ఐఐసీటీలో భారీగా ఖాళీలు.. సైంటిస్ట్ పోస్ట్‌ల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌..

ఐఐసీటీలో భారీగా ఖాళీలు.. సైంటిస్ట్ పోస్ట్‌ల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌..

హైదరాబాద్ లోని ఐఐసీటీ నుంచి ఉద్యోగ ప్ర‌క‌ట‌న వెలువడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. లక్షకు పైగా జీతం అందిస్తారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకునే అవ‌కాశం ఉండ‌గా, దరఖాస్తులకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 31 సెంటిస్ట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ల‌కి సంబంధించిన‌ అభ్యర్థుల వయసు 32 ఏళ్ల లోపు ఉండాలి. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, అగ్రో కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానికి కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్గానిక్ కోటింగ్, పాలిమర్స్, కెమికల్ బయాలజీతో పాటు డిజైన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఎంపికైన వారికి రూ. 1,34,907 జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ చేసి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలియ‌జేశారు. అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు రుసుం కింద రూ.500 చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.iict.res.in/g4recruitment/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 09, 2024 తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించరు. నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును https://www.onlinesbi.sbi/sbicollec లింక్ పై క్లిక్ చేసి చెల్లించుకోవచ్చు.

iict hyderabad recruitment 2024 how to apply

అధికారిక నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం, పేర్కొన్న ఫీల్డ్‌లో సంబంధిత పని అనుభవం తప్పనిసరి.ఎంపిక ప్రక్రియ రెండు దశలను కలిగి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్ : అకడమిక్ అర్హతలు మరియు అనుభవం ఆధారంగా.ఇంటర్వ్యూ : షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు చివరి ఇంటర్వ్యూకి ఆహ్వానించబడతారు.దరఖాస్తుదారులు ₹500 దరఖాస్తు రుసుమును అధికారిక చెల్లింపు లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఎలా దరఖాస్తు చేయాలి అంటే పూర్తి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కాగా, ఇందులో విద్యార్హతలు, అనుభవం మరియు వ్యక్తిగత సమాచారంతో సహా అవసరమైన వివరాలను పూరించండి. ఫీజు చెల్లించడానికి అధికారిక చెల్లింపు లింక్‌ని ఉపయోగించండి.దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : డిసెంబర్ 9, 2024.