Gunde Ninda Gudi Gantalu November 25th Episode : బాలుని గ‌ట్టిగా కౌగిలించుకున్న మీనా.. అందుకే క‌ష్టాలు ప‌డుతున్నామ‌న్న ప్ర‌భావ‌తి

Gunde Ninda Gudi Gantalu November 25th Episode : బాలుని గ‌ట్టిగా కౌగిలించుకున్న మీనా.. అందుకే క‌ష్టాలు ప‌డుతున్నామ‌న్న ప్ర‌భావ‌తి

Gunde Ninda Gudi Gantalu November 25th Episode : గుండె నిండా గుడిగంట‌లు గ‌త ఎపిసోడ్‌లో పండుగ పూట ఇలాగైనా రోహిణి చేత వంట చేయించాలని ఫిక్స్ అవుతుంది సుశీలమ్మ. తనకు తల తిరుగుతుంది అంటూ యాక్టింగ్ చేస్తుంది రోహిణి. దీంతో ప్రభావతి తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టి తలపై చల్లని గుడ్డ వేస్తుంది. ఇంతలోనే రోహిణి తల్లి సుగుణ ఇంటికి రావ‌డం ఆమె గ‌ట్టిగా అరవ‌డం చూసి అంద‌రు షాక్ అవుతారు. మరోవైపు.. రవి ఇంటికి చేరుకుంటాడు. ఇంతలోనే బాలు ఎదురుపడి.. రవి కాలర్ పట్టుకుని ఎందుకొచ్చావు? అని నిలదీస్తాడు. తనకు నానమ్మ ఫోన్ చేసిందని చెప్తాడు. ఇంకోసారి ఇంటికి రావద్దని వార్నింగ్ ఇస్తోంది. మీనా రావడంతో టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది.

ఇక తాజా ఎపిసోడ్‌లో మీనా.. రోహిణి ప్ర‌వ‌ర్త‌న‌ని గ‌మ‌నిస్తుంది. ఇక రోహిణి తెలుసా అంటూ సుగుణమ్మను నిలదీస్తుంది మీనా. ‘అదేంటమ్మా.. అలా అడుగుతున్నావ్.. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే కదా పరిచయం చేశారు అంటూ సుగుణ‌మ్మ కాస్త క‌వ‌ర్ చేస్తుంది.. ‘ఇంతకుముందు కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో క్లోస్ గా ఉన్నట్టు అనిపించింది. అందుకే ‘ అంటూ మరోసారి ప్రశ్నిస్తుంది మీనా. అనంత‌రం అందరూ టపాసులు కాల్చుతూ.. బయట ఎంజాయ్ చేస్తుంటారు. బాలు టపాసులు కాల్చకుండా సైలెంట్గా ఉండిపోతాడు. దీంతో మీనా..’ పిల్లాడితో మాత్రమే కాల్పిస్తున్నారు. మీరు కాల్చరా? భయపడుతున్నారా? అంటూ బాలుకి పంచ్ వేస్తుంది మీనా.

అప్పడు బాలు టపాసుల కాలుస్తూ.. గాలిలోకి విరుసుతాడు. దీంతో మీనా భయపడి బాలును గట్టిగా కౌగిలించుకుంటుంది. ఇప్పుడూ అర్థమైందా? భయం ఎవరికో అంటూ మీనాను ప్రశ్నిస్తాడు బాలు. ఇక రోహిణి తనను తాను కవర్ చేసుకుంటూ.. ‘పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదామ్మ ‘ అంటూ తన తల్లికి చెబుతోంది. మరోవైపు రవి ఇంటికి వచ్చి బాధపడతాడు. దీంతో ఏమైందని, అక్కడ ఏమైనా అన్నారా? అంటూ ప్రశ్నిస్తుంది శ్రుతి. ‘మా నానమ్మ ఫోన్ చేసి రమ్మంటే.. వాళ్లంతా రమ్మన్నారేమో అని నేనే తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళను. ‘పండుగ పూట కూడా నీ ఏడుపు ఏంటి? అవన్నీ విడిచిపెట్టు సంతోషంగా ఉండు’ అంటూ శృతి రవిని ఓదారుస్తుంది. ‘పెళ్లయ్యాక వచ్చిన మొదటి పండగది. ఈ రోజు నేను నీతో హ్యాపీగా గడపాలి. మనకి ఇది ఒక మంచి మెమరీ కావాలని కోరుకుంటున్నాను.

ప్లీజ్ రవి నా బేబీ కాదు స్మైల్.. ‘అంటూ రవిని మోటివేట్ చేస్తుంది. పండుగ అయిపోవడంతో సుగుణమ్మ, చింటూ ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో చింటూ.. బాధగా రోహిణిని చూస్తూ వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ‘ఆ పిల్లవాడు ఏంటి నిన్నే బాధగా చూస్తూ వెళుతున్నాడు’ అంటూ ప్రశ్నిస్తుంది. వెంటనే బాలు రియాక్ట్ అయి.. ఎవరికి ఏది ఇస్తే.. అది రిటర్న్ అవుతోంది..ఏం మనిషి నువ్వు’ అంటూ శీలా డార్లింగ్ గట్టిగా అరుస్తుంది. ‘ ఆ కాలంలో మీరు అలా చేసే.. అసలే వెనకేయలేదు. కాబట్టే.. ఈ కాలంలో మేము ఇలా కష్టాలు పడుతున్నాం’ అంటుంది ప్రభావతి. ‘సరుకులు తెచ్చేది నేను.. వంట చేసేది మీనా.. అనవసరంగా మీనా పుట్టింటి వాళ్ళ దాకా వెళ్తావు? ఎందుకు తిన్నగా మాట్లాడలేవా? అంటూ మీనాకు సపోర్టుగా మాట్లాడుతాడు బాలు. ‘దాని వెనకేసుకొస్తున్నావ్ ? అప్పుడే అన్ని మర్చిపోయావా’ అంటూ మళ్ళీ పాత విషయాలను గుర్తుకు చేస్తుంది ప్రభావతి