Prabhas : క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ ఎంత సేపు క‌నిపిస్తాడు.. దీని గురించే అంద‌రిలో చర్చ‌

Prabhas : క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ ఎంత సేపు క‌నిపిస్తాడు.. దీని గురించే అంద‌రిలో చర్చ‌

Prabhas : బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు భారీ బ‌డ్జెట్‌తో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తున్నాడు.బాహుబలి, సలార్, కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీలతో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా వరుస విజయాలు అందుకుని యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ మార‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ ‘రాజా సాబ్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్ర‌భాస్. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మూవీ తరువాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ సినిమాలో నటించనున్నారు. ఈ మూవీ కూడా సెట్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొనున్నారు.

పాన్ ఇండియా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న ప్రభాస్ ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆ సినిమా పేరే ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ‘కన్నప్ప’ సినిమాను వివిధ భాషల్లో .. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి ఈ సినిమాలో ప్రభాస్ మెరవనున్నాడు. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన ఇలా గెస్టు రోల్ చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. ప్రభాస్ ఎంత చిన్న రోల్ చేసినా అది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుందనే విషయంలో సందేహం లేదు.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్వ‌ర‌లో ప్ర‌భాస్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్‌తో పాటు టీజ‌ర్ కూడా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో విష్ణు ఉన్నాడ‌ట‌. ఈ సినిమాలో ప్రభాస్ చేస్తున్న నంది పాత్ర చాలా హైలెట్ గా నిలవబోతుందట.ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో ప్రభాస్ 5 నిమిషాల పాటు కనిపించబోతున్నాడనే వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇక స్క్రీన్ మీద ప్రభాస్ రన్ టైమ్ ఎంత సేపు ఉంటుందో తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్ర‌భాస్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీలో నటించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నది.