Gunde Ninda Gudi Gantalu November 18th : అత్తారింట్లో హంగామా చేసిన బాలు.. క‌న్నీళ్లు పెట్టుకున్న పార్వ‌తి

Gunde Ninda Gudi Gantalu November 18th : అత్తారింట్లో హంగామా చేసిన బాలు.. క‌న్నీళ్లు పెట్టుకున్న పార్వ‌తి

Gunde Ninda Gudi Gantalu November 18th : పండ‌గ‌కి మీనా పుట్టింటికి వ‌చ్చిన బాలు తాగిన మ‌త్తులో రచ్చ చేయ‌డం మ‌నం చూశాం. ఇక త‌న క‌ళ్ల ముందే మీనాను బాలు అవ‌మానించ‌డం చూసి పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక .మరోవైపు డబ్బుల కోసం దినేష్ ప్రభావతి ఇంటికి వస్తాడు. తనకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు ఇవ్వకపోతే.. అసలు విషయం తన అత్తయ్య కు చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. మరోవైపు ప్రభావతి మనోజ్ ను పిలిచి.. పండుగకు మలేషియాకు టిక్కెట్లు బుక్ చేయమని ఫోన్ చేసి అడుగుమని చెబుతోంది.తాజా ఎపిసోడ్‌లో రోహిణి ద‌గ్గ‌ర‌కి ప్ర‌భావ‌తి వ‌చ్చి త‌న తండ్రికి కాల్ చేయ‌మ‌ని అన‌గా, విద్య‌కి ఫోన్ చేసి త‌న నెంబ‌ర్‌ని స్విచ్ ఆఫ్ చేసుకోమ‌ని, తన నెంబర్ నే నాన్న నెంబర్ గా చెబుతానని అంటుంది. దీంతో విద్య తన ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసుకుంది. ఆ తర్వాత విద్యకు ఫోన్ చేసి.. తన నాన్నకు ఫోన్ చేశానని చెబుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది.

స్విఛాఫ్ అని రావ‌డానికి ముందే విద్య‌కు ఫోన్ చేస్తుంది రోహిణి. మ‌లేషియా ట్రిప్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విద్య కు కాల్ చేసి ఆమె ఫోన్‌ను స్విఛాఫ్ చేయ‌మ‌ని అంటుంది. నీ నంబ‌ర్‌ను మా నాన్న నంబ‌ర్‌ అని అత్త‌య్య‌తో పాటు భ‌ర్త‌ను న‌మ్మిస్తాన‌ని త‌న ప్లాన్‌ను విద్య‌కు వివ‌రిస్తుంది. ఎలాగోలా ఈ సారి త‌ప్పించుక‌న్నాన‌ని రోహిణి అనుకుంటుంది. కారు విషయంలో మీనా అబద్ధం చెప్పిందని, నిజం చెప్పడానికి ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్తాడు. ఈ విషయాన్ని గమనించిన మీనా.. మేనేజ్ చేసి బాలుని ఇంట్లోకి పట్టుకొస్తుంది. దీంతో బాలు సీరియస్ అవుతాడు. తనని ఎందుకు పట్టుకోచ్చావనీ, తాను నిజం చెప్పడానికి ఓనర్ దగ్గరికి వెళ్లానని, అతడు చాలా మంచివాడని, అలాంటి వాడికి అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు అంటూ ఏదో ఏదో మాట్లాడుతా ఉంటాడు బాలు.

నేను నిజాలే చెబుతాన‌ని, నీలా అబ‌ద్దాలు ఆడ‌న‌ని మీనాతో అంటాడు బాలు. పెళ్లాం మాట విన్న‌వాడు బాగుప‌డ్డ‌ట్లు చ‌రిత్ర‌లో లేద‌ని మ‌త్తులో మీనాపై సెటైర్లువేస్తాడు. మీనా ఎంత చెప్పిన విన‌కుండా ఓన‌ర్ ఇంటి త‌లుపు కొడ‌తాడు. ఇంత రాత్రి వేళ ప‌క్కింటివాళ్ల త‌లుపు కొడితే ద‌రిద్రంగా ఉంటుంద‌ని మీనా అంటుంది. అయినా బాలు విన‌కుండా నిజం చెప్పాల్సిందే న‌ని ప‌ట్టుప‌డ‌తాడు.ఆ స‌మ‌యంలో మీనా తెలివిగా ర‌వ్వ‌ల‌డ్డులు చేశామ‌ని, అవి ఇవ్వ‌డానికి వ‌చ్చామ‌ని ఓన‌ర్‌తో అబ‌ద్ధం ఆడుతుంది. ర‌వ్వ‌ల‌డ్డులు ఇవ్వ‌డానికి ఫ్యామిలీ మొత్తం త‌మ ఇంటికి రావ‌డం చూసి ఓన‌ర్ ఆశ్చ‌ర్య‌పోతాడు. బాలును మాట్లాడ‌నివ్వ‌కుండా అత‌డిని లాక్కొస్తుంది మీనా. నా జీవితం స‌ర్వ‌నాశం అయింద‌ని బాధ‌ప‌డుతుంటాడు.

ఇక మీనాను మాట్లాడ‌వ‌ద్ద‌ని పార్వ‌తి అంటుంది. మీనాను త‌న క‌ళ్ల ముందే బాలు అవ‌మానించ‌డం చూసి పార్వ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మీనాను పెళ్లిచేసుకున్నందుకు నేను ఏడ్వాలి…మీరెందుకు ఏడుస్తున్నారు…మీనా మిమ్మ‌ల్ని కూడా మోసం చేసిందా అని పార్వ‌తిని అడుగుతాడు బాలు. బాలు నిద్ర లేవ‌డంతో పార్వ‌తి, సుమ‌తి టెన్ష‌న్ ప‌డ‌తారు. మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డంతో బాలుకు ఏం చెప్పాలో తెలియ‌క భ‌య‌ప‌డుతుంటారు. తాగిన మ‌త్తు దిగిన త‌ర్వాత రాత్రి నేను ఏదైనా త‌ప్పుగా మాట్లాడానా పార్వ‌తి, సుమ‌తిల‌ను బాలు అడుగుతాడు. రాత్రి నువ్వు తిట్టావ‌నే బాధ‌తో అక్క మీ ఇంటికే వెళ్లింద‌ని బాలుతో నిజం చెబుతాడు శివ‌. ఆ మాట విని బాలు షాక‌వుతాడు. ఎక్క‌డైతే మొగుడు తిడితే పెళ్లాం పుట్టింటికి వెళుతుంది…కానీ మీనా ఏంటి అత్తింటికి వెళ్లింద‌ని బాలు అంటాడు. నువ్వు తిట్టింది పుట్టింట్లో కావ‌డంతో అత్తింటికి వెళ్లింద‌ని శివ క‌వ‌ర్ చేయ‌బోతాడు.