Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. తనను కల్యాణి అని పిలవొద్దని, బాలు, మీనాలను కలవద్దని ఆర్డర్స్ వేస్తుంది రోహిణి. కానీ, ఇంతలో డోర్ పక్కన ఉన్న మీనాను చూసి ఇద్దరూ షాక్ అవుతారు. సుగుణపై మీనాకు డౌట్ వస్తుంది. సుగుణ, రోహిణి మధ్య ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని అనుమానిస్తుంది మీనా. తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో భాగంగానే అంతా కలిసి టపాసులు కాల్చుతుంటారు. వారంతా టపాసులు కాలుస్తుంటే పరాయి వాడిలా దూరం నుంచి చూస్తూ ఉంటాడు రవి. తన కుటుంబం అంతా కలిసి సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే తాను మాత్రం ఇంటికి దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతాడు రవి.
మరోవైపు రోహిణి కొడుకు చింటూ కూడా దీపావళి సంబరాలు వారితో కలిసి పోతాడు. కానీ, చింటూని చూసి మనోజ్ చిరాకు పడతాడు. వాడు ఎవడికి పుట్టాడో.. కానీ దర్జాగా మన ఇంట్లో మనమడిలా టపాసులు కాలుస్తున్నాడు చూడు అంటూ రోహిణి చూపిస్తాడు. ఈ సమయంలో అనుకోకుండా చింటూ పై నిప్పురవ్వలు పడతాయి. దీంతో రోహిణి కంగారుపడి పరిగెత్తి చింటూని దగ్గరకు తీసుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యులందరికీ రోహిణి పై అనుమానం వస్తుంది. ఇంతలో చింటు కళ్లలో టపాసుల నిప్పు రవ్వు పడుతుంది. దాంతో రోహిణి తెగ కంగారుపడిపోయి చింటూ అని వెళ్తుంది. రోహిణి తల్లి ప్రేమ బయటపడి చింటుని ఎత్తుకుని పక్కకు లాగుతుంది. అదంతా చూసి మనోజ్, ప్రభావతి, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత కింద కూర్చుని మంటగా ఉందా, కళ్లు మండుతున్నాయా, జాగ్రత్తగా ఉండాలి కదా అని చింటుతో చెబుతుంది రోహిణి. అనంతరం చింటును ప్రేమగా హగ్ చేసుకుంటుంది రోహిణి.
చింటును సుగుణకు అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని, ఇకనైనా జాగ్రత్తగా ఉండమని, చింటును అస్సలు వదిలిపెట్టకని తల్లికి జాగ్రత్తలు చెబుతుంది రోహిణి. అదంతా సత్యం ఫ్యామిలీ చూస్తారు. బాలు వెళ్లి పార్లరమ్మా నువ్వెందుకు అంత కంగారుగా పరిగెత్తావ్ అని అడుగుతాడు. దాంతో రోహిణి భయంతో కంగారుపడుతుంది. రోహిణి ఏం చెబుతుందా అని ప్రభావతి, మనోజ్ వేచిచూస్తారు. కానీ, రోహిణి మాత్రం కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
పిల్లలంటే తనకు ఇష్టమని, అందుకే అలా రియాక్ట్ అయి కంగారుగా పరుగెత్తానని రోహిణి కవర్ చేసుకుంటుంది. రోహిణి మంచితనతం చూసి ప్రభావతి, మనోజ్ మురిసిపోతారు. చిన్న పిల్లలు ఇష్టమైనప్పుడు త్వరలో మనవడిని చేతిలో పెట్టాలని రోహిణి, మనోజ్‌తో తన కోరిక బయటపెడుతుంది ప్రభావతి. రోహిణి మాత్రం కంగారుగా చూస్తుంది. చింటు మీదున్న ప్రేమను చూపించిన రోహిణికి మనోజ్‌తో తల్లి కావాలని ప్రభావతి కోరిక కోరి పెద్ద షాక్ ఇచ్చినట్లు అవుతుంది. తర్వాత ఇంటికెళ్లి సత్యం ఇంట్లో జరిగింది శ్రుతితో చెప్పుకుని రవి బాధపడతాడు