Gunde Ninda Gudi Gantalu November 22nd : గుండె నిండా గుడి గంటలు తాజా ఎపిసోడ్లో రోహిణితో ఎలా అయిన వంట చేయించాలని శిలా డార్లింగ్ భావిస్తుంది. ఈ క్రమంలో ప్రభావతిని తీసుకురమ్మని రోహిణికి చెబుతుంది. అయితే వంట చేయాలని చెప్పగా, ‘నాకు చేయడం రాదు కదా..’ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రోహిణీ. ఒకటంటే ఒకే వాయి అని.. ఇలా వేసి అలా వచ్చేయి అని రోహిణిని రిక్వెస్ట్ చేస్తుంది. వంటింట్లోకి వెళ్లగానే సుశీలమ్మ.. రోహిణిని ఓ రేంజ్ లో క్లాస్ పీకుతుంది. పనులు చేస్తేనే వస్తాయి.. మహారాణిలా కూర్చొంటే రావని అంటుంది. పిండి తీసుకొని గారెలు వెయ్యమని ఆర్డర్ వేస్తోంది. తనకు చేయడం రాదంటూ.. తప్పించుకుని ప్రయత్నం చేస్తుంది.
నేను నేర్పిస్తాలే దగ్గర ఉండి అని అంటుది. అయితే నేర్చుకుంటే తనతో మొత్తం పని చేపిస్తారనీ భావించిన రోహిణి తనకు తలనొప్పి వస్తుందంటూ డ్రామా ఆడుతుంది. దీంతో ప్రభావతి వెళ్లి రెస్ట్ తీసుకోమని హాల్లో కూర్చుండ పెట్టి.. తలపై చల్లని గుడ్డ వేస్తుంది. దీంతో రోహిణి హాల్ లో పడుకుంటుంది. అప్పుడు సుగుణమ్మ రావడం కూతురిని చూసి ఏమైందమ్మా అని అరవడం జరుగుతుంది. రోహిణికి తన నిజం ఎక్కడ బయటపడుతుందని టెన్షన్ పడుతుంది. ప్రభావతి వచ్చి ఎందుకలా అరుస్తున్నావు. ‘అయినా రోహిణికి నీకు సంబంధం ఏంటి?’ అని నిలదీస్తుంది ప్రభావతి. లేదు.. రోహిణి తలపై బట్టలు చూసి ఏదైనా గాయం అయ్యిందా అని కంగారు పడ్డానని కవర్ చేస్తుంది సుశీలమ్మ.
ఇంతలోనే బాలు కూడా ఇంటికి చేరుకుంటాడు. ఏమైంది అందరూ కంగారుగా ఉన్నారు. ఏం జరిగింది? అంటూ ఆరా తీస్తాడు. బాలు.. పండగ పూట ఇంటికి వచ్చిన వారు భోజనం చేయకుండా వెళ్తారా? తినేసి వెళ్లండి? అని చెబుతాడు. సత్యం కూడా.. పండగపూట ఇంటికి వచ్చే వారిని ఖాళీ కడుపుతో పంపడం సరికాదని, తిన్నాక వెళ్లండని చెబుతాడు. దీంతో రోహిణికి మరింత టెన్షన్ పెరుగుతుంది. ఇక రవి ఇంటికి రావడం, అదే సమయంలో బాలు బయటకు వెళ్లడంతో ఒకరికొకరు ఎదురు పడతారు.అప్పుడు రవిని పండగపూట ఎందుకు ఎందుకు వచ్చావు అంటూ కాలర్ పట్టుకొని నిలదీస్తాడు. అయితే బామ్మ ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచిందనీ, అందుకే ఇంటికి వచ్చానని చెబుతాడు రవి.
నువ్వు చేసిన ఘనకార్యం తెలిస్తే బామ్మనే చీ కోట్టి బయటకు పంపిస్తుందని, అనవసరంగా పండగ పూట .. ఇంటికి వచ్చి గొడవ చేయకుండా వెళ్లిపొమ్మని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. సుగుణమ్మను తన రూమ్ లోకి తీసుకువెళ్తుంది మీనా. కానీ.. తాము వెళ్తామని సుగుణమ్మ అనగానే.. పండగపూట ఎటు వెళ్తారు? అంటుంది మీనా. వంటింట్లోకి రోహిణి వెళ్లి.. ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ తన తల్లిని అడుగుతుంది. తనకు ఎవరో ఫోన్ చేసి.. నీకు యాక్సిడెంట్ అయింది అని చెప్పారని, ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్ చూసి.. అది దినేష్ నెంబర్ అని తెలుసుకుంటుంది. మీకు తర్వాత ఎప్పుడైన ఇలాంటి ఫోన్స్ వచ్చినా రావొద్దని చెబుతుంది.