Gunde Ninda Gudi Gantalu December 9 Episode : సొంత కారు ద‌క్కించుకున్న బాలు.. మీనా వ‌ల్లే ఇదంతా అని హ్యాపీ

Gunde Ninda Gudi Gantalu December 9 Episode : సొంత కారు ద‌క్కించుకున్న బాలు.. మీనా వ‌ల్లే ఇదంతా అని హ్యాపీ

Gunde Ninda Gudi Gantalu December 9 Episode : గుండె నిండా గుడి గంట‌లు ఎపిసోడ్‌లో బాలు, మీనాల‌ని ఎగ‌తాళి చేస్తూ ప్ర‌భావ‌తి మాట్లాడుతుంది. దాంతో హ‌ర్ట్ అయిన బాలు త‌న త‌ల్లి మాట‌ల‌ను భ‌రించ‌డం కంటే అపార్ట్‌మెంట్ క్లీన‌ర్ జాబ్ చేయ‌డ‌మే మంచిద‌ని బాలు నిశ్చ‌యించుకుంటాడు.అదే స‌మయంలో వచ్చిన స‌త్యం బ‌య‌ట‌కి ర‌మ్మని చెబుతాడు. అప్పుడు కొడుకుగా నీ బాధ్య‌త నువ్వు చూపించావు. తండ్రిగా నా బాధ్య‌త నేను చూపించాలిగా అని అంటాడు. ఇంటి ఎదురుగా తాను అమ్మేసిన సొంత కారు క‌నిపించ‌డంతో బాలు ఆనందంగా ఫీల‌వుతాడు. ఈ కారు ఇక్క‌డికి ఎలా వ‌చ్చింది? గ‌ణ‌ప‌తికి అమ్మేశానుగా అని అంటాడు బాలు. గ‌ణ‌ప‌తి ద‌గ్గ‌ర నుంచి నీ కోసం మీ నాన్న ఈ కారు కొన్నాడ‌ని బాలు ఫ్రెండ్ చెబుతాడు.కారు కోసం అంత డ‌బ్బు ఎక్క‌డి తెచ్చార‌ని స‌త్యాన్ని అడుగుతుంది మీనా.

ఇంటి ప‌త్రాలు తాక‌ట్టు పెట్టి డ‌బ్బులు తీసుకొచ్చామ‌ని ప్ర‌భావ‌తి స‌మాధాన‌మిస్తుంది. నా ఆప‌రేష‌న్ కోసం కారు అమ్మేశాడు. న‌న్ను ఒక్క మాట అన్నందుకు ఫైనాన్షియ‌ర్‌ను కొట్టి అద్దె కారు పొగొట్టుకున్నాడు. మీరు తినే తిండికి లెక్క‌లుక‌డ‌తార‌ని తెలిసి ఆత్మాభిమానం చంపుకొని క్లీన‌ర్ జాబ్ చేస్తుంటే నేను ఎలా చూస్తుండ‌గ‌ల‌ను. నా ప్రాణం కాపాడిన కారును తిరిగి వాడికి ఇవ్వాల‌ని అనుకునే ఇదంతా చేశాన‌ని స‌త్యం అంటాడు. తండ్రి మాట‌ల‌తో బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు. క‌న్నీళ్లు పెట్టుకుంటూ తండ్రిని హ‌త్తుకుంటాడు.. పొద్దుపొద్దున్నే నీ ముఖం చూసినందుకు…ఎవ‌రు న‌న్ను ఎన్ని మాట‌లు అంటారో అని మీనాను అవ‌మానించిన విష‌యం గుర్తొచ్చి బాలు బాధ‌ప‌డ‌తాడు.తండ్రికి థాంక్స్ చెబుతాడు బాలు. నాకు కాదు మీనాకు చెప్ప‌మ‌ని స‌త్యం అంటాడు.

నువ్వు క్లీన‌ర్‌గా క‌ష్ట‌ప‌డుతున్నావ‌ని కారు కోసం మీనా ఫైనాన్షియ‌ర్ చుట్టూ తిర‌గ‌డం వ‌ల్లే నాకు ఈ విష‌యం తెలిసింద‌ని అంటాడు. నీ థాంక్స్ మీనాకే చెందాల‌ని స‌త్యం అంటాడు. స‌త్యం, మౌనిక‌, మీనాల‌ను తీసుకొని కారులో ట్రిప్ వేస్తాడు బాలు. కారు అమ్మేసి ఇష్టం లేని ప‌నిచేస్తూ ఆయ‌న ఎంత బాధ‌ప‌డ్డారో…కుమిలిపోయారో నేను క‌ళ్లారా చూశాను. మ‌ళ్లీ కారు చూసిన త‌ర్వాతే బాలు ముఖంలో సంతోషం చూశాన‌ని, ఆయ‌న ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే చాలానిపించింద‌ని త‌ల్లితో మీనా చెబుతుంది. మీనా మాట‌లు విని బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు.

మీనాకు థాంక్స్ చెప్పాల‌ని పిలుస్తాడు. కానీ ఈగో అడ్డొచ్చి ఆగిపోతాడు. నా ఫోన్ క‌న‌ప‌డ‌టం లేద‌ని అబ‌ద్ధం ఆడుతాడు. నువ్వు త్వ‌ర‌గా రెడీ అయితే బ‌య‌ట‌కు వెళ్దామ‌ని మీనాతో అంటాడు బాలు. బాలు వెంట వెళ్ల‌డానికి మీనా ఒప్పుకోదు. నీ భ‌ర్త‌గా పిలుస్తున్నాను వ‌స్తావా రావా అని ఆర్డ‌ర్ వేస్తాడు బాలు. నీకు నాకు ఏ సంబంధం లేద‌ని అన్న‌ది మీరే…మ‌ళ్లీ ఇప్పుడొచ్చి నీ భ‌ర్త‌ను అంటున్నారు. రెస్టారెంట్‌కు వెళ్లిన త‌ర్వాత మాట మార్చితే నేను ఎక్క‌డికి వెళ్లాలి అని మీనా అంటుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన మ‌హాల‌క్ష్మికి నువ్వు అంటూ తండ్రి మీనా గురించి చెప్పిన మాట‌ల్ని గుర్తుచేసుకుంటాడు. కారును ఓ చోట ఆపుతాడు బాలు. అక్క‌డ బాలు స్నేహితుడు క‌నిపిస్తాడు. వీడు నీతో ఏదో చెప్పాల‌ని అనుకుంటున్నాడ‌ని త‌న స్నేహితుడిని చూపించి మీనాతో అంటాడు బాలు. ఇంత‌లో శృతి, ర‌వి రెస్టారెంట్‌కు వ‌స్తారు. ఆర్డ‌ర్ ఇచ్చిన ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో వెయిట‌ర్‌కు చెబుతుంటాడు. నీ చెఫ్ బుద్ది పోనిచ్చుకోలేద‌ని ర‌విపై శృతి వెట‌కారం ఆడుతుంది. . శృతి ఆర్డ‌ర్ ఇస్తుంది. ఆ ఫుడ్ ఎలా చేస్తాడో నేను కిచెన్‌లోకి వెళ్లి చూస్తాన‌ని ర‌వి అంటాడు.