Gunde Ninda Gudi Gantalu Today Episode : గుండె నిండా గుడి గంటలు పాత ఎపిసోడ్ లో బాలుకి చెప్పకుండా మీనా తన అత్తగారింటికి వెళ్లిపోవడంతో బాలుకి కోపం రావడం, అత్త సర్ధి చెప్పడం జరుగుతుంది. ఇక షీలా డార్లింగ్ ఎంట్రీ ఇస్తుంది. తన కొడుకు సత్యం చూసి ఏంట్రా అలా ఉన్నావ్ అంటూ ఆరా తీసుంది. హాస్పిటల్ కి వెళ్లిన మనిషి అలా కాకపోతే ఎలా ఉంటారని ప్రభావతి అంటుంది. దీంతో షీలా డార్లింగ్ కంగారు పడుతుంది. వెంటనే అదేం లేదు.. జ్వరం వస్తే.. హాస్పిటల్ తీసుకెళ్లాము అని కవరింగ్ చేసి చెప్తాడు బాలు.
ఇక తాజా ఎపిసోడ్లో బాలుకు సమస్య ఏంటని మీనాను అడుగుతుంది సుశీల. వాడిని పెంచింది నేను. వాడి మొహం చూసి చెప్పలేనా. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉందా. వాడు మళ్లీ నిన్ను అపార్థం చేసుకున్నాడా అని సుశీల అడుగుతుంది. ఆ మాటలు వింటున్న బాలును చూస్తుంది మీనా. ప్లీజ్ చెప్పొద్దు అని బతిమిలాడుకుంటాడు బాలు. దాంతో సుశీలను హగ్ చేసుకుంటుంది మీనా. మీనాను ఒక్కటి చేర్చి మురిసిపోతుంది సుశీల. నా చేతిలో మునిమనవడిని ఎప్పుడు పెడుతున్నారు అని సుశీల అడుగుతుంది. దాంతో ఇద్దరు సిగ్గు పడతారు. అదొక్కటే మిగిలి ఉంది అని బాలు అంటాడు. సరే అని కారు తీసుకెళ్లేందుకు వెళ్తున్న బాలును ఆపి పండక్కి స్నానం చేయకుండా బయటకు వెళ్లడమేంట్రా అని అంటుంది సుశీల.దాంతో సరేనని వెళ్తాడు బాలు.
మనోజ్, బాలు స్నానానికి వస్తారు. ఈరోజుల్లో తలపెట్టుకుని స్నానం చేయడమేంటని మనోజ్ అంటాడు. మీ అమ్మ ఇలా చేయించడంలేదా అని సుశీల అడిగితే.. అంతా టైమ్ ఎక్కడిది. అందరూ బిజీగా ఉంటున్నారు కదా అని ప్రభావతి అంటుంది.త ప్రభావతి ఇంట్లో పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి. పండగ పూట నూనెతో తలంటుకొని స్నానం చేస్తే కుళ్ళు మొత్తం పోతుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రభావతిపై పంచి వేస్తుంది షీలా డార్లింగ్. వెంటనే బాలు రియాక్ట్ అవుతు మనోజ్ గాడికి పెట్టు శీలా డార్లింగ్.. వాడి కుళ్ళు మొత్తం పోవాలి అంటాడు. దీంతో పక్కనే ఉన్న సత్యం పండగ కూడా గొడవలేంట్రా చిన్న పిల్లలా అని మందలిస్తాడు. చిన్నపిల్లలు అంటే గుర్తొచ్చింది చిన్నోడు ఎక్కడ ఉన్నాడ్రా.. వాడు కనిపించట్లేదు అంటూ శీల డార్లింగ్ ప్రశ్నిస్తుంది. దీంతో ఇంటిల్లిపాది ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక షాక్ అవుతారు. . బాలు, మీనాకు వచ్చే ఏడాదికి పండండి బిడ్డను తన చేతిలో పెట్టాలని సుశీల ఆశీర్వదిస్తుంది. నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది.