Sunny Leone : బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ యాక్ట్రెస్‌గా మారిన సన్నీ లియోన్ తన అందచందాలతో పాటు క్యూట్ డ్యాన్స్‌తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ భామకి హిందీలోనే కాదు పలు భాషలలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సన్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని భావించిన పబ్ యాజమాన్యానికి పెద్ద షాక్ తగిలింది. శనివారం (నవంబర్ 30న) రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో సన్నీలియోన్.. లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉండగా.. ఆశగా ఎదురుచూసిన యువకులకు నిరాశ ఎదురైంది.
జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్ యజమానులు శనివారం రాత్రి 11 గంటల నుంచి 12:30 గంటల వరకూ సన్నీలియోన్ పర్ఫామెన్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన కోసం పజ్ యాజమాన్యం టికెట్లు పెట్టగా.. ఆమెను లైవ్‌లో చూసేందుకు యువకులు ఎగబడ్డారు. భారీ రేట్లు పెట్టినా.. ఎగబడిమరీ.. టికెట్లు కొనుగోలు చేశారు.ఇక సన్నీ కూడా హైదరాబాద్‌కి వచ్చింది. అయితే ఓ వైపు పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడుపోవటం.. తమ అభిమాన తార వస్తుందని తెలియటంతో టికెట్లు కొన్నవారితో పాటు మిగతా యువకులు కూడా పబ్ వద్దకు భారీగా చేరుకున్నారు. దీంతో.. పబ్ దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా అనుకున్నట్టు సన్నీలియోన్ ప్రదర్శన లేకపోతే కస్టమర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని భావించిన పబ్.. అనుమని కోసం విశ్వప్రయత్నాలు చేశారు.
కాని ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు.కాని చివరి నిమిషంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.సన్నీ లియోన్ అనారోగ్యం కారణంగా ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు. దీంతో అక్కడి వచ్చిన వరకు నిరాశతో వెనుదిరిగారు. కాగా తమ టికెట్ల డబ్బులు రిఫండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సుమారు 100 మంది పోలీసులు రాత్రి ఒంటి గంట వేదిక దగ్గరే ఉన్నారు. కార్యక్రమం జరగదని స్పష్టం చేశారు.