Gunde Ninda Gudi Gantalu : కాళ్లు ప‌ట్టుకొని క్షమాప‌ణ‌లు చెప్ప‌మ‌న్న ఫైనాన్షియ‌ర్.. తాగొచ్చి అత్తారింట్లో బాలు హంగామా

Gunde Ninda Gudi Gantalu : కాళ్లు ప‌ట్టుకొని క్షమాప‌ణ‌లు చెప్ప‌మ‌న్న ఫైనాన్షియ‌ర్.. తాగొచ్చి అత్తారింట్లో బాలు హంగామా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్‌లో బాలు తన అత్తగారింటికి వెళ‌తాడు. అయితే మీనా పుట్టింట్లో భ‌ర్తతో క‌లిసి సంతోషంగా దీపావ‌ళి పండ‌గ జరుపుకోవాల‌ని అనుకుంటుంది. అయితే బాలు సూటిపోటి మాట‌ల‌తో ఆమె మ‌న‌సును గాయ‌ప‌రుస్తుంటాడు .దీంతో మీనాకు కోపం వస్తుంది. బాలును పక్కకు తీసుకెళ్లి.. ఏమైనా తిట్టాలనుకుంటే.. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్లు తిట్టమనీ, కానీ తన తల్లి ముందు తిట్టవద్దని, నీ మాటలకు వాళ్లు బాధపడుతారని, పండుగకు వచ్చాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని బాలుని బ్ర‌తిమిలాడుతుంది మీనా. ఇక బాలు కారు ఫైనాన్షియ‌ర్ లాక్కెళ్ల‌డంతో ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్లి మరోసారి గొడవపడతాడు. తన నుండి బలవంతంగా కారు ఎందుకు తీసుకవచ్చారనీ, తాను రెగ్యులర్ గా డబ్బులు కడుతున్నాను క‌దా అని ఆర్గ్యుమెంట్ చేస్తారు

నా భార్యను నన్ను నడిరోడ్డు దించి కారును ఎందుకు బలవంతంగా తీసుకోవచ్చారని నిలదీస్తాడు. నడిరోడ్డు మీద నీ భార్య ముందు కారు లాక్కొస్తేనే అంత బాధ పడుతున్నావ్.. అలాంటివి నా స్టాక్ ముందు నన్ను కాలర్ పట్టుకుని కొడితే.. నేను ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటానని అంటాడు. అందుకే నీ బతుకు మీద కొడుదామని కారును తీసుకరమ్మని చెప్పనని అన్నారు. నీకు కారు కావాలంటే నా కాళ్లు ప‌ట్టుకొని క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మ‌ని బాలుతో అంటాడు ఫైనాన్షియ‌ర్‌. నీ కాళ్లు ప‌ట్టుకునే క‌ర్మ నాకు ప‌ట్ట‌లేద‌ని ఫైనాన్షియ‌ర్‌కు వార్నింగ్ ఇచ్చి వ‌చ్చేస్తాడు బాలు. దీంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. నీలాంటి వారి దగ్గర పని చేయాల్సిన కర్మ తనకు లేదనీ, తనకు అడ్డువస్తే.. బాగొదని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

ఫైనాన్షియ‌ర్‌తో జ‌రిగిన గొడ‌వ‌ను మ‌ర్చిపోవ‌డానికి ఫుల్‌గా మందేసిన బాలు మ‌ళ్లీ ఆ మ‌త్తులో మీనా ఇంటికి బ‌దులుగా మ‌రో ఇంటికి వెళ్లి త‌లుపును కొట్ట‌బోతాడు. అది గ‌మ‌నించిన మీనా భ‌ర్త‌ను త‌మ‌ ఇంట్లోకి తీసుకొస్తుంది. తాగిన మ‌త్తులో నాకు అస‌లు మీ ఇంటికి రావ‌డ‌మే ఇష్టం లేద‌ని మీనా త‌ల్లితో అంటాడు బాలు. మీనా చేసిన త‌ప్పుల వ‌ల్లే కారు అమ్మేయాల్సివ‌చ్చింద‌ని, తండ్రికి గుండెపోటు వ‌చ్చింద‌ని నానా మాట‌లు అంటాడు. బాలు మాట‌ల‌తో మీనా ఎమోష‌న‌ల్ అవుతుంది. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఓ వైపు వ‌ర్ధ‌న్ డ‌బ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండ‌గా, ఇంకోవైపు త‌న తండ్రితో మాట్లాడుతామంటూ ప్ర‌భావ‌తి, మ‌నోజ్ బ‌ల‌వంతం పెట్ట‌డం జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో రోహిణి ఇర‌కాటంలో ప‌డుతుంది. ఈ స‌మ‌స్య‌ల నుంచి ఎలా గ‌ట్టెక్కాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంది.

రోహిణి కోసం తన అత్తగారింటి వద్ద దినేష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. దినేష్ చూసిన రోహిణి కంగారు పడుతూ.. మళ్లీ ఎందుకు వచ్చావు? అని అడుగుతుంది. అప్పుడు దినేష్‌… తనకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు ఇస్తే వెళ్లిపోతానని, లేదంటే మీ అత్తయ్య చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ సమయంలో ప్రభావతి బయటికి రాగా.. తాను ఎలాగైనా డబ్బులు సమకూరుస్తానని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని రిక్వెస్ట్ చేసి పంపిస్తుంది రోహిణీ. మరోవైపు ప్రభావతి మనోజ్ ను పిలిచి.. తన మామయ్యకు ఫోన్ చేసి.. పండుగకు మలేషియాకు వస్తున్నామని, టిక్కెట్లు బుక్ చేయమని అడుగు అని అడుగుమంటుంది ప్రభావతి. ఈ విషయమే మాట్లాడడానికి రోహిణి దగ్గరికి ప్రభావతి వెళ్తోంది.తాగిన మ‌త్తు మొత్తం దిగిన త‌ర్వాత మీనా గురించి వెతుకుతాడు బాలు. కానీ ఎక్క‌డ క‌నిపించ‌దు. మీనా ఎక్క‌డికి వెళ్లింద‌ని పార్వ‌తిని అడుగుతాడు. మీ ఇంటికి వెళ్లింద‌ని శివ స‌మాధాన‌మిస్తాడు. తాగింది నేన‌యితే కిక్కు మీ అక్క‌కు ఎక్కిందా అంటూ బాలు ఫైర్ అవుతాడు. కోపంలో ఒక మాట అంటే అంత పౌరుషం ఎంటి అని కోప్ప‌డుతాడు. ఆవేశంగా ఇంటికొస్తాడు. మీనా బ‌య‌టే క‌నిపించ‌డంతో ఆమెపై ఎగిరిప‌డ‌తాడు.నా బ‌తుకు బాగుంద‌ని మా అమ్మ‌కి చెప్పాను, కాని నా బ‌తుకు చెత్త‌గా ఉంద‌ని అమ్మ‌కి తెలిసింది అని మీనా అంటే అప్పుడు బాలు నిన్ను కాపురానికి తీసుకురావ‌డ‌మే నేను చేసిన త‌ప్పు అని మీనాతో వాద‌న‌కు దిగుతాడు బాలు. సత్యం తల్లి ఎవరికి చెప్పకుండా పండుగకు ఇంటికి వస్తుంది. దీంతో అందరూ అవాక్కైతారు.