Gunde Ninda Gudi Gantalu December 4th : బ‌ల్లి విష‌యంలో మీనాపై సీరియస్ అయిన బాలు.. గుడికి వెళ్లి ఏం మొక్కుతున్నావంటూ ప్ర‌భావ‌తి సెటైర్స్

Gunde Ninda Gudi Gantalu December 4th : బ‌ల్లి విష‌యంలో మీనాపై సీరియస్ అయిన బాలు.. గుడికి వెళ్లి ఏం మొక్కుతున్నావంటూ ప్ర‌భావ‌తి సెటైర్స్

Gunde Ninda Gudi Gantalu December 4th : గుడి గంట‌లు గ‌త ఎపిసోడ్‌లో మీనా త‌న భ‌ర్త గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఫైనాన్షియర్‌ని క‌లిసి త‌న భ‌ర్త గురించి మాట్లాడాల‌ని అనుకుంటుంది.అయితే అత‌ను ఎంత‌కి మీనాని క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌డు. అయితే మీనా పట్టుబడి కూర్చుంటుంది. మీనా బాధను అర్థం చేసుకున్న ఓ అమ్మాయి సార్ ఇక్కడ బిజీగా ఉంటాడు ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని చెబుతాడు. ఇక బాలు త‌న ఇంట్లో అన్నం తినే స‌మ‌యంలో బ‌ల్లిని గ‌మనిస్తాడు. అప్పుడు ప్ర‌భావతి రాగా, ఆ నింద‌ని మీనా మీద వేస్తుంది ప్ర‌భావ‌తి. అయితే అప్పుడే మీనా కూడా రావ‌డంతో ఆమెని గ‌ట్టిగా అడుగుతాడు బాలు. తాజా ఎపిసోడ్‌లో మీనా స్పందిస్తూ.. తాను సాంబార్లో ఏం వెయ్యలేదని, వంట చేసి అన్ని జాగ్రత్తగా మూతలు పెట్టి, బయటకు వెళ్లాలని చెబుతోంది. కానీ, మీనా చెప్పిన మాటలు బాలు పట్టించుకోకుండా తిడతాడు.

ఇక దొరికింది క‌దా ఛాన్స్ అని ప్ర‌భావ‌తి కూడా ఓ రేంజ్‌లో తిట్టిపోస్తుంది. అదే సాంబార్ ను మనోజ్ తీసుకువెళ్లాడని, వాడు తిన్నాడా ఏమో అని కంగారు కంగారుగా ప్రభావతి ఫోన్ చేయడానికి రూమ్ లోకి వెళుతుంది. మీనాక్షి అసలు విషయం గుర్తుకు చేసుకొని ప్రభావతి రూమ్ లోకి తీసుకువెళ్తుంది. సాంబార్లో ఏం పడలేదని, మనం తినేటప్పుడు అంతా బాగానే ఉందని, కానీ తిన్న తర్వాత నువ్వు .. సాంబార్ పై మూత పెట్టలేదని గుర్తు చేస్తుంది. దీంతో ప్రభావతి తన తప్పు తెలుసుకుంటుంది. కానీ, మీనా ఇంట్లో ఉండి ఉంటే.. బల్లి పడి ఉండేది కాదు కదా అంటూ మళ్ళీ మీనాని నిందించడం ప్రారంభిస్తుంది. అసలు విషయం బాలుకి చెప్తానంటూ మీనాక్షి.. ప్రభావతిని భయపెట్టిస్తుంది.

ఈ విష‌యం తెలిస్తే వాడు చంపేస్తాడంటూ ప్ర‌భావ‌తి భ‌య‌ప‌డుతుంది. ఇక రవి లేని సమయంలో ఇంట్లోకి దూరి శృతి పై హత్య ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తాడు సంజు. మత్తుమందును తన కర్చీఫ్ లో చల్లుకొని.. శృతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శృతి లేవడంతో సంజు ప్లాన్ ఫెయిల్ అవుతుంది. రవికి కనిపించకుండా దాచుకుంటాడు. రవి, శృతిలు లోపలికి వెళ్ళగానే సంజు బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఇదిలా ఉంటే.. ఓ గుడ్ న్యూస్ అంటూ రవి తన తల్లి వచ్చినా విషయాన్ని చెబుతాడు. తనను కలవడానికి తన తల్లి వచ్చిందని, త్వరలోనే ఇంట్లో మాట్లాడి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని రవి సంతోషపడతాడు. దీంతో శృతి కూడా చాలా సంతోషపడుతుంది.

మరుసటి రోజు ఉదయాన్నే మీనా త్వరగా లేచి.. వంటలన్నీ పూర్తి చేస్తుంది. ప్రభావతి వచ్చి తనకు కాఫీ కావాలని అడుగుతుంది. కాఫీ ఎప్పుడో చేసి అక్కడ పెట్టానని అంటుంది మీనా. వంటలను చూసి తొందరగానే ప్రిపేర్ చేశావ్.. ఈరోజు కూరల్లో ఏం వేసావ్ అంటూ మీనాను ప్రభావతి హేళన చేస్తుంది. దీంతో మీనాక్షికి మండుతుంది. తాను నిన్న కూడా మూతలు సరిగ్గానే పెట్టి వెళ్ళానని, కానీ మధ్యలో ఎవరో భోజనం చేసి మూతల సరిగ్గా పెట్టలేదని అంటుంది. బాలు కూడా ఏంటి డ్రామాలు అంటూ సీరియస్ అవుతాడు. ఇది డ్రామా కాదని, తన బాధను వ్యక్తం చేస్తున్నారని ఇంట్లో తనని మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదని, ప్రతి విషయానికి తానే తప్పు చేశానని నిందిస్తున్నారని మీనా అంటుంది. ఇక ప్రభావతి రోజు గుడికి వెళ్లి ఏం ప్రార్థిస్తున్నావనీ వెటకారంగా అడ‌గ‌డంతో సత్యం రియాక్ట్ అవుతూ.. మీరేమైనా మనుషులేనా అంటూ ప్రభావతిని తిడతాడు.