Multi Starrer : ఏంటి.. చ‌ర‌ణ్, బ‌న్నీ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌రా.. ఇక రికార్డుల‌కి పాత‌రే.!

Multi Starrer : ఏంటి.. చ‌ర‌ణ్, బ‌న్నీ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌రా.. ఇక రికార్డుల‌కి పాత‌రే.!

Multi Starrer :ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్స్ హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.ఒక‌ప్పుడు చిన్న హీరోలు క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్స్ చేసేవారు. ఇప్పుడు పెద్ద హీరోలు కూడా మ‌ల్టీ స్టార‌ర్స్ చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం పెద్ద హిట్ కావ‌డ‌మే కాక ఏకంగా ఆస్కార్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుంద‌నే టాక్ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ లో పుష్ప 2 చిత్రంతో సందడి చేయబోతున్నారు. రాంచరణ్ గేమ్ గేమ్ ఛేంజర్ చిత్రం జనవరిలో సంద‌డి చేయ‌నున్నాడు.. వీళ్లిద్దరి నుంచి వరుసగా రెండు నెలల్లో పాన్ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి. ఇక చరణ్, బన్నీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం రావాలని ఫ్యాన్స్ ఎప్ప‌టి నుండో కోరుకుంటున్నారు. అయితే ఇది జ‌ర‌గ‌డం అసాధ్యం మాత్రం కాదు. ఎన్టీఆర్, చరణ్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కుతుంది అని ఎవరైనా ఊహించారా ? రాజమౌళి చేసి చూపించారు. రాజమౌళి తరహాలో బలమైన కథతో ఏ డైరెక్టర్ అయినా ముందుకు వస్తే బ‌న్నీ, చ‌ర‌ణ్ మ‌ల్టీ స్టార‌ర్ కూడా తెర‌కెక్కుతుంది.

రాంచరణ్ ఎవడు చిత్రంలో అల్లు అర్జున్ చిన్న గెస్ట్ రోల్ లో నటించాడు. ఒకరి ముఖం మరొకరికి మార్చే ఫేస్ సర్జరీ నేపథ్యంలో యాక్షన్ చిత్రంగా ఎవడు తెరకెక్కి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో పూర్తి స్థాయి మల్టీస్టారర్ మూవీ చేయాలనే కోరికని రాంచరణ్ బయట పెట్టారు. తమ మల్టీస్టారర్ చిత్రానికి చరణ్ – అర్జున్ అనే టైటిల్ కూడా రాంచరణ్ ప్రస్తావించారు. అయితే కథలో తమ పాత్రలు నెగిటివ్ రోల్స్ గా ఉండాలని.. అలాంటి కథ కుదిరితే తప్పకుండా మల్టీస్టారర్ మూవీ చేస్తాం అని రాంచరణ్, అల్లు అర్జున్ గతంలో తెలిపారు. చరణ్, అల్లు అర్జున్ లతో పూర్తి స్థాయి మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉన్నట్లు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మనసులో మాట బయటపెట్టారు. మ‌రి ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.