ఢిల్లీలోని ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెన లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) రెగ్యులర్ ప్రాతిపదికన 40 గ్రేడ్ ఎ అధికారుల (అసిస్టెంట్ మేనేజర్) ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, స్ట్రెస్డ్ అసెట్ మేనేజ్‌మెంట్, అకౌంట్స్, రీసోర్స్ అండ్ ట్రెజరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, సెక్రటేరియల్ ఫంక్షన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్, రిస్క్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, హెచ్ఆర్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, రాజ్ భాష, కంప్లైన్స్ అండ్ ఆడిట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, జనరల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు డిప్లొమా, డిగ్రీ, బీఏ, సీఏ, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సులను పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతను ఇస్తారు. నెలకు వేతనం రూ.44,500 వరకు ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు నవంబర్ 30, 2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూబీడీలు రూ.100 చెల్లిస్తే చాలు. ఆన్‌లైన్ దరఖాస్తుకు డిసెంబర్ 23ను చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ పరీక్షను జనవరి, 2025లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు గాను https://www.iifcl.in అనే వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.