Gunde Ninda Gudi Gantalu December 10th : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్‌లో బాలు, మీనా రెస్టారెంట్‌కి వెళతారు. అక్కడ వారికి ఊహించని సంఘటన ఎదురువుతుంది. అదే రెస్టారెంట్లో శృతి, రవి ఉంటారు. ఆ విషయాన్ని బాలు పట్టించుకోడు. కానీ, రవి గమనించి తన అన్నయ్య దగ్గరికి వస్తాడు. దీంతో బాలుకు ఎక్కడలేని కోపం వస్తుంది. అనవసరంగా వరుసలో కలపొద్దు .. ఎవర్రా నీకు అన్నయ్య అంటూ బాలు మండిపడతాడు. అయినప్పటికీ రవి మాట్లాడే ప్రయత్నం చేయగా, రవిని కొట్టడానికి వెళతాడు బాలు. అప్పుడు శృతి అడ్డుపడుతూ.. రవి ఏమైనా చిన్న పిల్లవాడు అనుకుంటున్నారా.. చీటింగ్ మాటికి కొట్టడానికి.. మీ హద్దులలో మీరు ఉండండి అంటూ బాలుతో చాలా గట్టిగా మాట్లాడుతుంది శృతి.
శృతి మాట్లాడిన మాటలకి బాలు మరింత రగిలిపోతాడు. తనను ఎదిరించి మాట్లాడిన శృతిని ఇష్టం వచ్చినట్లు బాలు తిడతాడు. నువ్వే గొప్ప గొప్ప చదువులు చదివావని, నీకే తెలివితేటలు ఉన్నాయా చూపిస్తున్నావా? కాలేజీలో లేచిపోవడం ఎలా? అని నేర్పించారంటూ శృతిని అందరి ముందు అవమానిస్తాడు. మరోవైపు రవి టార్గెట్ చేస్తూ.. ఇంకోసారి నన్ను కలవాలని, ఇంటికి రావాలని ప్రయత్నించినా అక్కడే నరికేస్తా.. అంటూ చాలా సీరియస్‌గా మాట్లాడడడంతో శృతికి మరింత కోపం పెరగుతుంది. జీవితంలో మీ ఇంట్లో అడుగు పెట్టనని తెగేసి చెబుతుంది.
ఆ కోపంలో మీనాపై నిప్పులు చెరుగుతాడు బాలు. నీ వల్లనే రవిగాడు పెళ్లి చేసుకున్నాడంటూ మీనా ను అవమానిస్తాడు. ఇంకోసారి రవితో మాట్లాడాలని ప్రయత్నిస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు.. మీనాక్షి ప్రభావతి దగ్గరికి వచ్చి.. రవిని ఇంటికి తీసుకువచ్చి ప్లాన్ వేస్తారు. రవిని ఇంటికి తీసుకురావాలని లేకపోతే తన మామయ్య వాడిని అమెరికన్ తీసుకెళ్తాడంటూ సత్యం కు నచ్చదెబ్బే ప్రయత్నం చేస్తుంది కామాక్షి. అప్పుడే ఇంటికి వచ్చిన బాలు… రవి విషయాన్ని ప్రస్తావించి, తన తండ్రిని ఒప్పించాలని ప్రయత్నించినా.. తాను ఒప్పుకోను అంటూ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మీనా తన మామయ్యతో అసలు విషయం చెబుతుంది. రవి వాస్తవానికి మిమ్మల్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అయితే శృతి తొందర పెట్టేసరికి.. ఏం చేయాలో తెలియక పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అంటుంది. ఈ విషయంలో ప్రవేశించి ఇంటికి తీసుకురమ్మని సలహా ఇస్తుంది. అప్పడు బాలు.. అనవసరంగా వాడి గురించి ఆలోచించి, తన తండ్రి పరువును తీసిన సురేంద్ర కూతురు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడం సరికాదని, ఆ పిల్ల తననే గౌరవించడం లేదనీ, తన తండ్రిని ఎలా గౌరవిస్తుందని అంటాడు. ఈ విషయంలో ఎవరు రవిని క్షమించినా.. తాను మాత్రం క్షమించలేనని, ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోమని అందరికీ చెప్పి వెళ్తాడు సత్యం. మరోవైపు హోటల్లో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ రవి బాధపడుతూ ఉండగా, శృతి వచ్చి.. మీ అన్నయ్య రౌడీ వెధవల ప్రవర్తిస్తున్నాడని, తనని మరోసారి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేయొద్దు అంటూ తేగేసి చెబుతోంది శృతి. దాంతో రవికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.