Gunde Ninda Gudi Gantalu November 27th :గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్‌లో శీలా డార్లింగ్ వార్నింగ్ చూస్తుంది. బాలు, మీనా గొడవపడడంపై ఆమె మండిపడుతుంది.ఆమె వెళ్లిపోవడంతో ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తుంది. మీనా ను కించపరిచేలా మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత సొంత కారుని అమ్మేశావు సరే .. మరి రెంటుకు తీసుకున్న కారు ఏమైంది? అని ప్రశ్నిస్తాడు సత్య. వారం రోజుల తర్వాత ఇస్తానని ఓనర్ చెప్పాడంటూ కవర్ చేస్తాడు బాలు. తాజా ఎపిసోడ్‌లో బాలు జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. తనకు తెలిసిన కార్ ఏజెన్సీలకు వెళ్లి జాబ్ కోసం ట్రై చేసిన కూడా ఎవరు తాము జాబ్ ఇవ్వలేమని చెబుతుంటారు.అందుకు కారణం కూడా చెబుతారు.
గతంలో నువ్వు పని చేసిన వ్యక్తి దగ్గరే చాలామంది ఫైనాన్స్ తీసుకుంటారని, తనపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలుసుననీ, ఒకవేళ నీకు జాబ్ ఇస్తే.. ఇచ్చినవారికి ఎఫెక్ట్ పడుతుందని, అందుకే ఈ కారు ఏజెన్సులలో నీకెవ్వరు జాబ్ ఇవ్వరని అంటారు. అప్పుడు బాలు తనే డ్రైవర్‌గా పని చేస్తానని అంటాడు. ఇక రోహిణికి తన బాయ్ ఫ్రెండ్ దినేష్‌కి కాల్ చేసి తనకు వారం రోజుల్లోగా 50వేలు ఇవ్వాలని, మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తాడు దినేష్. గతంలో ఇవ్వాల్సిన 25,000 ప్రస్తుతం 50,000.. మొత్తం 75 వేల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే.. ఈ సారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనీ, తన రహస్యం మొత్తం ఇంట్లో వారికి చెప్తానని హెచ్చరిస్తాడు దినేష్.
ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని రోహిణి చెప్పిన దినేష్ వినడు. వారం రోజులలో ఇవ్వాలనే కండీషన్ పెడతాడు. మరోవైపు సరుకులు వచ్చాయి, డబ్బులు కట్టాలని మీనాను డబ్బులు ఇవ్వమని అడుగుతుంది ప్రభావతి . ఇంతకీ బాలు డబ్బులు ఇచ్చాడా లేదంటూ నిలదీస్తోంది. బాలు ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదనీ చెబుతుంది మీనా. దీంతో ప్రభావతి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుందని, డబ్బులు ఇవ్వకుండా మొగడు పెళ్లాలు ఇంట్లో కూర్చోని తింటారా? అని దారుణంగా మాట్లాడుతుంది ప్రభావతి. రోహిణి ముందు అవమానించడాన్ని మీనా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది.
ఎలాగైనా డబ్బులు తీసుకురావాలని మీనా తన గాజులను తీసుకెళ్లి తాకట్టు పెట్టాలని భావిస్తుంది. అలా తనకు తెలిసిన షాప్ దగ్గరికి వెళ్లి.. డబ్బులు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.. కానీ, ఆ షాప్ మూసివేసే సరికి ఏం చేయాలో దిక్కు తోచదు. ఈ సమయంలో తన తమ్మునికి ఫోన్ చేస్తుంది మీనా. తాను శివాలయం దగ్గర ఉన్నాననీ, అర్జెంట్ గా రమ్మని చెబుతోంది మీనా. తన తమ్ముడు రాగానే.. తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలని, తన గాజులు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకురమ్మని చెబుతుంది. తన అక్క పరిస్థితిని గమనించిన శివ.. అవసరం లేదనీ, తాను వేరే దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాననీ, వాళ్లు అడ్వాన్స్ అడిగితే డబ్బులు ఇస్తారనీ, తాను తెచ్చి ఇస్తానంటూ చెప్తాడు శివ. అప్పుడు మీనా ఇప్పుడు జాబ్‌లు అవసరం లేదు. ఆ జాబులు మానేసి.. చదువుకోమని చెప్పి.. తన గాజులు తమ్ముడికి ఇచ్చి.. పంపిస్తుంది మీనా.