Gunde Ninda Gudi Gantalu December 3rd : గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్లో శృతి,రవిలు హనీమూన్ గురించి తెగ చర్చిస్తుంటారు. హనీమూన్ ఇప్పుడు అవసరం లేదని, పిల్లలు కూడా రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్న తర్వాత పెట్టుకుందామని అంటాడు. మరోవైపు మనోజ్ గొప్పలు చెబుతూ ఉంటాడు. తాను ఇంటిదగ్గర తిని రాలేదని ఆకలి అవుతుందని అనడంతో ప్రభావతి మీనాక్షిలు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కానీ సాంబార్ పై మూత పెట్టక పోవడంతో బల్లి పడుతుంది. ఇక తాజా ఎపిసోడ్లో ప్రభావతి, మీనాక్షి ఇద్దరు కలిసి వెళ్లి రవిని కలవడం జరుగుతుంది. అయితే అప్పుడు ప్రభావతి రవిపై తెగ ప్రేమ ఒలకబోస్తుంది. శృతి, నువ్వు ఇద్దరి కలిసి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. తాను ఇంట్లో వారితో మాట్లాడుతానంటూ ప్రభావతి చెప్పడంతో రవి హ్యాపీగా ఫీలవుతాడు.
అయితే బాలు తనని ఇంట్లోకి రానివ్వడని రవి అంటాడు. అప్పుడు మీనా చేయడం వల్ల జరిగిందని, మీనా చెప్పిన మాట వినడంతోనే ఈ అనార్థాలు జరిగాయనీ మరోసారి మీనాను నిందిస్తుంది ప్రభావతి. తన పెళ్లి గురించి మీనా వదినకు ఏం తెలవదని, తానే అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లానని రవి నిజం చెప్పిన ప్రభావతి నమ్మదు. ఆ దేవుడు దిగి వచ్చి మీనా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినా.. మీ మమ్మీ నమ్మదంటూ మీనాక్షి అంటుంది. ఇక మీనా ఫైనాన్సర్ ను కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఫైనాన్సర్ బాడీగార్డ్స్ వచ్చి.. వాస్తవానికి అన్నకు నిన్ను కలవడం ఇష్టం లేదని, నువ్వు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని వారు చెబుతారు.
అప్పుడు మీనా ఆయనని కలిసేంత వరకు ఇక్కడ నుండి వెళ్లనని అంటుంది. అప్పుడు ఫైనాన్సియర్ తన ఆఫీసు నుండి బయటకి రాగా, తాను ఒక నిమిషం మాట్లాడాలని, మీ కూతురు లాంటి దాన్ని అని బాలు చేసిన తప్పుకు తాను క్షమాపణ చెప్తున్నానని మీనా అంటుంది. కానీ, ఫైనాన్షియర్ .. మీనా మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అయినా .. మొండిగా.. కారు దగ్గర దాకా వెళ్లి మాట్లాడుతుంది. ఎంత చెప్పినా తాను బాలుని క్షమించమని, వాడు తాగుతే ఎలా మాట్లాడుతాడో.. నీకు తప్ప అందరికీ తెలుసునని, తనని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడంటూ సీరియస్ అవుతాడు ఆ ఫైనాన్షియర్. మీనా బాధను అర్థం చేసుకున్న ఓ అమ్మాయి .. సార్ ఇక్కడ బిజీగా ఉంటాడు. ఇంటికి వెళ్లి కలిస్తే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు అంటూ అతని విజిటింగ్ కార్డ్ ఇస్తుంది.
ఇక బాలు తినడానికి ఇంటికి వెళ్లాలని అనుకోగా, అప్పుడు ఓనర్ మొత్తం కార్లు కడిగిన తర్వాతనే ఇంటికి వెళ్లాలని, లేదంటే.. పని మానేయమని చెబుతాడు. దీంతో చేసేది ఏం లేక అన్ని కార్లు కడిగిన తర్వాతనే తినడానికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి కూడా భోజనం చేయడానికి సిద్ధమవుతాడు. బాలు. అయితే అప్పుడు సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని బాలు గమనిస్తాడు. వెంటనే దగ్గర నుండి ప్లేటు లాగేసుకుని సాంబార్లో బల్లి పడిందని కోప్పాడుతాడు. ఇంతలోనే తన తల్లి ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లో నాన్నను విడిచి ఎక్కడికి వెళ్లావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు బాలు. అయితే రవి దగ్గరకి వెళ్లిన విషయం ఎక్కడ తెలుస్తుందో అని ప్రభావతి టెన్షన్ పడుతుంది. అదే సమయంలో బాలు..సాంబార్లో బలి పడ్డ విషయం అడగ్గా, ఆ విషయం తనకేం తెలియదని, మీనానే పని ఉందంటూ ఎక్కడ పని అక్కడ నే విడిచి వెళ్లిందంటూ మీనా పై మరో నింద వేస్తుంది. అంతలోనే మీనా ఇంటికి రావడం, ఆయన కోపం కట్టలు తెంచుకోవడం జరుగుతుంది.