Gunde Ninda Gudi Gantalu November 21 Episode : గుండె నిండా గుడి గంటలు తాజా సీరియల్లో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కారు చూడాలని సుశీల అంటే బాలు అనేక ఆలోచనలు చేస్తాడు.ఇక ఇదే సమయంలో రెండు గంటలు కార్ కావాలని గణపతిని అడుగుతాడు. నానమ్మ డబ్బులతో కారు కొన్నానని, వచ్చినప్పటి నుంచి కారు గురించే ఆమె అడుగుతుందని తనకు చూపించడానికి ఒక్కసారి ఈ కార్ తీసుకెళతానని గణపతిని తెగ బ్రతిమిలాడతాడు. అప్పుడు గణపతి కాస్త కరిగి కారు ఇవ్వడమే కాకుండా బాలు వెంట అతడి ఇంటికి గణపతి వస్తాడు. ఇక బాలు ఇంటికి వచ్చి గుడికి వెళ్దాం అంటూ హడావిడి చేస్తాడు. దీంతో తన బామ్మ అంతా ఆగ పడుతున్నావేంట్రా.. మన కారే కదా.. వెళ్దాంలే ఫస్ట్ నీ భార్య రెడీ అయిందా? లేదా? అది తెలుసుకోమని చెబుతుంది.
అలా మీనా కోసం బెడ్ రూమ్ కి వెళ్లాడు బాలు. ఆ సమయంలో బాలు తెచ్చిన గాజులను చూస్తూ ఉంటుంది మీనా. ఆ గాజులను చూపించి.. గాజులు నా కోసమే.. తీసుకువచ్చావా అని అడుగుతుంది.. లేదు నా మీనా కోసం తీసుకవచ్చాననీ, నీ కోసం కాదని చెబుతాడు. అయినా నేను ప్రేమించినా మీనా.. నువ్వు కాదు. ఇప్పుడు నా ముందు ఉన్నది. నన్ను మోసం చేసిన మీనా. నా మాటను తోసిపుచ్చిన మీనా. మా నాన్న జైలుకి పంపించిన మీనా .. అంటూ తిడతాడు. దీంతో మీనా ఫీలై కిందికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలు పంచ కట్టుకొని రెడీ అయ్యాయి కిందికి వస్తాడు.మీనా, బాలు జంటను చూసి సత్యం, సుశీల సంబరపడతారు. ఇద్దరి పార్వతీపరమేశ్వరుల్లా ఉన్నారని అంటారు. శివుడికి మెడలో పాము ఉంటుంది…నాకు ఎప్పుడు పక్కనే ఉంటుందని మీనాపై సెటైర్లు వేస్తాడు.
గుడికి బాలు, మీనా, సుశీల బయలుదేరబోతుండగా రోహిణి ఎదురస్తుంది. కాసేపు ఆగి వెళదామని, శకునం బాగాలేదని బాలు అంటాడు. గుడికి వెళదాం వస్తావా అని రోహిణిని అడుగుతుంది సుశీల. వాళ్లు పెద్దోళ్లు…మనతో ఎందుకొస్తారు. వాళ్ల అత్తగారితో వెళతారని రోహిణితో వెటకారంగా మాట్లాడుతాడు బాలు. తేడాలు చూపించే అలవాటు మాకు లేదని మనోజ్ అంటాడు. ఇక కారు దగ్గర గణపతిని చూసిన సుశీల ఇతడు ఎవరని అడుగుతుంది. డ్రైవర్ అని బాలు అబద్ధం ఆడుతాడు. ఈ కారు అంటే బాలుకు మహా ఇష్టమని, జాగ్రత్తగా చూసుకోమని అంటుంది. బాలు ముందు కూర్చోబోతాడు. కానీ సుశీల పట్టుపట్టి బాలు, మీనాలను వెనక కూర్చోమని చెబుతుంది. బ్రేక్ వేయడంతో బాలుపై పడుతుంది మీనా. సరిగ్గా కూర్చోలేవా అంటూ ఫైర్ అవుతాడు.. అది చూసి బాలుకు క్లాస్ ఇస్తుంది సుశీల. సమస్యలు ఉంటే పరిష్కరించుకొని సఖ్యతగా ఉండాలని హితవు పలుకుతుంది.
మరోవైపు.. రవి చాలా సంతోషంగా కనిపిస్తాడు. శృతి ఇంటికి రాగానే రవి సంతోషంతో ఎత్తుకుని తిప్పుతాడు. తనకు తన భామ నుండి ఫోన్ వచ్చిందని, తనని ఇంటికి రమ్మని పిలుస్తున్నారని అంటాడు రవి. కానీ, మీ బామ్మకు అసలు విషయం తెలియదు కావచ్చు. అందుకే పిలిచిందని ఏదో సందేహపడుతుంది శృతి. రవి మాత్రం తన బామ్మ అందరినీ కన్వెన్షన్ చేసి.. తనకు కాల్ చేసిందని చెబుతాడు. అయితే.. తాను కూడా వస్తానని చెబుతుంది శ్రుతి. కానీ, ఇప్పుడు వద్దు అక్కడ పరిస్థితులను బట్టి.. తానే తీసుకెళ్తానని రవి చెబుతాడు. ఇక రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని వర్ధన్ ఫోన్ చేయడంతో కంగారుపడిన ఆమె తల్లి కూతురిని చూసేందుకు వస్తుంది. ఆ టైమ్లో రోహిణి తలపై క్లాత్ కప్పుకొని పడుకొని ఉండటం చూసి అయ్యోయ్యో రోహిణి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు ఇంట్లో వాళ్లందరూ వస్తారు. రోహిణి తల్లిని చూసి ఈమె ఇక్కడెందుకు ఉంది, రోహిణిని చూసి ఎందుకు అరిచారు అని అడుగుతారు.