Brahmamudi Serial Today November 29th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో కావ్య తన వారింట్లో బాధలు చూడలేక భోజనం తీసుకొస్తుంది.అయితే ఏ హక్కుతో భోజనం తీసుకొచ్చిందో అడుగు నాన్నమ్మ అంటాడు రాజ్. దీంతో కావ్య మా మనవరాలురా అందుకే భోజనం తీసుకొచ్చింది అని ఇందిరాదేవి అంటుంది.. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కానీ వంట చేసే దిక్కు లేదని అంటుంది. త్వరగా వడ్డించు కావ్య అని ఇందిరాదేవి అడగ్గానే సరేనని కావ్య వడ్డించబోతుంటే.. రాజ్ అందరిని పిలుస్తాడు. కావ్య సీతారామయ్య, ఇందిరా దేవి కోసం ఆహారం తీసుకొస్తే మిగితావాళ్లూ అందరి కోసం చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు.. అది చూసిన అందరూ ఫస్ట్ టెంప్ట్ అయినప్పటికీ అది తిన్న అందరూ కారంతో అల్లాడిపోతారు.. చివరికి రాహుల్ తో సహా ఇంట్లో అందరూ కూడా కావ్య తెచ్చిన ఆహారాన్నే తింటారు..
అమ్మమ్మగారు చోలే కర్రి మీకోసం స్పెషల్ గా చేశాను. ఒకసారి టేస్ట్ చూడండి అంటుంది కావ్య. ఓరేయ్ చోలే కర్రి అంటరా..? మసాలారా.. అని ప్రకాష్ అనగానే చోలే అన్నావంటే నువ్వు పోయేదాకా నీకు పాటలు వినిపిస్తాను. ఇందులో మసాలా ఉంది తిను అంటాడు రాజ్. అబ్బా ఎంత బాగుందో నీ చేతి వంట తిని ఎన్ని రోజులు అయిందో అని ఇందిరాదేవి చెబుతుంది. అమ్మమ్మగారు కడుపు నిండా తినండి వడ్డిస్తాను అంటుంది. బిర్యానీ తిన్నవాళ్లందరూ అదోరకంగా ముఖం పెడతారు. రాజ్ అత్తా ఎలా ఉంది అని అడుగుతాడు. స్వప్న చెత్తలా ఉంది అంటుంది. రుద్రాణి మాత్రం బాగానే ఉంది అని చెబుతుంది. తర్వాత రాహుల్ కూడా బాగానే ఉందంటూ అలాగే తింటాడు. ఇంతలో ఒక్కోక్కరు కావ్య వైపు జంప్ అవుతారు.
ఆ తర్వాత ఇంట్లో కావ్య రాత్రి కోసం కూడా భోజనం చేసి వెళ్లిపోతుండగా రాజ్ అపి ఆమెకు డబ్బులు ఇవ్వబోతాడు.. అందుకు రాజ్ పై ఇంట్లో వాళ్ళు అందరూ సీరియస్ అవుతారు.. అయినప్పటికీ రాజ్ మాత్రం ఆగడు.. ఆమెకు డబ్బులు ఇవ్వబోతే కావ్య ఫుల్ సీరియస్ అయ్యి మాట్లాడుతుంది. పరీక్షే రాయని వాళ్లు మార్కుల కోసం ఎలా ఎదురుచూస్తారు. డిజైన్స్ వేయకుండానే వేసినట్టు నాటకం ఆడి సీఈవో సీటు కొట్టేసినట్టు అందరూ మీలాగా నాటకం ఆడరు అంటుంది కావ్య. నీ ఆటలు నా దగ్గర సాగవు అంటాడు రాజ్. సాగుతున్నాయి కదా..? ఇంకా ఏం చేస్తారు అంటుంది కావ్య. మీకోసం నేను ఉండాలనుకోవడం లేదు. అమ్మమ్మ, తాతయ్య భోజనానికి ఇబ్బంది పడకూడదని రాత్రికి కూడా బోజనం చేసి వెళ్తాను అని చెప్పి ఏదైనా ఉంటే వాళ్లతో వెళ్లి మాట్లాడండి అని చెప్పి వెళ్లిపోతుంది.
చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నాము అని ఇందిరాదేవి చెప్తుంది. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని మీకు ఎలా భోజనం చేయాలనిపిస్తుందండి అని అపర్ణ అడుగుతుంది. దీంతో మమ్మల్ని ఆకలి చంపుకోండని మాత్రం చెప్పకు అంటూ ఇందిరాదేవి ఫోన్ కట్ చేస్తుంది. రాజ్ ప్రవర్తన చూసిన సుభాష్ వెళ్లి అమ్మా కావ్య వాడేదో వాగుతుంటాడు నువ్వు వెళ్లు అమ్మా అని చెప్పగానే.. లేదు మామయ్యా ఇలాగే తల దించుకుని వెళ్లిపోతే ఈయనకు తెలిసి రాదు అంటుంది కావ్య. ఏంటి నాకు తెలిసి వచ్చేది అంటాడు రాజ్. మీకు నిలువెల్లా అహంకారం నిండిపోయిందని మీకింకా తెలియడం లేదా..? అంటుంది కావ్య. ఇంతకు ముందు కూడా మీరు మా ఇంటికి వచ్చి ఇలాగే డబ్బు ఆశ చూపించి మా ఇంటికి రా అన్నారు. ఎలా కనిపిస్తున్నాను నేను. మీ తలతిక్క నిర్ణయాల వల్ల మీ కన్నతల్లే మిమ్మల్ని అసహ్యించుకుని మా ఇంటికి వచ్చిందని గట్టిగా క్లాస్ పీకుతుంది.