Gunde Ninda Gudi Gantalu December 2nd :గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్‌లో ప్రభావతి.. మీనాకి కాల్ చేసి రవి గురించి ఏం ఆలోచించావని అంటుంది. త్వరగా రవిని ఇంటికి తీసుకురాకపోతే శృతి వాళ్ళ నాన్న రవిని ఇల్లారికం తీసుకెళ్లే ప్రమాదముందనీ, ఆ తర్వాత ఎలాంటి ప్లాన్ చేసిన వర్కౌట్ కాదని చెబుతోంది మీనాక్షి. మరోవైపు రవి, శృతి తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికే తప్పు చేసామని, అనవసరంగా మరో తప్పు చేయలేదని, కనీసం ఇరు ఫ్యామిలీలో ఒప్పుకున్న తర్వాతే శోభనం చేసుకుందామని చెబుతాడు రవి. దీంతో శృతి డిసప్పాయింట్ అవుతుంది. తన ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దని, తాను కూడా ఫ్యామిలీని విడిచి వచ్చానని, స్వార్థంగా ఆలోచిస్తున్నారని అనుకున్న పర్వాలేదని అంటుంది.
మరోవైపు లేని జాబ్ గురించి మనోజ్ గొప్పలు చెప్పుకుంటాడు. తాను ఈ నెల 15 కార్లు అమ్మాననీ, తనకు ఏసీ క్యాబిన్ ,పడకడానికి బ్రెడ్ ఇచ్చారని, ఆఫీసులో తనకు తానే బాస్ అంటూ తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు జీతం పెంచమని అడగడని చెబుతోంది రోహిణీ. దీంతో ఇరకాటంలో పడుతాడు మనోజ్. ఇక కిందికి రాగానే సత్యం జాబ్ ఎలా ఉందంటూ అడుగుతాడు. ఆఫీస్ కు వెళ్లడానికి ఇబ్బంది పడకుండా.. ఆఫీసులో లోన్ తీసుకొని కారు కొనుక్కోమని సలహా ఇస్తాడు. ప్రభావతి కూడా సపోర్టుగా మాట్లాడుతుంది. అంతలోనే రోహిణి కూడా కిందికి వస్తుంది. ఆ విషయం తెలుసుకుని రోహిణి సంతోషపడుతుంది. ఈరోజే ఆ లోన్ గురించి మాట్లాడమని మనోజ్ కు చెబుతుంది.
ప్రభావతి .. మనోజ్ ను ఇరికించే ప్రయత్నం చేయగా, మనోజ్ ఆఫీస్ లో లోన్ అడగడానికి మొహమాటపడుతున్నాడని, నువ్వే వెళ్లి వాళ్ళ ఆఫీస్ లో లోన్ గురించి అడగమని అంటుంది. అప్పుడు తానే లోనే గురించి అడుగుతానని అంటాడు మనోజ్. ఇక అదే సమయంలో ఆటో రావడంతో తనకు టైం అవుతుందని రోహిణి షాప్ కు వెళుతుండగా, ప్రభావతి తాను పార్లర్‌కి వస్తానని చెబుతుంది. అయితే అప్పుడు రోహిణి.. మరోవైపు వాడిని ఏదో పని చూసుకోమని అంటున్నావు ? వాడు జాబ్ చేయడం లేదని ప్రభావతిని అడుగుతాడు సత్యం. అదేం లేదు ఈరోజు సెలవు అంటున్నాడు వేరే పని చేసేకుని రమ్మని చెబుతున్నానని అంటుంది. మరోవైపు మీనా వంటచేసి తాను బయటకు వెళ్తున్నానని తన మామయ్యకు చెప్పి వెళ్తుంది.
ఇంతలోనే మీనాక్షి ఇంటికి రాగా, ఆ సమయంలో రవి గురించి మాట్లాడి సత్యంను బాధపెడుతుంది. తాను ఇంటి దగ్గర తినకుండా వచ్చానని, బాగా ఆకలి అవుతుందని అంటుంది. దీంతో ప్రభావతి తిందాం అని పిలుస్తోంది. కానీ తిన్న తర్వాత సాంబార్ పై ప్లేటు పెట్టడంతో అందులో బల్లి పడుతుంది. మరోవైపు.. బాలుకి తెలియకుండా మీనా ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తుంది. కానీ, మీనాను కలవాలని వెళ్ళిన ఫైనాన్షియర్ ఇష్టపడడు. తనని బయటికి పంపించడని తన బాడీగార్డ్స్ కు చెబుతాడు. తాను మాత్రం సేట్ ను కలిసేంతవరకు వెళ్లనని మీనా భీష్మించి కూర్చుంటుంది.