Dhanush – Nayanthara : గత కొద్ది రోజులుగా నయనతార, ధనుష్ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా తన నానుమ్ రౌడీ దాన్ మూవీ విజువల్స్ వాడారంటూ మద్రాస్ హైకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశాడు ధనుష్. నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ లపై ధనుష్ కోర్టుకెక్కడం గమనార్హం. దీన్ని పరిశీలించిన ధర్మాసనం, విచారణకు అంగీకరించింది.అయితే తమ డాక్యుమెంటరీ విషయంలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా విశేషాలను తమ పెళ్లి డాక్యుమెంటరీలో చూపించాలని నయన్ దంపతులు కోరినప్పటికీ, ఆ మూవీ నిర్మాత అయిన ధనుశ్ నుంచి ఎటువంటి పర్మిషన్ రాలేదని అందుకు తాను ఎంతో బాధపడ్డానంటూ నయనతార పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు.డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాళ్లు మూడు సెకన్ల సీన్స్ ఉపయోగించినందుకుగానూ పరిహారంగా ధనుశ్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ తెలిపారు. అంతేకాకుండా ఆ లేఖలో ఆమె ధనుశ్ క్యారెక్టర్‌ను కూడా తప్పుబట్టారు తనపై ధనుశ్ ద్వేషం కనబరుస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నయనతార 3 సెకండ్స్ అని అబద్దం చెప్పి 30 సెకండ్స్ వాడుకుందని, తన లైఫ్ ని మాత్రం తాను డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ కంటెంట్ వాడుకుంటే డబ్బులు అడగొద్దా అంటూ నయనతారపై విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన ధనుష్ – నయనతార ఈ వివాదంతో శత్రువులుగా మారడమే కాక వీరి వివాదం తమిళనాట చర్చగా మారింది.
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూసుకునే లాస్ గాటోస్ ప్రొడక్షన్ పై దావా వేసేలా అనుమతి ఇవ్వాలని కూడా మద్రాస్ హైకోర్టును ధనుష్ కంపెనీ కోరింది. ఇద్దరి వాదనలు విన్న కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. నయనతార వచ్చే విచారణ తేదీలోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి నయన్, ధనుష్ హాజరయ్యారు. అయితే అక్కడ వీళ్లు ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు.ఒకరిపై ఒకరికి పీకల్లోతు కోపం ఉందని అంటున్నారు