Gunde Ninda Gudi Gantalu November 26th Episode : గుండె నిండా గుడిగంటలు గత ఎపిసోడ్‌లో మీనా.. రోహిణి ప్రవర్తనలో తేడాని గమనిస్తుంది. ఆ ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ టపాసులు కాల్చుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో చిన్నోడు పై టపాసుల మెరుగులు పడడంతో రోహిణి వెంటనే రియాక్ట్ అవుతుంది. తన కొడుకును దగ్గరకు హత్తుకుంటుంది. ఈ ఘటనతో అందరూ షాక్ అవుతారు. ఇక తాజా ఎపిసోడ్‌లో తన గురించి సపోర్టుగా మాట్లాడినందుకు బాలుకు థాంక్స్ చెప్తుంది మీనా. తాను ఎన్ని రోజులైనా క్షమించమని, తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే తీసుకువచ్చానని మీనాను ఎగతాళి చేస్తాడు. ఈ విషయాన్ని బాలు నానమ్మ సుశీల గమనిస్తుంది. మీనాను ఎందుకు తిడుతున్నాంటూ బాలుని నిలదీస్తుంది. ఇంతలో సత్యం అక్కడికి వస్తాడు.
అయితే నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు.. మీనా సరైన సమయంలో మందులు ఇవ్వలేదు. ఆ కోపంతోనే బాలు మీనాను తిడుతున్నాడు’ అంటూ సత్యం కవర్ చేస్తాడు. ‘మీనా ఎప్పుడు తప్పు చేయదు. ఒకవేళ తప్పు చేస్తే.. దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది’ అని సర్ధి చెబుతారు. మరోసారి ఇలాంటి గొడవలు పడ్డట్టు తెలిస్తే బాగోదని హెచ్చరిస్తుంది సుశీల. మరో నాలుగు రోజులు ఉండి వెళ్లవచ్చు కాదా అని సత్యం రిక్వెస్ట్ చేస్తాడు. ‘సంక్రాంతికి మీరు ఎలాగు అక్కడికి వస్తారు కదా.. ఇప్పడు వెళ్తా..’ అంటూ చెబుతోంది సుశీల. నిన్ను నమ్మి మీ ఇంటికి వచ్చిన మీనాను సరిగ్గా చూసుకోమని, తనకి బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా.. నువ్వే తనకు దిక్కు అని చెబుతుంది. అలాగే మనోజ్ కు ఇంటి ఖర్చులలో భాగం కమ్మని, రోహిణిని పిలిచి ఇంటి పనులలో మీనాకు సహాయం చేయమని చెబుతుంది సుశీల
మీనాను కించపరచాలని ఉద్దేశంతో బాలుని పిలిచి.. మీ అత్తగారు పండుగకి పిలిచి ఏమైనా పెట్టారా? లేదా? అని బాలుని నిలదీస్తుంది ప్రభావతి. దీంతో బాలుకి ఎక్కడలేని కోపం వస్తుంది. తన అత్తగారు పండుగకు పిలిచి బంగారు ఉంగరం పెట్టారని, ఇంట్లో వారందరికీ చూపిస్తారు. దీంతో ప్రభావతి ముఖం చిన్నబోతోంది. ఆ తర్వాత సత్యం బాలు తో మాట్లాడుతూ.. సొంత కారుని అమ్మేశావు సరే .. మరి రెంటుకు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు. ‘ఓనర్ కూతురు ఢిల్లీ నుండి వస్తుందని, ఆమెకు కారు కావాలని వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు. దీంతో ప్రభావతి వారం రోజులు డబ్బులు ఇవ్వవా? అంటూ నిలదీస్తోంది.
వారం రోజులు డబ్బులు ఇవ్వకపోతే .. ఇల్లు ఎలా గడుస్తుందని ఆమె అడుగుతుంది. మరోవైపు రోహిణి వెళ్లి తన శాలరీని తీసుకువచ్చి ప్రభావతికి ఇస్తుంది. మనోజ్ సంగతి అంటే.. వాడు ఎప్పుడో తీసుకవచ్చి.. ఇచ్చాడంటూ కవరింగ్ చేస్తుంది ప్రభావతి. మొగడు పెళ్లాలు ఇద్దరూ ఇంట్లో ఊరికే కూర్చొని తింటే.. వారం రోజులు ఎలా గడుస్తాయని ప్రభావతి అనడంతో, మీనా తాను ఒక పూటనే భోజనం చేస్తానని వెళ్ళిపోతుంది… అయితే బాలుకి మీనా థాంక్స్ చెప్తుంది. కానీ, బాలు మళ్లీ పాత పాటే పాడతాడు. నీ వల్లనే ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాననీ, తన కారు పోయిందని, తన నాన్న హాస్పిటల్లో పడ్డాడని, డబ్బులు ఇవ్వకపోతే ఫైనాన్సర్ ను కొట్టాననీ, ముందే డాక్యుమెంట్స్ ఇచ్చిన విషయం తనకు చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదని మళ్లీ మీనాపై తన అసహనం వ్యక్తం చేస్తాడు బాలు.