Subbaraju : సుబ్బ‌రాజు భార్య బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్ద‌దే.. ఆమె ఏం చేస్తుంది అంటే..!

Subbaraju : సుబ్బ‌రాజు భార్య బ్యాక్‌గ్రౌండ్ చాలా పెద్ద‌దే.. ఆమె ఏం చేస్తుంది అంటే..!

Subbaraju : న‌టుడు సుబ్బ‌రాజు లేటు వ‌య‌స్సులో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.. గతంలో పెళ్లి పై ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చిన సుబ్బరాజు ఇలా స‌డెన్‌గా పెళ్లి చేసుకోవ‌డంతో అంద‌రు అనుమానం వ్య‌క్తం చేశారు. ఏదో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ పెళ్లి ఫ్రాంక్‌ చేసి ఉంటారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఫ్రాంక్‌ కాదు, అది నిజమైన పెళ్లి అంటూ ఆయన సన్నిహితులు సైతం క్లారిటీ ఇచ్చారు. స్రవంతి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుబ్బరాజు, స్రవంతి లకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇక స్ర‌వంతి గురించి అంద‌రు ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో సుబ్బరాజు పెళ్ళాడిన అమ్మాయి పేరు స్రవంతి అని తెలిసింది. ఆమె ఒక డాక్టర్. యూఎస్ లో ఉంటుందట. అక్కడ డెంటిస్ట్ గా చేస్తుందట. వీరి పెళ్ళి కూడా యూఎస్ లోనే చాలా సింపుల్ గా జరిగిపోయిందట. చూస్తుంటే పెద్ద వయస్సు ఏం లేనట్టు కనిపిస్తుంది. సుబ్బరాజుకంటే చాలా చిన్నవయస్సే అని టాక్. అయితే వీరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.. అనుకుని అండ‌ర్‌స్టాండింగ్‌తోనే లేట్ గా పెళ్లి చేసుకున్నారని కొంత మంది వాదన. కొలంబియా యూనివర్శిటీ జాన్స్‌ హప్కిన్స్‌ యూనివర్సిటీల నుంచి స్రవంతి బీడీఎస్, డీడీఎస్ పట్టాలను పొందరు.

సోషల్‌ మీడియాలోనూ ఆమెకు ఖాతా ఉంది. ఇన్‌స్టా బయోలో తన ఫస్ట్‌ లవ్‌ సైన్‌, మ్యారీడ్ టు ఫిట్‌నెస్‌ అని పెట్టారు. తనకు డ్యూటీ అంటే ప్రాణం అన్నట్లుగా ఆమె సోషల్‌ మీడియా ద్వారా చేసే పోస్ట్‌ల‌ని బ‌ట్టి అర్ధ‌మవుతుంది. సుబ్బరాజు, స్రవంతిల పరిచయం, ప్రేమ, పెళ్లి టాపిక్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియా ద్వారా వస్తున్నాయి. సుబ్బరాజు పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ.. హైదరాబాద్‌లో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట.