Brahmamudi Serial Today November 26th Episode : బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో రాజ్ ఇంట్లో బాధ్యతలు చూసుకోవడానికి మీ పిన్ని ఉంది కదా అని అంటాడు. అయితే అరేయ్ రాజ్ నువ్వు వెళ్లి మీ అమ్మని తీసుకొస్తావా లేదా అని అనడంతో మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్లాను డాడ్. ఆ కలావతిని తీసుకు రమ్మని అమ్మ ఫిట్టింగ్ పెడుతోంది. అమ్మ రానిని కరాకండిగా చెప్పేసింది ఇక మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజ్. ఇప్పటికే ఇంట్లో వేరు కుంపటి పెట్టుకున్న మీ పిన్ని ఇంటి బాధ్యతలు ఎలా చూసుకుంటుందని ప్రకాష్ చెప్పగానే ధాన్యలక్ష్మీ ప్రకాష్‌ను తిడుతుంది. నేను చేసేదంతా మన కళ్యాణ్ కోసమే అంటుంది. నా ఆస్థి నాకు దక్కాలంటే ఇదే కరెక్టు టైం ఇప్పుడు ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టాలి. ఈ గొడవ మరింత పెద్దది చేయాలి అనుకుంటుంది రుద్రాణి.
ఆ తర్వాత తర్వాత సుభాష్ అపర్ణకు ఫోన్ చేసి నువ్వు ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరుగుతోంది అని అనడంతో కొంచెం వెయిట్ చేయండి వాడే తప్పు తెలుసుకుంటాడు అని అంటుంది అపర్ణ. అప్పుడు అపర్ణ మాటలు విన్న కావ్య తప్పు చేస్తున్నారు అనడంతో నేను చెప్పింది చెయ్ నాకు సలహాలు ఇవ్వకు అని చెబుతుంది. మరొకవైపు ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా రుద్రాని రెచ్చగొట్టడానికి వెళుతుంది. నువ్వు ఎంతలా ఆలోచించినా ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ నీ కొడుకుకు జరిగే న్యాయం ఏమీ ఉండదు. వాడు ఆటో నడపక తప్పదు. నా మాటలు నీకు కోపం తెప్పించవచ్చు కానీ ఆలోచిస్తే నిజం కనిపిస్తుంది అని రుద్రాణి అంటుంది.
నిజం కనిపిస్తుంది కాబట్టే వేరు కుంపటి పెట్టాను అంటుంది ధాన్యలక్ష్మీ. పెట్టి ఏం సాధించావు. నీ వంట నువ్వు చేసుకోవడం తప్పా.. ఈ ఇంట్లో మన పొజిషన్ ఏంటో మన మాటకు ఇచ్చే విలువ నువ్వే ఆలోచించు. నీ కొడుకుకు న్యాయం కావాలని అడిగితే ఏం చేశారు. నేను నీకు సపోర్టు చేద్దామంటే నన్ను విలన్ చేస్తున్నారు. ముందు ఈ ఇంట్లో ఎవరినో ఒకరిని నీవైపు తిప్పుకో అంటూ రుద్రాణి చెప్తుంది. ఇక కళ్యాణ్, అప్పు ఇద్దరూ కలిసి పానీపూరి బండి దగ్గరకు వెళ్లి పానీపూరి తింటున్న సమయంలో అక్కడకు అనామిక వస్తుంది. ఆదర్శ ప్రేమికులు రోడ్డు మీద పడ్డారు అంటుంది. మనుషులు అన్నాక రోడ్డు మీదే తిరుగుతారు అంటుంది అప్పు. ఇలా రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ తింటూ హ్యాపీగా ఉన్నారా..? అని అనామిక అడగ్గానే మేము ఏ ఫుడ్డు తిన్నా.. నీ బాడీలో ఉన్నంత కొలెస్ట్రాల్ , కొవ్వు మాకు లేవులే.. అంటుంది అప్పు.
మీ అన్నయ్య కాళ్లు పట్టుకుని ఆస్థి తీసుకుని బాగుపడు. అంటూ కళ్యాణ్‌ను ఇంసల్ట్ గా మాట్లాడి వెళ్లిపోతుంది అనామిక. రాజ్ నిద్రపోతుంటే సుభాష్ వచ్చి రాజ్ రూంలో పడుకుంటాడు. దీంతో రాజ్ కంగారుగా డాడీ మీరు ఇక్కడ పడుకుంటారా..? అని అడుగుతాడు.. మీ అమ్మ లేదు కాబట్టి ఆ రూంలో నిద్ర పట్టడం లేదు. అక్కడ నేను ఉండలేకపోతున్నాను. పడుకోలేకపోతున్నాను. అందుకే ఇక్కడ పడుకోవడానికి వచ్చాను. మమ్మీ లేకపోతే నిద్రపట్టడం లేదని చెప్తుంటేనే వినడానికి విచిత్రంగా ఉంది అంటాడు రాజ్. అందరికీ నీలాగా ఒంటరిగా పడుకునే ప్రాప్తం ఉండదు కదా..? అంటాడు సుభాష్. బెడ్‌రూంలో ఉన్న ధాన్యలక్ష్మీ, ప్రకాష్ గొడవ పడతారు. కళ్యాణ్ విషయంలో నువ్వేమీ చేయడం లేదేంటని ప్రకాష్‌ను నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. ఆ తర్వాత ధాన్యలక్ష్మీ కోపంగా దిండు, దుప్పటి ఇచ్చి ప్రకాష్‌ను బయటకు గెంటివేస్తుంది.