగిడేస్తూ మాట్లాడుతూ ఉంటుంది.

రాజ్ ప‌నిమ‌నిషిని పిలిచి చేసిన వంట‌లు తీసుకు రా అని అన‌గా, అప్పుడు ప‌ని మ‌నిషి.. కావ్యమ్మ వస్తుందని చేశాను కానీ ఇప్పుడు ఆశ నిరాశ అయింది ఈ రుద్రాణి గారిలా నేను ఉండలేను కదా అంటూ పనిమనిషి దారుణంగా అవమానిస్తుంది. ఆమెను ఏమైనా అంటే నిన్ను కూడా కట్టుబట్టలతో గెంటేస్తాను అని అంటుంది రుద్రాణి. అప్పుడు రాజ్ అత్త ఇక్కడ అందరూ నా సక్సెస్ ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ బిల్డప్ గా మాట్లాడుతూ ఉంటాడు. నా గెలుపు పంచుకోవడానికి నువ్వు ఉన్నావు అనగా ఏమి గెలుపు రా నీది అని అక్కడికి వస్తాడు సీతారామయ్య. నువ్వు నా మనవడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని అంటాడు.

ఆ స‌మ‌యంలో అపర్ణ ఏం జ‌రిగింది మావ‌య్య అని అడుగుతుంది. అప్పుడు సీతారామ‌య్య‌.. కావ్య వేసిన డిజైన్స్ దొంగలించి క్లైంట్స్ ముందు తానే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి కావ్యని మోసం చేసి గెలిచాడు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కాని రాజ్ మాత్రం తాను స‌రిగ్గానే చేసిన‌ట్టు గొప్ప‌లు పోతాడు. ఛీ నీలాంటి కొడుకు కన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఏ మనిషిని రా నీవు అంటూ అపర్ణ రాజ్ నీ అసహ్యించుకుంటుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని వెళ్లి కావ్యని పిలుచుకొని రా అని అంటుంది ఇందిరా దేవి. కావాలంటే విడాకులు ఇస్తాను అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరొకవైపు కావ్య భోజనం చేస్తుండగా కనకం వచ్చి అంత జరిగినా కూడా ఏమీ పట్టినట్టుగా ఎలా ఉంటున్నావు కావ్య నీకు బాధగా అనిపించలేదా అని అంటుంది.

జరిగింది ఏదో జరిగిపోయింది ఏం జరగాలి అనుకుంటే అది జరుగుతుంది నువ్వు వదిలేసేయ్ అని అంటుంది కావ్య. సీతారామయ్య కావ్యకి ఫోన్ చేస్తాడు. ఎందుకు ఇలా చేసావ్ అమ్మ అని అన‌గా, ఆయన దొంగతనం చేసిన విషయం ముందుగా తెలిసినా కూడా నేను ఆయన్ని ఏమీ అనలేదు ఎందుకంటే నేను ఆయన జీవితంలో ఉండటం ఆయనకు ఇష్టం లేదు. నేను మీకు ఇష్టం ఉండొచ్చు కానీ ఆయన మనసులో నేను లేను తాతయ్య అని కావ్య ఎమోష‌న‌ల్‌గా అంటుంది. మరోవైపు ఇందిరాదేవి అపర్ణ సుభాష్ ముగ్గురు జరిగిన విషయాలు తలుచుకొని ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత కనకం ఫోన్ చేసి బాధతో మాట్లాడటంతో కావ్య ఎప్పటికి ఈ ఇంటి కోడలే వాళ్ళిద్దరిని నేను ఒకటి చేస్తాను అని అపర్ణ క‌న‌కంకి మాట ఇస్తుంది.