Gundeninda Gudigantalu November 30th Episode : గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్‌లో మీ ఆయన మా ఆయన పనిచేస్తున్న అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేస్తున్నాడట నీకు తెలుసా అని మీనాకి చెప్తుంది పక్కింటి వ్యక్తి. బాలు ఎక్కడ పని చేస్తున్నాడని వెళ్లాలనుకుంటుంది. వెళ్లి చూడగా, బాలు కార్లను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఓ కారు ఓనర్ వచ్చి తన కారులో ఫోను కనిపించడం లేదని, ఫోన్ తీసావా? అంటూ బాలుని నిలదీస్తాడు. ఫోన్ గ్రౌండ్ లో మర్చిపోయారని ఓ వ్యక్తి ఫోన్ ఇవ్వగానే అందరు మౌనంగా వెళ్ళిపోతారు. మీనా బాలుకు జరిగిన అవమానం చూసి అదే తలచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. తాజా ఎపిసోడ్‌లో రవి, శృతిలు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శృతికి ఫ్రెండ్ ఫోన్ చేసి హనీమూన్ కి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం అని చెబుతుంది.
అయితే హానీమూన్ కి వెళదాం అని రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే మన రెండు ఫ్యామిలీలు హ్యాపీగా లేరు మనం ఎలా ఇలా అంటాడు. మనం వెళ్ళిపోయినా బాధ వారి మొహాల్లో లేదు. ఉంటే మన కోసం ఒక్కరైనా వచ్చేవారు. అప్పుడు మనం వాళ్ల కోసం ఆలోచిస్తూ అన్ని ఆశలు వదిలేసుకోవడం అవసరమా అని శృతి అంటుంది. ఇక శృతి ఫీల్ అవుతుందని రవికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒప్పుకుంటాడు. దాంతో శృతి ఫుల్లుగా హ్యాపీ అవుతుంది. ఇక ఎక్కడికి వెళదామని ప్లాన్ చేస్తుంటారు. ఇక బాలు ఇంట్లో వాళ్ల బాధ తట్టుకోలేక ఏదో పనిలో జాయిన్ అయ్యాడని మీనా అనుకుంటుంది. బాలు కష్టం తలచుకొని, తనని దొంగా అన్నారని అనుకుంటూ బాధ పడుతుంది.
ప్రభావతి తన ముద్దుల కొడుకు మనోజ్ కు లేని జాబ్ గురించి తెగ బిల్డప్ ఇస్తుంది ప్రభావతి. జాబుకు వెళ్లడం కోసం కంపెనీలో చెప్పి కారు తీసుకోమని తండ్రి సత్యం చెప్పడంతో .. ప్రభావతి కూడా మనోజ్ కు సపోర్టుగా మాట్లాడుతుంది. మామయ్య కారు కొనుకొమంటున్నాడని, దానికి వాడు మొహమాటపడుతున్నాడని రోహిణికి చెబుతుంది ప్రభావతి.. మనోజ్ తో కలిసి నువ్వే వాడి వెంట వెళ్లి కారు తీసుకుని రండి అని ప్రభావతి చెబుతుంది. ఆ మాట విన్న మనోజ్ మోహంలో టెన్షన్ మొదలవుతుంది. ఇక రోహిణి కూడా మనోజ్ గొప్పలు చెప్పడంలో రెచ్చిపోతుంది. మనోజ్ ను కారు తీసుకోమని బలవంతపు పెడుతుంది. ఈనెల మనోజ్ 15 కార్లు అమ్మాడంటూ ప్రభావతికి రోహిణి చెబుతోంది.
మనోజ్ కు పడుకోవడానికి ఏసీ క్యాబిన్ కూడా ఇచ్చారంటూ ప్రభావతి చెప్పుకురాగా, మీకు ఎలా తెలుసు అత్తమ్మ అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోజ్ కంగారు పడతాడు.. అమ్మ ఎందుకు నన్ను అడ్డంగా ఇరికించేసింది అనిఆలోచనలోకి వెళతాడు. రోహిణి కారును ఎప్పుడు కొందామని అడుగుతుంది. వీళ్ళను చూస్తూ సత్యం ఉంటాడు. అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది. మీనా ఎక్కడకు వెళ్ళావు అనగానే ప్రభావతి ఎవరి కొంపలు కూల్చి కొంప మీదకు తీసుకొని వస్తున్నావు అంటుంది. దానికి సత్యం ఎప్పుడు మీనాను అనడమే పనిగా పెట్టుకున్నావా అని అరుస్తాడు. మీనా మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది అంటూ బాధ పడుతుంది. మరోవైపు మనోజ్ ఇరకాటంలో పడుతాడు. మనోజ్ బాగోతం ఎలా భయటపడుతుందో వేచి చూడాలి.