Gunde Ninda Gudi Gantalu December 6th : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్‌లో బాలు బాధని సత్యం చూడలేకపోతాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి బాలు కారును అతడికి తిరిగి ఇవ్వాలని అనుకుంటాడు. ప్రభావతి అందుకు ఒప్పుకోదు..ఇక ఫైనాన్షియర్‌ను ఎందుకు కొట్టాల్సివచ్చిందో మీనాకు వివరిస్తాడు బాలు. నేను డబ్బులు ఇచ్చిన తర్వాత మీ నాన్న చచ్చిపోతే ఎలా అని ఫైనాన్షియర్ అనడంతో కోపం పట్టలేక కొట్టానని బాలు అంటాడు. ఆ టైమ్‌లో అక్కడ ఉంటే మీ కంటే ముందే నేనే చెప్పుతీసి కొట్టేవాడినని బాలుతో అంటుంది మీనా. ఇక నుంచి ఏదైనా నాతో చెప్పి చేయి…నా విషయంలో జోక్యం చేసుకోవద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు బాలు.ఇక కారును తిరిగి తమకు ఇచ్చేయమని గణపతిని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. కారు అమ్మేసి బాలు క్లీనర్ జాబ్ చేస్తున్నాడని, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడని సత్యం ఎమోషనల్ అవుతాడు…
అయితే కారు కొన్న తర్వాత తాను కొన్ని మార్పులు చేశానని, మొత్తం నాలుగు లక్షలు ఇవ్వమని సత్యంతో అంటాడు గణపతి. అప్పుడు తాను అంత డబ్బు ఇచ్చుకొనే స్థితిలో లేనని అంటాడు. చివరకు బేరం మూడున్నర లక్షలకు కుదురుతుంది. డబ్బు రెడీ చేసి కారు తీసుకెళతానని గణపతితో చెప్పి వచ్చేస్తాడు సత్యం. ఇక రవి గురించి సత్యంతో చెప్పాలని ప్రభావతి అనుకుంటుంది. రవి పేరు వినగానే సత్యం కోపంతో ఎగిరిపెడతాడు. వాడిని జన్మలో ఈ గడప తొక్కనివ్వనని చెబుతాడు. ఇక బాలు నా ఆపరేషన్ కోసం కారు అమ్మేశాడని, సొంత కారులో తిరగాల్సిన వాడు ఇప్పుడు వేరేవాళ్ల కార్లు కడుగుతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం నాకు చాలా బాధగా ఉందని ప్రభావతితో అంటాడు సత్యం.
బాలు కారు కోసమే డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టాలనుకున్న విషయం చెప్పేస్తాడు. మనకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తిని తాకట్టు పెడతారా, బాలుకు ఎంత చేసినా ఉపయోగం ఉండదని ప్రభావతి అంటుంది. ఈ ఇంటిని మిగలనివ్వమని చెబుతుంది. బాలు కోపం గురించి కాకుండా వాడు పడుతోన్న బాధ గురించి ఓ సారి ఆలోచించమని ప్రభావతికి అర్థమయ్యేలా వివరిస్తాడు సత్యం. చివరకు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి ప్రభావతి అంగీకరిస్తుంది. మీ ఆపరేషన్ కోసం తాను బంగారం తాకట్టు పెట్టినట్లు చెప్పిన ప్రభావతి మరో రెండు లక్షలు ఎక్కువ తీసుకోండి.. ఆ డబ్బుతో వాటిని విడిపించుకుంటానని అంటుంది. సత్యం అందుకు అంగీకరిస్తాడు.
బాలు నిద్రలో ఉంటాడు. మీనా లేపడానికి ప్రయత్నిస్తే కసురుకుంటాడు. చెవిలో గిలిగింతలు పెట్టి బాలు నిద్రను డిస్ట్రబ్ చేస్తుంది. మీనాను ఆపడానికి చేయిపట్టుకోవడంతో బాలుపై పడిపోతుంది మీనా. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు. పొద్దునే నీ ముఖం చూశాను కదా…ఈ రోజు నన్ను ఎవరు ఎలా అవమానిస్తారోనని తలుచుకుంటేనే భయమేస్తుందని సమాధానమిస్తాడు బాలు. అంత మంచే జరుగుతుందని భర్తతో చెబుతుంది మీనా. నీ వల్ల నాకు ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు..పొగొట్టుకోవడానికి నా ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవని సమాధానమిచ్చి వెళ్లిపోతాడు బాలు. కష్టపడి పనిచేస్తుంటే ఇంట్లో కూర్చొని తినేవాళ్లు ఎక్కువైపోయారని మనోజ్, మీనాను అవమానిస్తుంది ప్రభావతి.వీళ్ల నోటి నుంచి వచ్చే మాటలు పడే కంటే ఆ కార్లు కడగటడానికి వెళ్లడమే మంచిదని బాలు అంటాడు. ఇక మీనా వల్లే తిరిగి తన కారు తనకు దక్కడంతో బాలు ఆనంద పడతాడు. తొందరపడి ఆమెను తిట్టినందుకు ఆమెకు క్షమాపణలు చెబుతాడు. భార్యను కారులో కూర్చుండబెతాడు. ఆమెకు గాజులను బహుమతిగా ఇస్తాడు.