Dhanush-Aishwarya : అభిమానుల ఆశ‌లు అడియాశ‌లు.. ఇక ధ‌నుష్‌-ఐశ్వర్య‌లు క‌లిసేదే లేదు..!

Dhanush-Aishwarya : అభిమానుల ఆశ‌లు అడియాశ‌లు.. ఇక ధ‌నుష్‌-ఐశ్వర్య‌లు క‌లిసేదే లేదు..!

Dhanush-Aishwarya : ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకులు ఎక్కువ‌య్యాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట‌లు ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. రీసెంట్‌గా ఏఆర్ రెహ‌మాన్ త‌న భార్య‌కి విడాకులు ఇచ్చి పెద్ద షాకే ఇచ్చాడు. అయితే కొన్ని నెల‌ల క్రితం త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌లు తామిద్ద‌రం విడిపోయేందుకు రెడీ అయ్యామంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. పెళ్లై 18 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల కారణంగా 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత కూడా వీరిద్దరూ కోర్టుకు వెళ్లకపోవడంతో పిల్లల కోసం తిరిగి కలిసి జీవిస్తారని అనుకున్నారు.

కాని నటుడు ధనుష్, రజినీకాంత్ ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం మేరకే ఈ కేసులో తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ స్టార్ కపుల్ గా పేరున్న ధనుష్-ఐశ్వర్యల వైవాహిక జీవితం ముగిసిపోయింది. అభిమానుల గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయి. ఇక ఇప్ప‌టి నుండి ఎవ‌రి దారి వారిదే. పిల్ల‌ల కోసం అప్పుడప్పుడు ఈ జంట క‌లిసే అవ‌కాశం ఉంది. ఇక ఐశ్వర్య ధనుష్ కంటే మూడేళ్లు పెద్దదైనా, ఆయన్ని ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ర‌జ‌నీకాంత్ త‌న‌య ఐశ్వ‌ర్య కూడా ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటింది. ఐశ్వర్య ధనుష్‌తో “3” చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారింది. ఆ త‌ర్వాత వాయ్ రాజా వాయ్, లాల్ సలామ్ చిత్రాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు. దాదాపు 18 ఏళ్ల పాటు ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కాని జనవరి 2022లో, ధనుష్ మరియు ఐశ్వర్య ఇద్దరూ X (ట్విట్టర్) ద్వారా అనౌన్స్ చేశారు.. దాదాపు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్, ఐశ్వర్యల బ్రేకప్ ఇప్పటికీ కోలీవుడ్‌లో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.తన నటనా ప్రతిభతో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ దాటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు ధ‌నుష్‌. ఆయ‌న ఎదుగుదలలో ధ‌నుష్ మాజీ భార్య ఐశ్వర్య పాత్ర కీలకం. ఐశ్వర్యే ధనుష్‌కి చాలా విషయాల్లో అండగా నిలిచారు. ధనుష్ ఇంగ్లీష్‌ని అనర్గళంగా మాట్లాడటానికి కూడా ఐశ్వర్యే కారణం.