Manchu Family : మంచు మ‌నోజ్ ఇంటిని విష్ణు బౌన‌ర్స్ చుట్టు ముట్టారా.. అస‌లు ఏం జ‌రుగుతుంది.

Manchu Family : మంచు మ‌నోజ్ ఇంటిని విష్ణు బౌన‌ర్స్ చుట్టు ముట్టారా.. అస‌లు ఏం జ‌రుగుతుంది.

Manchu Family : ఆదివారం మంచు ఫ్యామిలీ విభేదాల గురించి అన్ని మీడియా ఛానెల్స్‌లో అనేక వార్త‌లు ప్ర‌చురితం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మంచు ఫ్యామిలీలో విభేదాలు టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మోహ‌న్‌బాబు, మంచు మ‌నోజ్ ఒక‌రిపై మ‌రొక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదులు చేసిన‌ట్లు స‌మాచారం. ఆస్తి వ్య‌వ‌హారాల్లోనే తండ్రీ కొడుకుల మ‌ధ్య గొడ‌వ‌ జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మంచు మనోజ్ ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయని హైదరాబాద్ లోని టీఎక్స్ ఆసుపత్రి వర్గాలు తేల్చాయి. మంచు మనోజ్ తన తండ్రి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో గొడవ పడ్డారని అది ఫిజికల్ దాకా వెళ్ళిందని ఆదివారం రోజంతా ప్ర‌చారం జ‌రిగింది.

ఆయన కుడి కాలు కండరం నొప్పితోనే వచ్చారని అంటున్నారు. అయితే మనోజ్ కి సిటీ స్కాన్, ఎక్స్ రే వంటివి తీశారు. మెడ భాగంలో కండరాల మీద స్వల్పంగా గాయాలు అయినట్లుగా వైద్యులు తేల్చారని అంటున్నారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు మనోజ్ కి వైద్య పరీక్షలు సాగాయని అంటున్నారు. అయితే సిటీ స్కాన్, ఎక్స్ రే నివేదికలలో మాత్రం నార్మల్ అని తేలింది. ఇక నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మనోజ్ ఆసుపత్రికి వచ్చారు. అవి మీడియాలో విజువల్స్ రూపంలో కూడా కనిపించాయి. మోహ‌న్‌బాబు వార‌సులు మ‌నోజ్‌, విష్ణు మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఉన్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంచు మ‌నోజ్ పెళ్లి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరిన‌ట్లు స‌మాచారం. మ‌నోజ్ పెళ్లిలో విష్ణు ఎక్కువ‌గా క‌నిపించ‌క‌పోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌స్తుతం మంచు ఫ్యామిలీ వివాదం మ‌రింత ముదురుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. మంచు మనోజ్‌ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు విష్ణు అనుచరులు. జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చారు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు విజయ్.మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, ప్రైవేట్ బౌన్సర్ల తో కాపలా కాస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు…మంచు మనోజ్‌ ఇంటికి వెళ్లనున్నారు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నారట. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని మంచు మ‌నోజ్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.