Game Changer2 : గేమ్ ఛేంజ‌ర్ పార్ట్ 2 కూడా రానుందా.. శంకర్ ప్లాన్ ఏంటి?

Game Changer2 : గేమ్ ఛేంజ‌ర్ పార్ట్ 2 కూడా రానుందా.. శంకర్ ప్లాన్ ఏంటి?

Game Changer2 : ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల‌కి సీక్వెల్స్ రావ‌డం కామ‌న్‌గా మారింది. మొన్న‌టికి మొన్న ఎన్టీఆర్ దేవ‌ర‌తో ప‌ల‌క‌రించ‌గా, మ‌రి కొద్ది రోజులలో ఈ మూవీకి సీక్వెల్‌తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఇక పుష్ప‌కి సీక్వెల్‌గా పుష్ప‌2 కూడా రాబోతుంది. ఇదే క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్‌కి సీక్వెల్‌గా మ‌రో పార్ట్ ఉంటుంద‌నే టాక్ న‌డుస్తుది. 2025 జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గేమ్‌ఛేంజర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే టీజర్, కొన్ని సాంగ్స్ రిలీజ్ అయి మంచి హిట్ అయ్యాయి. ఇంకా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే బాహుబలి-2, పుష్ప-2 లాగే..గేమ్‌ఛేంజర్‌ కూడా పార్ట్-2 రాబోతుందన్న న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. గేమ్‌ఛేంజర్‌పై ఫుల్‌ కాన్ఫిడెంట్‌తో ఉన్న మేకర్స్ పార్ట్-2 లీడ్ కూడా ఇవ్వబోతున్నారనే టాక్ అయితే న‌డుస్తుంది.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో కాని ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఒకవేళ పార్ట్-2 ఉంటే ఇప్పట్లో అయితే కష్టమేనన్న చర్చ జరుగుతోంది. రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కాల్షీట్స్ బాగానే కేటాయించాడు. దాని తర్వాత సుకుమార్‌తో మరో ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. మరి రెండు ప్రాజెక్టులు చేయాల్సి ఉన్న రామ్ చ‌ర‌ణ్ ఆ తర్వాతే గేమ్‌ఛేంజర్‌-2 చేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పటికైతే జనవరి 10న రిలీజ్‌ కాబోతున్న గేమ్‌ఛేంజర్‌ కోసం ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ కూడా చాలా ఎగ్ఝైట్‌మెంట్‌తో ఎదురు చూస్తోంది.

రీసెంట్‌గా మేక‌ర్స్… నానా హైరానా అనే రొమాంటిక్ సింగిల్‌ను మేక‌ర్స్ గురువారం రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో ఒకేసారి ఈ పాట‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌ను తెలుగులో రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాయ‌గా, త‌మిళంలో వివేక్‌, హిందీలో కౌశ‌ర్ మునీర్ రాశారు. తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. త‌మిళంలో ‘లై రానా’ అనే ప‌ల్ల‌వితో ఈ పాట సాగింది.నానా హైరానా పాట‌ను శ్రేయా ఘోష‌ల్‌, కార్తీక్ ఆల‌పించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. శంక‌ర్ సినిమాల్లో మాదిరిగానే క‌ల‌ర్‌ఫుల్ విజువ‌ల్స్‌, బ్యూటీఫుల్ లోకేష‌న్స్‌తో గ్రాండియ‌ర్‌గా పాట‌ను చిత్రీక‌రించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటోంది. సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.