Gunde Ninda Gudi Gantalu December 11th : గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్‌లో బాలు ప్రవర్తనకి రవి, శృతి చాలా ఫీలయ్యారు. మీ అన్నయ్య రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు. మీ మీన వదిన ఎలా భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ శృతి చెబుతుంది.మరోసారి వారి ఇంటికి వెళ్దామని చిన్న పిల్లల మాట్లాడకండి రవికి తేల్చి చెప్తుంది. దీంతో రవి అయోమయంలో పడతాడు. ఇక తాజా ఎపిసోడ్‌లో బాలుకి ఒళ్లు నొప్పులు ఉన్నాయని, కాస్త మసాజ్ చేయమని అడుగుతాడు. దాంతో మీనా.. బాలుని బొక్క బోర్లా పడుకోబెట్టి.. వీపుపై ఎక్కి తొక్కుతుంది. దీంతో ఒక్కసారిగా అమ్మ అంటూ అరుస్తాడు. ఆ అరుపు విన్న ప్రభావతి కంగారు పడుతూ బాలు రూమ్ దగ్గరకి వస్తుంది. బాలుపై మీనా.. ఎక్కి తొక్కుతుండని చూసి.. వాడిని చంపేస్తావ్ అనుకుంటున్నావేంటి. అని మీనాపై కోప్పడుతుంది. ‘నువ్వుంటే నీతో తొక్కిస్తోంది. ఇక్కడి నుంచి వెళ్ళమని ప్రభావతికి చెప్తాడు. దీంతో ప్రభావతి కోప్పడుకుంటూ వెళ్ళిపోతుంది.
అయితే ఎప్పుడు లేంది తన తల్లి పిలవగానే వచ్చింది. ఏందని మీనా ను అడుగుతాడు బాలు. ఎంతైనా మీ అమ్మ కదా నువ్వు పిలిస్తే.. కచ్చితంగా మాట్లాడుతుంది అని చెబుతోంది మీనా. మరుసటి రోజు ఉదయాన్నే రవి మనోజ్ కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇంటికి రావాలని ఉందని చెబుతాడు. ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఇంటికి రమ్మనడానికి సిద్ధంగానే ఉన్నారని, కానీ బాలు గాడే అడ్డుపడుతున్నాడంటూ మనోజ్ చెబుతాడు. ఇక రవికి మనోజ్ పంచ్ వేస్తూ.. ‘నువ్వు లక్కీ రా.. కోటీశ్వరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. అప్పుడు రవి కూడా ‘నీకేం తక్కువైందన్న మీ మామయ్య కూడా కోటీశ్వరుడు ఆయన మలేషియాలో సెట్ అయ్యాడుగా అని లైట్‌గా చురకలు అంటిస్తాడు.
అప్పుడు . ‘నాది ఏముంది రా.. బ్లాక్ చెక్.. దానిపై సంతకం లేదు కదా.. అది ఎప్పుడు చెల్లుతుంది. ఎప్పుడు పని చేస్తుందో తెలియడం లేదు’ అంటూ మనోజ్ ఫీల్ అవుతాడు. అంతలోనే శృతి రూమ్ నుండి బయటకు రావడంతో తర్వాత కాల్ చేస్తానంటూ.. ఫోన్ కట్ చేస్తాడు రవి. దీంతో శృతికి కోపం వస్తుంది. తాను రాగానే ఫోన్ ఎందుకు కట్ చేసావ్ అంటూ రవిని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇంట్లో వాళ్ళు తనని రమ్మంటున్నారని, కానీ, బాలు మాత్రమే అడ్డు చెప్తున్నారంట అని సమాధానం ఇస్తాడు రవి. ‘అయితే నువ్వు మాత్రమే వెళ్ళు.. నేను రాను ‘అంటూ తెగేసి చెబుతుంది శృతి. బాలు ప్రవర్తన తనకు నచ్చలేదని రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడని ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి మీ అన్నయ్యకు తెలియదని శృతి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
మన వలన ఇన్ని అనార్ధాలు జరిగాయి కాబట్టే కదా ఆయన ఇంత కోప్పడింది అని రవి.. శృతికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నలతో ఎలా మెదిలానో చెబుతాడు. దీంతో శృతికి మరింత కోపం వస్తుంది. అలాగైతే మీ అన్నలతో ఉండు.. నా దారి నేను చూసుకుంటా అని శృతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి.. శృతిని ఎలా కూల్ చేస్తాడు, తన ఇంటికి వెళతాడా లేదా అనేది తర్వాతి ఎపిసోడ్‌లో తెలియనుంది.