కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన 2 ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లాజిస్టిక్స్) పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అలాగే పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.24,400 చెల్లిస్తారు. రెండో సంవత్సరం నుంచి నెలకు రూ.25,100 ఇస్తారు. 3వ సంవత్సరం నుంచి నెలకు రూ.25,900 ఇస్తారు. ఈ పోస్టులకు డిసెంబర్ 13వ తేదీ వరకు గడువును విధించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్లుగా నిర్ణయించారు. దరఖాస్తు చివరి తేదీ వరకు 30 ఏళ్లు మించకూడదు. రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇస్తున్నారు. మరిన్ని వివరాలకు https://cochinshipyard.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.