Tollywood : సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి సెలబ్రిటీలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్నది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఫొటో దిగింది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజీ సొంతం చేసుకుంది. ఆ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి హిట్ అందుకున్న రమ్యపసుపులేటి. టిక్ టాక్ వీడియోలు ఆ తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకి బాగానే దగ్గరైంది.
హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది. మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది రమ్య. ఇక ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య అప్పుడుప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంది. హుషారు సినిమాతో వెండితెరకి పరిచయమైన రమ్యకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలు మాములుగా ఉండవు. ఫొటో ఏదైనా హాట్ ట్రీట్ పక్కా అనేలా అందాలతో ఇచ్చిపడేస్తుంది రమ్య
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఆయన ఇప్పుడు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాకి మహేష్ బాబు డేట్స్ కేటాయించనున్నట్టు సమాచారం.