Brahmamudi Serial Today November 27th Episode : రాజ్‌ని ఇరిటేట్ చేస్తున్న సుభాష్.. అప్పు చేతిలో చెక్ పెట్టిన క‌ళ్యాణ్‌

Brahmamudi Serial Today November 27th Episode : రాజ్‌ని ఇరిటేట్ చేస్తున్న సుభాష్.. అప్పు చేతిలో చెక్ పెట్టిన క‌ళ్యాణ్‌

Brahmamudi Serial Today November 27th Episode : బ్ర‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌లో సుభాష్, రాజ్ పడుకోవడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు ప్రకాశం వచ్చి తలుపు కొడతాడు. నువ్వేంటి ఇలా వచ్చేశావ్ అని రాజ్ అడగ్గా.. మీ పిన్ని వాడిని గెంటేసి ముఖంపై తలుపు వేసినట్లుందని అంటాడు సుభాష్. మరోవైపు.. రాత్రి మెట్లపై ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న కావ్య దగ్గరికి అపర్ణ వస్తుంది. ఇంతలో ఇందిర ఆమెకు ఫోన్ చేస్తుంది. మీ ఇద్దరూ లేకపోవడంతో నన్ను పట్టించుకునేవాళ్లే లేకుండాపోయార‌ని అంటుంది. అదేంటత్తయ్యా నా కొడుక్కి బుద్ది చెప్పడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు అంటుంది అపర్ణ. ఏంటో ఈ గొడవలు వీలైనంత త్వరగా వాణ్ని మార్చి మీరిద్దరు ఇక్కడికి వచ్చేయండి అని అంటుంది.

మీరు లేక‌పోయే సరికి ఇళ్లంతా బోసి పోయినట్టు ఉంది అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది ఇందిర‌. అత్తయ్యా ఈ మధ్య మీరు కూడా అబద్దాలు బాగానే ఆడుతున్నారు అంటుంది కావ్య. ఏంటి నేను చేసిన అబద్దపు వాగ్దానాలు.. నా కొడుకుతో గొడవ పడి ఇంత దాకా వస్తే నీకు వెటకారంగా ఉందా..? మీరు మీరు కొట్టుకుని బాగానే ఉన్నారు. కానీ మిమ్మల్ని కలపడానికి నేను చస్తున్నాను అంటుంది అపర్ణ.ఇక నిద్రలో సుభాష్‌ గురక పెడుతూ రాజ్‌ మీద కాలు వేయ‌గా, ఆయ‌న‌ని నిద్రవ లేపి ముందు మీరు అర్జెంట్‌ గా బయటకు వెళ్లండి అంటాడు. దీంతో నేను బయటకు వెళ్లాలంటే నువ్వు మీ అమ్మను తీసుకురా..? అంటాడు సుభాష్‌.

నువ్వు వెళ్లి మీ పిన్నిని కన్వీన్స్‌ చేయ్‌ అంటడు ప్రకాష్‌. వాళ్లను కన్వీన్స్‌ చేయడం కంటే.. నేను వెళ్లి నేల మీద పడుకుంటాను అని కింద పడుకుంటాడు రాజ్‌. రాజ్‌ను చూసిన సుభాష్‌ వీడికి నిద్ర లేకుండా టార్చర్‌ పెడితే అలాగైనా కావ్యను తీసుకొస్తాడు అనుకుంటే కింద పడుకున్నాడు. లాభం లేదు రేపటి న నుంచి డోస్‌ పెంచాలి. అని మనసులో అనుకుంటాడు.ఇక సీతారామయ్య దగ్గరకు ఇందిరాదేవి వెళ్లి ఏంటి బావ ఇది కావ్య ఆఫీసులోంచి వెళ్లిపోయింది. అపర్ణ ఇంట్లోంచి వెళ్లిపోయింది. కానీ నువ్వేమీ పట్టనట్టు తాపీగా పేపర్‌ చదువుతున్నావు. అంటూ అడుగుతుంది. రాజ్‌ను ఇలాగే వదిలేస్తే.. వాడికి ఎవ్వరి అవసరం లేదన్నట్టు ఒంటరిగా బతకడం అలవాటు చేసుకుంటాడు అంటుంది ఇందిరాదేవి.

కిచెన్‌ లోకి వెళ్లిన ఇందిరాదేవి, పాలు వేడి చేస్తున్న ధాన్యలక్ష్మీని చూస్తూ.. మీ మామయ్యగారికి ఇంత ఆలస్యంగానా పాలు ఇచ్చేది అని అడుగుతుంది. ఆ పాలు మామయ్యగారికి కాదని అవి తన కోసమని ధాన్యలక్ష్మీ చెప్తుంది. మీ మామయ్య గురించి పట్టించుకునే బాద్యత నీకు లేదా..? అంటూ ఇందిరాదేవి నిలదీయడంతో రుద్రాణి వస్తుంది. ఇది మరీ దారుణం అమ్మా తన బాధ గురించి చెప్పినప్పుడు పట్టించుకోలేదు. పైగా వేరు కుంపటి పెట్టుకుంటాను అంటే వెటకారంగా మాట్లాడతారు అంటుంది రుద్రాణి. ఇన్ని రోజులు తన పెద్ద కోడలు, కావ్య ఉండటం వల్ల అన్ని సాగిపోయాయి. ఇప్పుడు వాళ్లు లేరనేసరికి సడెన్‌గా మనం గుర్తుకు వచ్చాం. అంటూ ధాన్యలక్ష్మీ మాట్లాడుతుంది.ఇక ఇంటికి వచ్చిన కళ్యాణ్‌, అప్పు కోసం వెతుకుతాడు. పైన బట్టలు ఆరేస్తున్న కళ్యాణ్‌ ఎగ్జైంటింగ్‌ గా వెళ్లి అప్పును కళ్లు మూసుకోమని చెప్పి చేతిలో చెక్‌ పెడతాడు. అది చూసిన అప్పు షాక్‌ అవుతుంది. నీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని , మన శత్రువుతో మాట్లాడాలని చెప్పి కళ్యాణ్‌ని లాక్కెళ్తుంది. ఇందిర, స్వప్న కలిసి వంట చేస్తుండ‌డంతో ఎపిసోడ్ ముగుస్తుంది.